
శివ కార్తికేయన్
టీవీ యాంకర్ నుంచి హీరోగా ఎదిగిన నటుడు శివ కార్తికేయన్ కోలీవుడ్‌లో మంచి ఊపుమీద ఉన్నారు. వరుస సినిమాలకు సైన్ చేస్తూ కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ నాలుగు సినిమాలను (రాజేశ్ (మిస్టర్ లోకల్), పీఎస్ మిత్రన్ (హీరో), రవికుమార్, పాండిరాజ్ దర్శకత్వంలో...) లైన్లో పెట్టిన కార్తికేయన్ తాజాగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో హీరోగా నటించనున్నట్లు వెల్లడించారు. సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జూలైలో చిత్రీకరణను మొదలుపెట్టి, వచ్చే ఏడాది సినిమాను విడుదలకి ప్లాన్ చేశారు. ఇందులో కన్నడ బ్యూటీ రష్మికా మండన్నా హీరోయిన్‌గా ఎంపికయ్యే చాన్స్ ఉందటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో శివకార్తికేయన్ చేతిలో ఐదు సినిమాలున్నాయి. అంటే పాంచ్ పటకా అన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment