గుడి... చర్చ్... మసీదు... ఏదైతేనేమి... నయనతారకు నో అబ్జెక్షన్. ఏ మతమైనా ఈ క్రిస్టియన్ బ్యూటీకి ఒకటే. చర్చ్‌కి ఎలానూ వెళతారు. అమ్మవారి గుడికీ, అల్లా దర్గాకీ వెళతారు. ఇప్పుడు అజ్మీర్ దర్గాకి వెళ్లారు. ‘స్వామి కార్యం.. స్వకార్యం’ అంటారు కదా.. అలా నయనతారకు రెండూ కలిసొచ్చాయి. తమిళ చిత్రం ‘వేలైక్కారన్’ కోసం నయన రాజస్థాన్ వెళ్లారు. అక్కడికి వెళుతున్నప్పుడే అజ్మీర్ దర్గాని సందర్శించాలని ఆమె నిర్ణయించుకున్నారు.
సంకల్పం బలమైనది అయితే నెరవేరకుండా ఉంటుందా! రాజస్థాన్‌లో బిజీ షెడ్యూల్‌లోనూ నయనతారకు కాస్త గ్యాప్ దొరికింది. అంతే.. దర్గాకు వెళ్లారు. ఆమెతో పాటు డిజైనర్ నీరజ కోన కూడా దర్గాని దర్శించారు. ఇంకా చిత్రకథానాయకుడు శివ కార్తీకేయన్ తదితరులు వెళ్లారు. ఆ సంగతలా ఉంచితే.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తోన్నగ నయనతార కమెడియన్ నుంచి హీరోగా మారిన శివ కార్తీకేయన్‌కి జోడీగా ఈ సినిమాలో నటించడం ఓ విశేషం. కథ నచ్చితే, హీరో ఎవరైనా ఓకే అని చెప్పీ చెప్పక చెప్పారామె.
Comments
Please login to add a commentAdd a comment