Tasmak
-
షరతులు వర్తిస్తాయి
సాక్షి, సినిమా: హీరోగా అతి వేగంగా దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్. ఈయన హీరోగా తొలి చిత్రం మనంకొత్తిపరవై యావరేజ్‌గా నిలిచింది. ఆ తరువాత నటించిన మెరీనా ఓకే అనిపించుకుంది. వరుత్తపడాద వాలిభన్ సంఘం నుంచి శివకార్తికేయన్ కేరీర్ వేగం పుంజుకుంది. ఇటీవల విడుదలైన వేలైక్కారన్ చిత్రం వరకూ విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా నటిస్తున్న సీమరాజా చిత్రం నిర్మాణంలో ఉంది. తదుపరి రెండు చిత్రాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే శివకార్తికేయన్ చిత్రాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నారు. అంతే కాదు కండిషన్స్ విధించడానికి వెనుకాడటం లేదు. ఈయన దర్శకుడు ఎం.రాజేశ్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించారు. ఈ దర్శకుడికొక సెంటిమెంట్ ఉంది. తొలి చిత్రం నుంచి ఒరుకల్ ఒరు కన్నాడీ, బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రాలన్నింటిలోనూ టాస్మాక్ సన్నివేశాలు తప్పనిసరిగా ఉంటాయి. అలాంటిది శివకార్తికేయన్ ఒక టీవీకిచ్చిన భేటీలో ఇంతకు ముందు టాస్మాక్ దృశ్యాలు చాలా ఆలోచింపజేశాయని, ఇకపై అలాంటి సన్నివేశాలు గానీ, స్త్రీలను పరిహాసం చేసే అంశాలు గానీ ఉండవని పేర్కొన్నారు. అయితే ఇది దర్శకుడు రాజేశ్‌కు పెట్టే కండిషన్స్గా సినీవర్గాలు భావిస్తున్నారు. అదే విధంగా టాస్మాక్ సన్నివేశాల సెంటిమెంట్ కలిగిఉన్న దర్శకుడు రాజేశ్కిది షాక్ ఇచ్చే విషయమే అవుతుందని అనుకుంటున్నారు. మరి ఆయన శివకార్తికేయన్‌తో చేసే చిత్రాన్ని ఎలా మలుచుకుంటారో వేచి చూడాలి. -
మరింత మత్తు
మద్యం విక్ర యాలను నిరసిస్తూ ప్రజలు, ప్రతిపక్షాలు ఆగ్రహంతో ఊగిపోతుండగా మద్యం అమ్మకాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు సమాచారం.ఈ నెలాఖారులోగా తాలూకా స్థాయిలో 226 ఎలైట్ దుకాణాలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో టాస్మాక్ పేరిట మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తున్న సంగతి పాఠకులకు విదితమే. రాష్ట్రంలో 2003 నవంబర్ వరకు ప్రయివేటు సంస్థల ద్వారా 500 మద్యం దుకాణాలు ఉండేవి. అదే ఏడాది నవంబరు 29వ తేదీన అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం మద్యం అమ్మకాలను తన ఆధీనంలోకి తెచ్చుకేనేందుకు టాస్మాక్ సంస్థను ప్రారంభించింది. టాస్మాక్ కింద రాష్ట్రవ్యాప్తంగా 6,800 దుకాణాలు వెలిశాయి. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ల ద్వారా టాస్మాక్ దుకాణాల్లో ఉద్యోగాలను కల్పించారు. సుమారు 35 వేల మంది టాస్మాక్ ఉద్యోగాలు పొందారు. ఉద్యోగుల నుంచి డిపాజిట్‌గా రూ.50వేలు, రూ.15వేలు, రూ.10లను పొందారు. 2003-04 ఆర్థిక సంవత్సరంలో రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల ఆదాయం లభించింది. ఇది ఏడాదికి ఏడాది పెరిగిపోతూ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.25వేల కోట్లకు చేరుకుంది. మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయంతోనే ఉచిత పథకాలను అమలుచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మద్యం విరివిగా లభించడం వల్ల విద్యార్థినీ విద్యార్థ్దులు, చివరకు బాలురు సైతం బానిసలుగా మారిపోతున్నారు. మితిమీరి మద్యం తాగుతండడంతో అకాల మరణాలు, రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హత్యలు, దోపిడీలు పెరిగిపోవడానికి మద్యమే కారణమనే వాదన ఉంది. మరో 226 దుకాణాలు: ఈ దశలో తాలూకా స్థాయిలో ఎలైట్ పేరిట 226 టాస్మాక్ (మద్యం) దుకాణాలను తెరిచేందుకు అన్నా డీఎంకే ప్రభుత్వం ఆదేశాలు జారిచేసినట్లు సమాచారం. ఈనెలాఖారులోగా తాలూకాకు ఒకటి చొప్పున ఎలైట్ దుకాణాలను ఆరంభించాలని ఆదే శాలు అందినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని 226 తాలూకాల్లో ఎలైట్ దుకాణాలకు తగిన స్థలం ఎంపిక పనిలో టాస్మాక్ సిబ్బంది బిజీగా ఉన్నారు. ఎలైట్ దుకాణాలను తెరవాలని ఆదేశాలు అందినమాట వాస్తవమేనని ఒక అధికారి నిర్ధారించారు. రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలని డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో టాస్మాక్ దుకాణాల సంఖ్య పెరగడం విచిత్రం. మద్యం మత్తులో ఆత్మహత్యాయత్నం:ఇదిలా ఉండగా, తిరుచ్చికి చెందిన కొందరు విద్యార్థినీ విద్యార్థులు కలిసి మద్యం తాగిన వీడియో వాట్సాప్ ద్వారా బుధవారం ప్రసారమై కలకలం రేపింది. ఇద్దరు విద్యార్థినులు, మరికొందరు విద్యార్థులు కలిసి ఒక గదిలో మద్యం తాగడం, చీర్స్ కొట్టడం వంటి సన్నివేశాలను వారిలో ఒకరు సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించి సెల్‌ఫోన్ ద్వారా వాట్సాప్‌లో పెట్టాడు. ఈ సన్నివేశాలను చూసిన తిరుచ్చి పోలీసులు వాట్సాప్‌లో పెట్టి న వ్యక్తికోసం గాలిస్తున్నారు. కాగా, మద్యం సేవించిన విద్యార్థిని అవమాన భారంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం అం దింది. గతంలో కోవైకి చెందిన ఒక వి ద్యార్థిని తన ప్రేమ విఫలం అయిం దంటూ పూటుగా మద్యం సేవించి రోడ్డుపై హల్చల్ సృష్టించింది. అలాగే తిరువళ్లూరు, మదురైలలో ఐదారేండ్ల బాలురు మద్యం తాగిన దృశ్యాలు వాట్సాప్‌లో ప్రసారం అయ్యాయి. -
టాస్మాక్ రాబడి రూ.21వేల కోట్లు
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో మద్యాన్ని నేరుగా ప్రభుత్వమే విక్రయిస్తోంది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నేతృత్వంలో టాస్మాక్ పేరిట మద్యం దుకాణాలను నెలకొల్పింది. ఐదారేళ్లుగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరందుకుంటున్నాయి. వేలల్లో ఆదాయం వస్తుండడంతో సరికొత్త తరహా బ్రాండ్లను ఈ దుకాణాల్లో అందుబాటులోకి తెచ్చారు. అలాగే, అతి పెద్ద మాల్స్‌లో ఎలైట్ పేరిట వైన్స్ ఏర్పాటు చేశారు. మార్కెటింగ్ శాఖ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 6800 టాస్మాక్ దుకాణాలు ఉన్నాయి. 4371 టాస్మాక్ బార్లు, ఏడు వేల 39 చిల్లర విక్రయాల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆరేళ్ల క్రితం వరకు ఏడాదికి రూ. ఐదు వేల కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే, ఇటీవల కాలంగా వేలల్లో విక్రయాలు సాగుతున్నాయి. 2011-12లో 18 వేల కోట్లు ఆదాయం రాగా, 2012-13లో ఇరవై వేల కోట్లు దాటింది. ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో విక్రయాలు సాగడంతో 21,680 కోట్ల రాబడి ప్రభుత్వానికి వచ్చింది. ఏడాదికా ఏడాది విక్రయాలు పెరగడం బట్టి చూస్తే, రాష్ట్రంలో మందుబాబుల సంఖ్య ఏ మేరకు ఉన్నదో, ఏ మేరకు తాగి తగలేస్తున్నారో అన్నది స్పష్టం కాక తప్పదు. దీంతో రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం నినాదాన్ని అనేక పార్టీలు అందుకున్నాయి. మద్య నిషేధం లక్ష్యంగా ఉద్యమాలతో ముందుకు సాగుతున్నాయి. తగ్గిన రాబడి ఇన్నాళ్లు ఆదాయం పైపైకి వెళుతుంటే, ఈ సారి కాస్త తగ్గుముఖం పట్టడం గమనించాల్సిందే. 2013-14లో 21,640 కోట్లు రాబడి వచ్చింది. 2012-13తో పోల్చితే 40 కోట్ల వరకు తక్కువగా ఉండడం గమనార్హం. ఇదే విషయాన్ని ఆ శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం టాస్మాక్ మద్యం దుకాణాలు మాత్రమేనని, తమిళనాడులో ఎలా మద్య నిషేధం అమలు చేయగలమని మంత్రి ప్రశ్నించడం గమనార్హం. ఇక, ఈ ఏడాది రూ.40 కోట్ల వరకు రాబడి తగ్గడానికి మందుబాబుల సంఖ్య తగ్గినట్టు భావించడం తప్పులో కాలేసినట్టే. టాస్మాక్ ఉద్యోగుల డిమాండ్ల మేరకు ప్రభుత్వ సెలవు దినాలు 2013లో పెరిగాయి. అలాగే, లోక్ సభ ఎన్నికలు, ఫలితాల లెక్కింపు కాస్త ఈ దుకాణాలకు తాళం వేయించడం, అలాగే, టాస్మాక్ వేళల తగ్గింపుతో ఈ స్వల్ప తగ్గుదల చోటు చేసుకుందంటూ మార్కెటింగ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.