SK20: ఉక్రెయిన్‌ బ్యూటీతో శివకార్తికేయన్‌ రొమాన్స్‌ | Ukraine Actress Maria Ryaboshapka Female Lead In SK20 Project | Sakshi

SK20: శివ కార్తికేయన్‌-అనుదీప్‌ మూవీ, హీరోయిన్‌గా ఉక్రెయిన్‌ మోడల్‌

Mar 21 2022 8:03 PM | Updated on Mar 21 2022 8:03 PM

Ukraine Actress Maria Ryaboshapka Female Lead In SK20 Project - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌ అప్‌కమింగ్‌ మూవీ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. శివ కార్తీకేయన్‌ హీరోగా ‘జాతీరత్నాలు’ ఫేం అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. ఎస్‌కే20 అనే వర్కింగ్‌ టైటిల్‌ ఇటీవల చెన్నైలో ఈ మూవీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చారు మేకర్స్‌. ఈ మూవీతో ఉక్రెయిన్‌ నటి, మోడల్‌ ఇండియన్‌ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. 

మరియా ర్యాబోషాప్క శివకార్తికేయన్‌తో సరసన ఈ ఉక్రెయిన్‌ బ్యూటీ సందడి చేయబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు. అలాగే హీరో శివకార్తీకేయన్‌ కూడా ‘వెల్‌కమ్‌ మరియా ర్యాబోషాప్క’ అంటూ ట్వీట్‌ చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫుల్‌ లెన్త్‌ కామెడీతో సాగే ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌లో సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై నారాయణ్ దాస్ కె నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement