శివకార్తికేయన్ నాకు చేసిన ప్రామిస్‌ను బ్రేక్ చేశాడు అంటున్నారు తమిళ పాటల రచయిత మదన్ కార్కీ. మదన్ కార్కీ అంటే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు. కానీ ‘బాహుబలి’ సినిమాలో కాలకేయుల భాషను సృష్టించింది మదన్ కార్కీ అనగానే వెంటనే గుర్తుపట్టొచ్చు. ఇంతకీ మదన్, శివ చేసుకున్న ప్రామిస్ ఏంటంటే.. శివ కార్తీకేయన్ ఎప్పుడూ పాటలు రాయకూడదని. మదన్ కార్కీ ఎప్పుడూ యాక్ట్ చేయకూడదని సరదాగా ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నారట. కానీ నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ (కోకో) సినిమా కోసం శివ కార్తికేయన్ ‘కల్యాణ వయస్సు’ అంటూ ఒక సాంగ్ రాసిన విషయం తెలిసిందే. ఈ పాట విన్న తర్వాత శివ కార్తికేయన్ నాకు చేసిన ప్రామిస్‌ని బ్రేక్ చేశాడని మదన్ కార్కీ సరదాగా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment