
సాక్షి, సినిమా: హీరోగా అతి వేగంగా దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్. ఈయన హీరోగా తొలి చిత్రం మనంకొత్తిపరవై యావరేజ్‌గా నిలిచింది. ఆ తరువాత నటించిన మెరీనా ఓకే అనిపించుకుంది. వరుత్తపడాద వాలిభన్ సంఘం నుంచి శివకార్తికేయన్ కేరీర్ వేగం పుంజుకుంది. ఇటీవల విడుదలైన వేలైక్కారన్ చిత్రం వరకూ విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా నటిస్తున్న సీమరాజా చిత్రం నిర్మాణంలో ఉంది. తదుపరి రెండు చిత్రాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే శివకార్తికేయన్ చిత్రాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నారు. అంతే కాదు కండిషన్స్ విధించడానికి వెనుకాడటం లేదు. ఈయన దర్శకుడు ఎం.రాజేశ్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించారు. ఈ దర్శకుడికొక సెంటిమెంట్ ఉంది.
తొలి చిత్రం నుంచి ఒరుకల్ ఒరు కన్నాడీ, బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రాలన్నింటిలోనూ టాస్మాక్ సన్నివేశాలు తప్పనిసరిగా ఉంటాయి. అలాంటిది శివకార్తికేయన్ ఒక టీవీకిచ్చిన భేటీలో ఇంతకు ముందు టాస్మాక్ దృశ్యాలు చాలా ఆలోచింపజేశాయని, ఇకపై అలాంటి సన్నివేశాలు గానీ, స్త్రీలను పరిహాసం చేసే అంశాలు గానీ ఉండవని పేర్కొన్నారు. అయితే ఇది దర్శకుడు రాజేశ్‌కు పెట్టే కండిషన్స్‌గా సినీవర్గాలు భావిస్తున్నారు. అదే విధంగా టాస్మాక్ సన్నివేశాల సెంటిమెంట్ కలిగిఉన్న దర్శకుడు రాజేశ్‌కిది షాక్ ఇచ్చే విషయమే అవుతుందని అనుకుంటున్నారు. మరి ఆయన శివకార్తికేయన్‌తో చేసే చిత్రాన్ని ఎలా మలుచుకుంటారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment