velaikkaran
-
స్నేహ సారీ!
తమిళసినిమా: నటి స్నేహకు దర్శకుడు మోహన్‌రాజ్ సారీ చెప్పారు. ఏమిటి నమ్మశక్యంగా లేదా నటి స్నేహ ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్‌రాజా క్షమాపణ కోరారు. అర్థం కాలేదు కదూ! వివరంగా చెప్పాలంటే మోహన్‌రాజా తెరకెక్కించిన తాజా చిత్రం వేలైక్కారన్. శివకార్తికేయన్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రంలో నటి స్నేహ కీలకపాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన వేలక్కారన్ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. మార్కెట్లో విక్రయిస్తున్న నకిలీ పోషక పదార్థాల కారణంగా బిడ్డను పోగొట్టుకున్న పాత్రలో స్నేహ నటించారు. అవి నకిలీ పదార్థాలని నిరూపించి కార్పొరేట్ సంస్థలపై చర్యలు తీసుకునేలా పోరాటంలో భాగంగా స్నేహ మూడు నెలల పాటు తన బిడ్డకు ఇచ్చిన ఆహార పదార్థాలనే తింటూ మరణానికి దగ్గరగా తల్లి పాత్రలో చాలా సహజంగా నటించారు. అయితే చిత్రంలో తనకు సంబంధించిన సన్నివేశాలను చాలా వరకు తొలగించారని స్నేహ చిత్ర యూనిట్‌పై ఆరోపణలు చేశారు. స్పందించిన దర్శకుడు మోహన్‌రాజా చిత్రంలో స్నేహది చాలా కీలక పాత్ర అన్నారు. చిత్రంలో స్నేహ పాత్ర 90 రోజులు సాగేలా ఉంటుందన్నారు. వేలైక్కారన్ చిత్రంలో స్నేహ పాత్రకే ముందుగా మంచి పేరు వచ్చిందని తెలిపారు. అయినా ఆమె పాత్ర విషయంలో తాము తప్పు చేశామని భావిస్తే క్షమాపణలు చెపుతున్నామని దర్శకుడు మోహన్‌రాజా పేర్కొన్నారు. -
ఆమె నుంచి చాలా నేర్చుకున్నా!
నటి నయనతార నుంచి చాలా నేర్చుకున్నానంటున్నారు వరుస విజయాలతో పుల్‌జోష్‌లో ఉన్న నటుడు శివకార్తికేయన్. రజనీమురుగన్, రెమో వంటి ఘన విజయాల తరువాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం వేలైక్కారన్. అగ్రతార నయనతార నాయకిగా నటిస్తున్న ఇందులో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న చిత్రం ఇది. ఇంకా ప్రకాష్‌రాజ్, స్నేహ, ఆర్.జె.బాలాజి, సతీష్ ప్రముఖ తారాగణం నటించిన ఈ చిత్రాన్ని 24 ఏఎం స్టూడియోస్ పతాకంపై ఆర్.డి.రాజా భారీ ఎత్తున నిర్మించారు. మోహన్‌రాజా కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈ నెల 22న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ వేలైక్కారన్ గురించి తన భావాలను పంచుకున్నారు. ‘నేను నటించిన చిత్రాలన్నిటికంటే భారీ వ్యయంతో రూపొందిన చిత్రం ఇది.. తనీఒరువన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొనడం సహజం.. ఈ కారణంగా చిత్ర యూనిట్ మొత్తం ఎంతో శ్రమించారు.. నేను ఇందులో అరివు అనే కార్మికుడిగా నటించాను.. కార్మికుల జీవితాలను ఆవిష్కరించే కథా చిత్రం వేలైక్కారన్.. మంచి సామాజిక సందేశం ఉన్న కథా చిత్రంగా ఇది ఉంటుంది.. ఇందులో నటి నయనతారతో తొలిసారిగా కలిసి నటించాను.. తను మంచి కథా చిత్రాలను ఎంచుకుని అగ్రనటిగా రాణిస్తున్నారు.. అందుకు నటనలో ఆమె అంకితభావమే కారణం.. ఆమెను చూసి నేను చాలా నేర్చుకున్నాను.. ఇక మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ను ఈ చిత్రానికి ఎంపిక చేసుకోవడానికి కేరళ మార్కెట్‌ను పెంచుకోవడానికా అని అడుగుతున్నారు.. ఆ పాత్రకు ఆయనైతే బాగుంటారని ఎంచుకున్నాం.. చిత్రంలో రాజకీయాలు ఉంటాయా అని అడుగుతున్నారు.. అలాంటి అంచనాలను ఈ చిత్రంలో టచ్ చేయలేదు.. ఇది ఒక మంచి సోషల్ మేసేజ్ ఉన్న చిత్రం.. చాలా సీరియస్ చిత్రం వేలైక్కారన్.. నిర్మాత ఆర్.డి.రాజా ఏ విషయంలోనూ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు.. కథకు న్యాయం చేయడానికి నిర్మాణం ఎక్కువ రోజులు పట్టింది.. ఇకపై ఏడాదికి రెండు చిత్రాలు చేసేలా ప్రయత్నిస్తాను.. అని చెప్పారు. -
దర్గా దర్శనం.. ఎంతో ఆనందం
గుడి... చర్చ్... మసీదు... ఏదైతేనేమి... నయనతారకు నో అబ్జెక్షన్. ఏ మతమైనా ఈ క్రిస్టియన్ బ్యూటీకి ఒకటే. చర్చ్‌కి ఎలానూ వెళతారు. అమ్మవారి గుడికీ, అల్లా దర్గాకీ వెళతారు. ఇప్పుడు అజ్మీర్ దర్గాకి వెళ్లారు. ‘స్వామి కార్యం.. స్వకార్యం’ అంటారు కదా.. అలా నయనతారకు రెండూ కలిసొచ్చాయి. తమిళ చిత్రం ‘వేలైక్కారన్’ కోసం నయన రాజస్థాన్ వెళ్లారు. అక్కడికి వెళుతున్నప్పుడే అజ్మీర్ దర్గాని సందర్శించాలని ఆమె నిర్ణయించుకున్నారు. సంకల్పం బలమైనది అయితే నెరవేరకుండా ఉంటుందా! రాజస్థాన్‌లో బిజీ షెడ్యూల్లోనూ నయనతారకు కాస్త గ్యాప్ దొరికింది. అంతే.. దర్గాకు వెళ్లారు. ఆమెతో పాటు డిజైనర్ నీరజ కోన కూడా దర్గాని దర్శించారు. ఇంకా చిత్రకథానాయకుడు శివ కార్తీకేయన్ తదితరులు వెళ్లారు. ఆ సంగతలా ఉంచితే.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తోన్నగ నయనతార కమెడియన్ నుంచి హీరోగా మారిన శివ కార్తీకేయన్కి జోడీగా ఈ సినిమాలో నటించడం ఓ విశేషం. కథ నచ్చితే, హీరో ఎవరైనా ఓకే అని చెప్పీ చెప్పక చెప్పారామె. -
సూపర్‌స్టార్ టైటిల్‌తో శివకార్తికేయన్ , నయన
నటుడిగా శివకార్తికేయన్ ఎదుగుదల ఆశ్చర్యం అనకతప్పదు. కేవలం 10 చిత్రాలతోనే స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ ఇటీవల నటించిన రెమో చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నేటి టాప్ హీరోయిన్ నయనతార నటిస్తున్నారు. ఇంతకు ముందు రెమో చిత్రాన్ని నిర్మించిన 24ఏఎం.స్టూడియోస్ సంస్థనే ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. మలయాళం నటుడు పహద్ ఫాజిల్, ప్రకాశ్‌రాజ్, స్నేహ, తంబిరామయ్య ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. దీనికి సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్‌హిట్ చిత్రం వేలైక్కారన్ పేరును నిర్ణయించారు. శుక్రవారం శివకార్తికేయన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను నిర్మాత వెల్లడించారు. 1987లో రజనీకాంత్, అమల జంటగా ఎస్పీ.ముత్తురామన్ దర్శకత్వంలో కవితాలయా ఫిలింస్ పతాకంపై ప్రముఖ దర్శకుడు కే.బాలచందర్ నిర్మించిన చిత్రం వేలైక్కారన్. అప్పట్లో ఆ చిత్రం పెద్ద విజయం సాధించింది. తనీఒరువన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కమర్షియల్ అంశాలతో పాటు మంచి సోషల్ మెసేజ్‌తో కూడి ఉంటుందంటున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని వినాయక చవితి పండుగ పురçస్కరించుకుని ఆగస్ట్ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ముందుగానే ప్రకటించారన్నది గమనార్హం. -
చిన్న హీరోతో లవ్... పెద్ద హీరో టైటిల్!
చిన్న హీరోతో లవ్... పెద్ద హీరో టైటిల్ అంటే ఏంటో అర్థం కావడంలేదు కదూ. కొంచెం తికమకగా కూడా ఉంది కదూ. కన్ఫ్యూజన్లో అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని మనసు తొందరపడుతోంది కదూ. మరేం లేదు... తమిళంలో ఇప్పుడిప్పుడే పైకొస్తున్న చిన్న హీరో శివకార్తికేయన్ సరసన నటించడానికి స్టార్ హీరోయిన్ నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి పెద్ద హీరో రజనీకాంత్ గతంలో నటించిన ‘వేలైక్కారన్’ సినిమా టైటిల్‌ని పెట్టాలనుకుంటున్నారు. అసలు విషయం అది. ఇదిలా ఉంటే.. ఇటీవల ‘తని ఒరువన్’ వంటి సూపర్ హిట్ మూవీకి దర్శకత్వం వహించిన మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మురికివాడలకు చెందిన ఓ యువకుడి కథతో ఈ చిత్రం ఉంటుందట.