మద్యం విక్ర యాలను నిరసిస్తూ ప్రజలు, ప్రతిపక్షాలు ఆగ్రహంతో ఊగిపోతుండగా మద్యం అమ్మకాలను
మరింత పెంచేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు సమాచారం.ఈ నెలాఖారులోగా తాలూకా స్థాయిలో 226 ఎలైట్ దుకాణాలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో టాస్మాక్ పేరిట మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తున్న సంగతి పాఠకులకు విదితమే. రాష్ట్రంలో 2003 నవంబర్ వరకు ప్రయివేటు సంస్థల ద్వారా 500 మద్యం దుకాణాలు ఉండేవి. అదే ఏడాది నవంబరు 29వ తేదీన అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం మద్యం అమ్మకాలను తన ఆధీనంలోకి తెచ్చుకేనేందుకు టాస్మాక్ సంస్థను ప్రారంభించింది. టాస్మాక్ కింద రాష్ట్రవ్యాప్తంగా 6,800 దుకాణాలు వెలిశాయి. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్‌ల ద్వారా టాస్మాక్ దుకాణాల్లో ఉద్యోగాలను కల్పించారు. సుమారు 35 వేల మంది టాస్మాక్ ఉద్యోగాలు పొందారు.
ఉద్యోగుల నుంచి డిపాజిట్‌గా రూ.50వేలు, రూ.15వేలు, రూ.10లను పొందారు. 2003-04 ఆర్థిక సంవత్సరంలో రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల ఆదాయం లభించింది. ఇది ఏడాదికి ఏడాది పెరిగిపోతూ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.25వేల కోట్లకు చేరుకుంది. మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయంతోనే ఉచిత పథకాలను అమలుచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మద్యం విరివిగా లభించడం వల్ల విద్యార్థినీ విద్యార్థ్దులు, చివరకు బాలురు సైతం బానిసలుగా మారిపోతున్నారు. మితిమీరి మద్యం తాగుతండడంతో అకాల మరణాలు, రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హత్యలు, దోపిడీలు పెరిగిపోవడానికి మద్యమే కారణమనే వాదన ఉంది.
మరో 226 దుకాణాలు: ఈ దశలో తాలూకా స్థాయిలో ఎలైట్ పేరిట 226 టాస్మాక్ (మద్యం) దుకాణాలను తెరిచేందుకు అన్నా డీఎంకే ప్రభుత్వం ఆదేశాలు జారిచేసినట్లు సమాచారం. ఈనెలాఖారులోగా తాలూకాకు ఒకటి చొప్పున ఎలైట్ దుకాణాలను ఆరంభించాలని ఆదే శాలు అందినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని 226 తాలూకాల్లో ఎలైట్ దుకాణాలకు తగిన స్థలం ఎంపిక పనిలో టాస్మాక్ సిబ్బంది బిజీగా ఉన్నారు. ఎలైట్ దుకాణాలను తెరవాలని ఆదేశాలు అందినమాట వాస్తవమేనని ఒక అధికారి నిర్ధారించారు. రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలని డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో టాస్మాక్ దుకాణాల సంఖ్య పెరగడం విచిత్రం.
మద్యం మత్తులో ఆత్మహత్యాయత్నం:ఇదిలా ఉండగా, తిరుచ్చికి చెందిన కొందరు విద్యార్థినీ విద్యార్థులు కలిసి మద్యం తాగిన వీడియో వాట్సాప్ ద్వారా బుధవారం ప్రసారమై కలకలం రేపింది. ఇద్దరు విద్యార్థినులు, మరికొందరు విద్యార్థులు కలిసి ఒక గదిలో మద్యం తాగడం, చీర్స్ కొట్టడం వంటి సన్నివేశాలను వారిలో ఒకరు సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించి సెల్‌ఫోన్ ద్వారా వాట్సాప్‌లో పెట్టాడు. ఈ సన్నివేశాలను చూసిన తిరుచ్చి పోలీసులు వాట్సాప్‌లో పెట్టి న వ్యక్తికోసం గాలిస్తున్నారు. కాగా, మద్యం సేవించిన విద్యార్థిని అవమాన భారంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం అం దింది. గతంలో కోవైకి చెందిన ఒక వి ద్యార్థిని తన ప్రేమ విఫలం అయిం దంటూ పూటుగా మద్యం సేవించి రోడ్డుపై హల్‌చల్ సృష్టించింది. అలాగే తిరువళ్లూరు, మదురైలలో ఐదారేండ్ల బాలురు మద్యం తాగిన దృశ్యాలు వాట్సాప్‌లో ప్రసారం అయ్యాయి.
మరింత మత్తు
Published Thu, Jul 23 2015 2:29 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM
Advertisement
Advertisement