సూపర్‌స్టార్ టైటిల్‌తో శివకార్తికేయన్ , నయన
నటుడిగా శివకార్తికేయన్ ఎదుగుదల ఆశ్చర్యం అనకతప్పదు. కేవలం 10 చిత్రాలతోనే స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ ఇటీవల నటించిన రెమో చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నేటి టాప్ హీరోయిన్ నయనతార నటిస్తున్నారు. ఇంతకు ముందు రెమో చిత్రాన్ని నిర్మించిన 24ఏఎం.స్టూడియోస్ సంస్థనే ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది.
మలయాళం నటుడు పహద్ ఫాజిల్, ప్రకాశ్‌రాజ్, స్నేహ, తంబిరామయ్య ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. దీనికి సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్‌హిట్ చిత్రం వేలైక్కారన్ పేరును నిర్ణయించారు. శుక్రవారం శివకార్తికేయన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను నిర్మాత వెల్లడించారు. 1987లో రజనీకాంత్, అమల జంటగా ఎస్‌పీ.ముత్తురామన్ దర్శకత్వంలో కవితాలయా ఫిలింస్ పతాకంపై ప్రముఖ దర్శకుడు కే.బాలచందర్ నిర్మించిన చిత్రం వేలైక్కారన్.
అప్పట్లో ఆ చిత్రం పెద్ద విజయం సాధించింది. తనీఒరువన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కమర్షియల్ అంశాలతో పాటు మంచి సోషల్ మెసేజ్‌తో కూడి ఉంటుందంటున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని వినాయక చవితి పండుగ పురçస్కరించుకుని ఆగస్ట్ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ముందుగానే ప్రకటించారన్నది గమనార్హం.