Don movie
-
డాన్‌తో లవ్‌లో పడ్డ కియరా అద్వానీ!
డాన్‌తో లవ్‌లో పడ్డారు హీరోయిన్ కియారా అద్వానీ. బాలీవుడ్ ‘డాన్’ ఫ్రాంచైజీలో రూపొందనున్న తాజా సినిమా ‘డాన్ 3’. రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్న ఈ సినిమాను దర్శక–నిర్మాత – నటుడు–రైటర్ ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘‘కొత్త శకం మొదలైంది. ‘డాన్’ యూనివర్స్‌లోకి కియారాకు స్వాగతం’’ అని ‘డాన్ 3’ మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో కియారాకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయట. ‘‘ఐకానిక్ ‘డాన్ 3’ ఫ్రాంచైజీలో భాగం కావడం థ్రిల్‌గా ఉంది’’ అన్నారు కియారా అద్వానీ. Welcome to the Don universe @advani_kiara #Don3@RanveerOfficial @ritesh_sid @PushkarGayatri @J10Kassim @roo_cha @vishalrr @excelmovies @chouhanmanoj82 #Olly pic.twitter.com/T5xGupgHiF — Farhan Akhtar (@FarOutAkhtar) February 20, 2024 -
నిజానికి నేను డాన్ కావాల్సింది: యంగ్ హీరో
'డాన్' తానే అవ్వాల్సిందని నటుడు, నిర్మాత, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ అన్నారు. నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించి లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి తన ఎస్కే ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం డాన్. ప్రియాంక మోహన్ నాయకిగా నటించిన ఇందులో ఎస్.జే. సూర్య, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సిబి చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రం (25 రోజుల క్రితం) విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ సోమవారం రాత్రి చెన్నైలోని ఓ హోటల్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ప్రీ రిలీజ్ కార్యక్రమంలోనే డాన్ రూ. 100 కోట్ల క్లబ్లో చేరుతుందని చెప్పానన్నారు. ఇది డాక్టర్ చిత్ర వసూళ్లను మూడు వారాల్లోనే అధిగమించి రూ.125 కోట్లను వసూలు చేసిందన్నారు. చదవండి: ఈవారం సినిమా జాతర.. ఏకంగా 22 చిత్రాలు, సిరీస్‌లు నిజానికి 'డాన్' చిత్రంలో తాను నటించాల్సిందని, అది జరగకపోవడంతో దర్శకుడు గ్రేట్ ఎస్కేప్ అయ్యారన్నారు. ఇందులోని కళాశాల క్లైమాక్స్ సన్నివేశాల్లో నటించడం కచ్చితంగా తన వల్ల అయ్యేది కాదన్నారు. ఈ చిత్రం కరెక్ట్ నటుడి చేతిలో పడిందని అభిప్రాయపడ్డారు. చదవండి: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్.. -
ఓటీటీకి శివకార్తికేయన్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘డాన్’, ఆ తేదీ నుంచే స్ట్రీమింగ్
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ‘రెమో’, ‘కౌసల్యా కృష్ణ మూర్తి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన పరిశ్రమలోకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా తెలుగులో డబ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇదిలా ఉంటే ఆయన తాజాగా నటించిన చిత్రం డాన్. మే 13న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజై రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూళు చేసి రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. చదవండి: అలా అడిగేసరికి మహేశ్ స్టూడియో అంతా పరిగెత్తించాడు: కృష్ణ ఈ మూవీ విడుదలై మూడు వారాలు పైనే అవుతున్న నేపథ్యంలో డాన్ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయబోతుంది. డాన్ మూవీని నెట్‌ఫ్లిక్స్ భారీ ఢిల్కు సొంతం చేసుకున్నట్లు సమాచారం. జూన్ 10 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా శిబిచక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా ప్రముఖ దర్శకుడు ఎస్జే సూర్య, సముద్రఖని కీలక పాత్ర పోషించారు. లైకా ప్రొడక్షన్, శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. చదవండి: మేజర్ మూవీ చూస్తూ కంటతడి పెట్టుకున్న ఆడియన్స్, వీడియో వైరల్ It's time to put on your dancing shoes and do the Jalabulajangu with us, because the DON is arriving on June 10th! 🎉🕺🥳#DonOnNetfix pic.twitter.com/5hQbfTuJ3I — Netflix India South (@Netflix_INSouth) May 28, 2022 -
అలా అయితేనే పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తా: హీరో శివకార్తికేయన్
Sivakarthikeyan About Pan India Movies: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తాజాగా నటించిన డాన్ చిత్రం ఈ రోజు ప్రపపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శిబిచక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ఈ చిత్రం విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల నేపథ్యంలో గురువారం మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించింది. చదవండి: యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. పాన్ ఇండియా చిత్రాలపై స్పందించాడు. ఐడియా కొత్తగా ఉంటేనే పాన్ ఇండియా చిత్రాలలో నటించడానికి తాను సిద్ధమని అన్నాడు. అనంతరం డాన్ కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రంగా ఉంటుందని, దర్శకుడు కథ చెప్పగానే కాలేజీ రోజులు గుర్తుకు రావడంతో వెంటనే నటించడానికి ఒకే చెప్పానన్నారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న ఐలాన్ చిత్రాన్ని తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి తన ఎస్.కె.ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. చదవండి: అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం -
‘శివకార్తికేయన్ చేసిన ఒక్క ఫోన్‌కాల్ నా జీవితాన్నే మార్చేసింది’
తమిళ సినిమా : ఆ విషయంలో తాము పూర్తిగా సక్సెస్ అయ్యామని హీరో శివకార్తికేయన్ అన్నారు. ఈయన తాజా చిత్రం డాన్. నటి ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య, సముద్రఖని తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సిబిచక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రొడక్షన్, శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఈనెల 13వ తేదీన విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రం ముందస్తు ప్రసార కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి చెన్నైలో ఘనంగా నిర్వహించారు. శివకార్తికేయన్ చేసిన ఒక్క ఫోన్‌కాల్ తన జీవితాన్ని మార్చేసిందని, ఆయన తన నిజ జీవితానికి, రీల్ జీవితానికి ప్రాణం పోశారని సిబిచక్రవర్తి పేర్కొన్నారు. చిత్రాన్ని ప్రారంభించే ముందు లైకా ప్రొడక్షన్స్‌కు టేబుల్ ప్రాపర్టీని అందించాలని సంకల్సించామని, ఆ విషయంలో సక్సెస్ అయ్యామని చిత్ర కథా నాయకుడు శివకార్తికేయన్ పేర్కొన్నారు. ఇది ప్రతి కళాశాల విద్యార్థిని ప్రతిబింబించే చిత్రంగా ఉంటుందన్నారు. చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌కి చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేయడం మరింత సంతోషంగా ఉందన్నారు. -
శివకార్తీకేయన్ ‘డాన్’ మూవీ టీంకు ఆదాయపన్ను శాఖ జరిమానా
సాక్షి, చెన్నై: ‘డాన్’ చిత్ర యూనిట్‌కు ఆదాయపన్నుశాఖ జరిమానా విధించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు శివకార్తికేయన్ ‘డాన్’ చిత్రం షూటింగ్‌ను ఆదివారం సాయంత్రం పొల్లా సమీపంలోని ఆనమలై బ్రిడ్జి వద్ద చిత్రీకరణ జరిపారు. చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు వందల సంఖ్యలో గుమిగూడి భౌతిక దూరం, కరోనా ఆంక్షలను గాలికొదిలేశారు. వాహనాలు రోడ్డుపైనే ఆపేశారు. దీంతో పోలీసులు షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని అనుమతి లేకుండానే షూటింగ్ జరుపుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆదాయపన్ను శాఖ అధికారులు ‘డాన్’ మూవీ టీంకు రూ. 19,400 జరిమానా విధించారు. -
ఆ పాట కోసమే... రోజూ ఆ సినిమాకు!
సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ సినిమాలుగా మారిన చలనచిత్రాల గురించి ఎంత చెప్పుకున్నా, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు, విశేషాలు చాలానే ఉంటాయి. హిందీ సినిమా పాపులర్ హిట్స్‌లో ఒకటిగా వెలిగి, ఆ మధ్య హిందీతో సహా వివిధ భాషల్లో రీమేక్ కూడా అయిన ‘డాన్’ (1978) గురించీ అలాంటి సంగతులు చాలానే ఉన్నాయి. అప్పట్లో ఆ చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగా ‘యుగంధర్’ పేర రీమేక్ చేస్తే, ఆ మధ్య అదే కథ షారుఖ్ ఖాన్‌తో మళ్ళీ హిందీలోనూ, తెలుగు, తమిళాల్లో ‘బిల్లా’ గానూ పునర్నిర్మాణమైంది. మొన్న మంగళవారంతో 37 ఏళ్ళు నిండిన ‘డాన్’ చిత్రం గురించి ఇప్పటి దాకా చాలామందికి తెలియని కొన్ని గమ్మత్తై విషయాలను అమితాబ్ అందరితో పంచుకున్నారు. చంద్రా బారోత్ దర్శకత్వంలో అప్పటి బాలీవుడ్ అగ్రతార జీనత్ అమన్‌తో కలసి నటించిన విషయాలను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘డాన్’ అనగానే అందరికీ ‘ఖైకే పాన్ బనారస్వాలా...’ అనే హిట్ పాట గుర్తుకొస్తుంది. నిజానికి, ఆ పాట సినిమాలో మొదట లేదట. సినిమా రఫ్ కాపీ చూసిన అగ్రనటుడు మనోజ్ కుమార్ ఒకప్పుడు తన సినిమాలన్నిటికీ సహాయ దర్శకుడిగా పనిచేసిన చంద్రా బారోత్‌కు ఒక సలహా ఇచ్చారట! సెకండాఫ్‌లో ఒక పాట పెట్టమన్న మనోజ్ కుమార్ సూచన ఫలితమే - ఆ పాట అని అమితాబ్ వెల్లడించారు. ‘‘చిత్ర రచయితలైన ప్రసిద్ధ సలీమ్ - జావేద్ ద్వయం సినిమా రషెస్, ముఖ్యంగా కిళ్ళీ నమిలే నకిలీ డాన్ సన్నివేశాలు చూసి శ్రీనగర్‌లో మరో సినిమా షూటింగ్లో ఉన్న నన్ను అభినందిస్తూ టెలిగ్రామ్ పంపారు. అప్పుడు ప్యాలెస్ హాటల్లోని గదిలో ఉండగా నాకు ఆ టెలిగ్రామ్ రావడం, అప్పటి నా అనుభూతి ఇప్పటికీ గుర్తే’’ అని బిగ్ బి గుర్తు చేసుకున్నారు. ఇక, ఆ సినిమా రిలీజైనప్పుడు ఇప్పటి ప్రసిద్ధ నృత్య దర్శకురాలు సరోజ్‌ఖాన్ దుబాయ్‌లో ఉన్నారట! ఆ పాట చూసిన ఆమె అది తెగ నచ్చేసింది. దాంతో, కేవలం ఆ పాట చూడడానికే రోజూ సినిమాకు వెళ్ళేవారట! ‘‘అలా చాలా రోజుల పాటు చేసినట్లు సరోజ్ నాకు స్వయంగా చెప్పారు. ప్రతిరోజూ ఆ పాట సమయానికి వెళ్ళి, అది చూసి వచ్చేస్తున్న సరోజ్‌ను గమనించిన థియేటర్ ఓనర్లు చివరకు ఆమెను రోజూ ఉచితంగా లోపలకు పంపేవారట’’ అని అమితాబ్ చెప్పుకొచ్చారు. సినిమాటోగ్రఫీలో నిష్ణాతుడైన నారీమన్ ఇరానీ ఆ చిత్రాన్ని నిర్మించారంటూ, ‘సినిమా ఘన విజయాన్ని కళ్ళారా చూడకుండానే నారీమన్ కన్నుమూశారు. ఆ సినిమాకు నాకు ‘ఫిల్మ్‌ఫేర్’ నుంచి ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఆ వేడుకలో వేదిక పైకి వెళ్ళిన నేను ఆ అవార్డును నారీమన్కే అంకితమిచ్చి, ఆయన సతీమణిని పైకి పిలిచి, ఆమె చేతికే అవార్డు ఇప్పించాను. ఆ క్షణం తలుచుకుంటే ఇప్పటికీ మనసు రోదిస్తుంది’ అని అమితాబ్ వ్యాఖ్యానించారు. చిరస్మరణీయ చిత్రానికి సంబంధించి చెరిగిపోని జ్ఞాపకాలంటే ఇవేనేమో!