'డాన్' తానే అవ్వాల్సిందని నటుడు, నిర్మాత, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ అన్నారు. నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించి లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి తన ఎస్‌కే ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం డాన్. ప్రియాంక మోహన్ నాయకిగా నటించిన ఇందులో ఎస్.జే. సూర్య, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
సిబి చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రం (25 రోజుల క్రితం) విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ సోమవారం రాత్రి చెన్నైలోని ఓ హోటల్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ప్రీ రిలీజ్ కార్యక్రమంలోనే డాన్ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని చెప్పానన్నారు. ఇది డాక్టర్ చిత్ర వసూళ్లను మూడు వారాల్లోనే అధిగమించి రూ.125 కోట్లను వసూలు చేసిందన్నారు.
చదవండి: ఈవారం సినిమా జాతర.. ఏకంగా 22 చిత్రాలు, సిరీస్లు
నిజానికి 'డాన్' చిత్రంలో తాను నటించాల్సిందని, అది జరగకపోవడంతో దర్శకుడు గ్రేట్ ఎస్కేప్ అయ్యారన్నారు. ఇందులోని కళాశాల క్లైమాక్స్ సన్నివేశాల్లో నటించడం కచ్చితంగా తన వల్ల అయ్యేది కాదన్నారు. ఈ చిత్రం కరెక్ట్ నటుడి చేతిలో పడిందని అభిప్రాయపడ్డారు.
చదవండి: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్..
నిజానికి నేను డాన్ కావాల్సింది: యంగ్ హీరో
Published Wed, Jun 8 2022 8:45 AM | Last Updated on Wed, Jun 8 2022 9:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment