చిన్న హీరోతో లవ్... పెద్ద హీరో టైటిల్!
చిన్న హీరోతో లవ్... పెద్ద హీరో టైటిల్ అంటే ఏంటో అర్థం కావడంలేదు కదూ. కొంచెం తికమకగా కూడా ఉంది కదూ. కన్‌ఫ్యూజన్‌లో అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని మనసు తొందరపడుతోంది కదూ. మరేం లేదు... తమిళంలో ఇప్పుడిప్పుడే పైకొస్తున్న చిన్న హీరో శివకార్తికేయన్ సరసన నటించడానికి స్టార్ హీరోయిన్ నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ చిత్రానికి పెద్ద హీరో రజనీకాంత్ గతంలో నటించిన ‘వేలైక్కారన్’ సినిమా టైటిల్‌ని పెట్టాలనుకుంటున్నారు. అసలు విషయం అది. ఇదిలా ఉంటే.. ఇటీవల ‘తని ఒరువన్’ వంటి సూపర్ హిట్ మూవీకి దర్శకత్వం వహించిన మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మురికివాడలకు చెందిన ఓ యువకుడి కథతో ఈ చిత్రం ఉంటుందట.