తమిళసినిమా: నటి స్నేహకు దర్శకుడు మోహన్‌రాజ్ సారీ చెప్పారు. ఏమిటి నమ్మశక్యంగా లేదా నటి స్నేహ ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్‌రాజా క్షమాపణ కోరారు. అర్థం కాలేదు కదూ! వివరంగా చెప్పాలంటే మోహన్‌రాజా తెరకెక్కించిన తాజా చిత్రం వేలైక్కారన్. శివకార్తికేయన్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రంలో నటి స్నేహ కీలకపాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన వేలక్కారన్ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. మార్కెట్‌లో విక్రయిస్తున్న నకిలీ పోషక పదార్థాల కారణంగా బిడ్డను పోగొట్టుకున్న పాత్రలో స్నేహ నటించారు.
అవి నకిలీ పదార్థాలని నిరూపించి కార్పొరేట్ సంస్థలపై చర్యలు తీసుకునేలా పోరాటంలో భాగంగా స్నేహ మూడు నెలల పాటు తన బిడ్డకు ఇచ్చిన ఆహార పదార్థాలనే తింటూ మరణానికి దగ్గరగా తల్లి పాత్రలో చాలా సహజంగా నటించారు. అయితే చిత్రంలో తనకు సంబంధించిన సన్నివేశాలను చాలా వరకు తొలగించారని స్నేహ చిత్ర యూనిట్‌పై ఆరోపణలు చేశారు. స్పందించిన దర్శకుడు మోహన్‌రాజా చిత్రంలో స్నేహది చాలా కీలక పాత్ర అన్నారు. చిత్రంలో స్నేహ పాత్ర 90 రోజులు సాగేలా ఉంటుందన్నారు. వేలైక్కారన్ చిత్రంలో స్నేహ పాత్రకే ముందుగా మంచి పేరు వచ్చిందని తెలిపారు. అయినా ఆమె పాత్ర విషయంలో తాము తప్పు చేశామని భావిస్తే క్షమాపణలు చెపుతున్నామని దర్శకుడు మోహన్‌రాజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment