Watch: Shivangi One Minute Deewana Song Trending On Social Media, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Deewana Song: సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న దివానా సాంగ్‌ని విన్నారా?

Published Thu, Nov 24 2022 10:54 AM | Last Updated on Thu, Nov 24 2022 12:44 PM

Shivangi One Minute Deewana Song Trending In Social Media - Sakshi

తమిళసినిమా: ప్రముఖ యువ గాయని శివాంగి పాడి నటించిన దివానా సాంగ్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారింది. నటుడు శివకార్తికేయన్‌ కథానాయకుడిగా నటించిన డాన్‌ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అందులో గాయని శివాంగి ముఖ్యపాత్రను పోషించి అందరినీ అలరించారు. కాగా ఈమె ప్రైవేట్‌ సాంగ్స్, ఆల్బమ్స్‌లను రూపొందిస్తున్నారు.

తాజాగా 1మిన్‌ మ్యూజిక్‌ సంస్థ రూపొందించిన మ్యూజిక్‌ ఆల్బమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫాంలో విడుదలై సంగీత ప్రియులను అలరిస్తోంది. సంగీత కళాకారులను, సినీ ఔత్సాహికులను ప్రోత్సహించే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌ ప్రత్యేకంగా రూపొందించిన ప్లాట్‌ఫామ్‌ 1మిన్‌ మ్యూజిక్‌. ఇందులో దేశవ్యాప్తంగా 200 మందికి పైగా కళాకారులు తమ ఒక్క నిమిషం పాటలను విడుదల చేసి గుర్తింపు పొందుతున్నారు.

కాగా ఇన్‌స్టాగ్రామ్‌  తమిళ కళాకారుల కోసం సిల్వర్‌ ట్రీ సంస్థతో కలిసి 25 మంది కళాకారులతో పాటల ఆల్బమ్‌లను రపొందిస్తున్నారు. అందులో భాగంగా గాయని, నటి శివాంగి పాడి నటించిన దీవానా అనే 1మిన్‌ మ్యూజిక్‌ సాంగ్‌ ఆల్బమ్‌గా ఇటీవల విడుదల చేశారు. కుమరన్‌ దర్శకత్వం వహింన ఈ మ్యూజిక్‌ ఆల్బమ్‌ సంగీత ప్రియుల విశేష ఆదరణతో ట్రెండింగ్‌గా మారిందని గాయని శివాంగి తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement