![Tamil Hero Sivakarthikeyan Remuneration Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/19/Sivakarthikeyan2.jpg.webp?itok=ixSTQmVu)
Young Hero Sivakarthikeyan Remuneration Goes Viral: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ‘రెమో’, ‘కౌసల్యా కృష్ణ మూర్తి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పరిశ్రమలోకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా తెలుగులో డబ్ చేస్తూ అటూ కోలీవుడ్, ఇటూ టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ ఏడాది శివ కార్తికేయన్ నటించిన డాక్టర్ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో శివకార్తికేయన్ సినిమాలకు మార్కెట్ కూడా పెరిగిపోయింది.
చదవండి: నాగ్ సినిమా మేకర్స్‌కు చుక్కలు చూపించిన అమలా పాల్, మెహ్రీన్!
ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. ఈ నేపథ్యంలో అతడి రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం కార్తికేయన్ తన ఒక్కో సినిమాకు రూ. 27 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు పారితోషికంగా అందుకుంటున్నాడని టాక్. తక్కువ టైంలోనే అంత భారీ మొత్తంలో పారితోషికం అందుకోవడం చూసి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ దృష్ట్యా మేకర్స్ కూడా ఆయన డిమాండ్‌కు ఒకే చెబుతున్నారట. కాగా ప్రస్తుతం శివ కార్తీకేయన్ అయలాన్, డాన్ సినిమాల్లో నటిస్తున్నాడు.
చదవండి: ఇబ్బంది పెడుతున్నారంటూ స్టేజ్‌పైనే ఏడ్చిన హీరో శింబు
వీటిలో అయలాన్ షూటింగ్ పూర్తి కాగా.. డాన్ చిత్రీకరణ దశలో ఉంది. తెలుగులో తొలిసారిగా కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు శివకార్తికేయన్. త్వరలో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసేందుకు కూడా రెడీ అవుతున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయలాన్ షూటింగ్ పూర్తవగా..డాన్ చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల తెలుగులో తొలిసారిగా కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన శివకార్తికేయన్.. త్వరలో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment