Sivakarthikeyan Don Movie Streaming To Netflix From On June 10th - Sakshi
Sakshi News home page

Don Movie OTT Streaming: ఓటీటీకి శివకార్తికేయన్‌ లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘డాన్‌’, ఆ తేదీ నుంచే స్ట్రీమింగ్‌

Published Sat, May 28 2022 8:18 PM | Last Updated on Sun, May 29 2022 12:56 PM

South Hero Sivakarthikeyan Don Movie Streaming On Netflix From June 10th - Sakshi

తమిళ స్టార్‌ హీరో శివ‌కార్తికేయ‌న్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు.  ‘రెమో’, ‘కౌసల్యా కృష్ణ మూర్తి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన పరిశ్రమలోకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోగా ఎదిగాడు. త‌మిళంలో వరుస సినిమాలు చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా తెలుగులో డబ్‌ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇదిలా ఉంటే ఆయన తాజాగా నటించిన చిత్రం డాన్‌. మే 13న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజై రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ వసూళు చేసి రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది.

చదవండి: అలా అడిగేసరికి మహేశ్‌ స్టూడియో అంతా పరిగెత్తించాడు: కృష్ణ

ఈ మూవీ విడుదలై మూడు వారాలు పైనే అవుతున్న నేపథ్యంలో డాన్‌ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయబోతుంది. డాన్‌ మూవీని నెట్‌ఫ్లిక్స్‌ భారీ ఢిల్‌కు సొంతం చేసుకున్నట్లు సమాచారం. జూన్‌ 10 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుందని సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా శిబిచక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటించగా ప్రముఖ దర్శకుడు ఎస్‌జే సూర్య, సముద్రఖని కీలక పాత్ర పోషించారు. లైకా ప్రొడక్షన్, శివ కార్తికేయన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించాడు.

చదవండి: మేజర్ మూవీ చూస్తూ కంటతడి పెట్టుకున్న ఆడియన్స్‌, వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement