
సాక్షి, చెన్నై: ‘డాన్’ చిత్ర యూనిట్‌కు ఆదాయపన్నుశాఖ జరిమానా విధించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు శివకార్తికేయన్ ‘డాన్’ చిత్రం షూటింగ్‌ను ఆదివారం సాయంత్రం పొల్లా సమీపంలోని ఆనమలై బ్రిడ్జి వద్ద చిత్రీకరణ జరిపారు. చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు వందల సంఖ్యలో గుమిగూడి భౌతిక దూరం, కరోనా ఆంక్షలను గాలికొదిలేశారు. వాహనాలు రోడ్డుపైనే ఆపేశారు. దీంతో పోలీసులు షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని అనుమతి లేకుండానే షూటింగ్ జరుపుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆదాయపన్ను శాఖ అధికారులు ‘డాన్’ మూవీ టీంకు రూ. 19,400 జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment