Sivakarthikeyan Speech in Don Press Meet at Chennai - Sakshi
Sakshi News home page

Sivakarthikeyan: అలా అయితేనే పాన్‌ ఇండియా చిత్రాల్లో నటిస్తా

Published Fri, May 13 2022 8:51 AM | Last Updated on Fri, May 13 2022 9:50 AM

Sivakarthikeyan Talks In His Don Movie Press Meet At Chennai - Sakshi

Sivakarthikeyan About Pan India Movies: తమిళ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌ తాజాగా నటించిన డాన్‌ చిత్రం ఈ రోజు ప్రపపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శిబిచక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఈ చిత్రం విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల నేపథ్యంలో గురువారం మూవీ యూనిట్‌ మీడియాతో ముచ్చటించింది.

చదవండి: యూట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి

ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్‌ మాట్లాడుతూ.. పాన్‌ ఇండియా చిత్రాలపై స్పందించాడు. ఐడియా కొత్తగా ఉంటేనే పాన్‌ ఇండియా చిత్రాలలో నటించడానికి తాను సిద్ధమని అన్నాడు. అనంతరం డాన్‌ కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రంగా ఉంటుందని, దర్శకుడు కథ చెప్పగానే కాలేజీ రోజులు గుర్తుకు రావడంతో వెంటనే నటించడానికి ఒకే చెప్పానన్నారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న ఐలాన్‌ చిత్రాన్ని తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి తన ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందించారు.

చదవండి: అదే సినిమాకి ప్లస్‌ అయ్యింది: డైరెక్టర్‌ పరశురాం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement