శివకార్తికేయన్‌కు జంటగా అమలాపాల్ | shiva karthikeyan team up with amala paul | Sakshi
Sakshi News home page

శివకార్తికేయన్‌కు జంటగా అమలాపాల్

Published Mon, Nov 18 2013 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM

శివకార్తికేయన్‌కు జంటగా అమలాపాల్

శివకార్తికేయన్‌కు జంటగా అమలాపాల్

యువ నటుడు శివకార్తికేయన్ అమలాపాల్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. వరుత్తపడాద వాలిభర్ సంగం విజయం శివకార్తికేయన్ ఇమేజ్‌ను పెంచింది. ప్రస్తుతం కరాటే మ్యాన్ చిత్రాన్ని పూర్తి చేశాడు. తాజాగా ఎదిర్‌నీచ్చల్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన టీమ్‌తో చిత్రం చేయనున్నాడు. ఎదిర్‌నీచ్చల్ చిత్రాన్ని నటుడు ధనుష్ వండర్‌బాల్ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే.
 
  ఇదే బ్యానర్‌పై దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని, వేల్‌రాజా చాయాగ్రహణను అందించనున్నారు. ఇందులో శివకార్తికేయన్ తొలిసారిగా పోలీసు అధికారి పాత్రను ధరించనున్నారు. ఈ చిత్రానికి తానా అనే టైటిల్‌ను నిర్ణయించారు. ప్రస్తుతం ధనుష్ సరసన వేళై ఇల్లా పట్టాదారి చిత్రంలో నటిస్తున్న అమలాపాల్ తానా చిత్రంలోనూ హీరోయిన్‌గా నటించనున్నారన్నది తాజా సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement