నయనతార అగ్రనటి, లేడీ సూపర్‌స్టార్, ఇంకా చెప్పాలంటే సంచలన నటి కూడా. ఆమెలో మరో కోణం కూడా ఉంది. నయనతార తాను నటించిన చిత్రాల ప్రమోషన్‌కు కూడా రాదు గానీ, చిత్ర యూనిట్‌కు మాత్రం నయనతార అంటే చాలా సాఫ్ట్‌కార్నరే ఉంటుంది. అందుకు కారణం తను నటించే చిత్రం షూటింగ్ పూర్తి కాగానే యూనిట్‌లోని వారందరికీ మంచి కానుకలను అందించే సత్సంప్రదాయాన్ని నయనతార పాటిస్తుంది. ఇది సినీ వర్గాల్లో చాలా అరుదుగానే జరుగుతుంది.
అప్పట్లో మహానటి సావిత్రి ఈ పని చేసేవారట. ఇక ఇటీవల నటుడు విజయ్ ఇలాంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తుంటారు. అజిత్ అయితే మంచి బిరియానీ విందునిస్తుంటారు. ఆ మధ్య నటి మహానటి చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత నటి కీర్తీసురేశ్ కూడా చిత్ర యూనిట్‌కు కానుకలను అందించింది. నటి నయనతార తన ప్రతి చిత్రానికి ఇలాంటి ఏదో రకమైన కానుకలను యూనిట్ వారికి ఇచ్చి వారిని సంతృప్తి పరుస్తుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ శివకార్తి కేయన్‌కు జంటగా నటిస్తున్న మిస్టర్ లోకల్ చిత్ర షూటింగ్ గత నెల 6వ తేదీతో పూర్తి అయ్యింది. దీంతో నయనతార యూనిట్‌లోని వారందరికీ మంచి ఖరీదైన వాచ్‌లను కానుకగా అందించారట. దీంతో మిస్టర్ లోకల్ చిత్ర యూనిట్ అంతా ఆనందంలో పడిపోయారు. అలా ఆ రోజు నయనతార టైమ్‌గా మారింది. స్టూడియోగ్రీన్ స్టూడియో పతాకంపై కేఈ. జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న మిస్టర్ లోకల్ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రావడానికి ముస్తాబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment