శివకార్తీకేయన్‌కు బద్ధ శత్రువు | Isha Koppikar Villain Role in Sivakarthikeyan Movie | Sakshi
Sakshi News home page

ఇషా విలనీయం

Published Tue, Feb 11 2020 10:56 AM | Last Updated on Tue, Feb 11 2020 10:56 AM

Isha Koppikar Villain Role in Sivakarthikeyan Movie - Sakshi

సినిమా : క్రేజీ హీరోయిన్లుగా రాణించిన నటీమణులు విలనీయం ప్రదర్శించడానికీ వెనుకాడటం లేదు. పడయప్పా చిత్రంలో రమ్యకృష్ణ కూడా రజనీకాంత్‌తో విలనీయాన్ని ప్రదర్శించి పేరు తెచ్చుకుంది. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ ఇషా కోపి కర్‌ కోలీవుడ్‌లో విలనిజాన్ని ప్రదర్శించడానికి రెడీ అయింది. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నాయకిగా నటించిన ఇషా కోపికర్‌ తమిళం, తెలుగులోనూ హీరోయిన్‌గా నటించింది. విజయ్‌కు జంటగా నెంజినిలే, విజయ్‌కాంత్‌కు జంటగా నరసింహా, అరవిందస్వామికి జతగా ఎన్‌ శ్వాస కాట్రే వంటి చిత్రాల్లో  హీరోయిన్‌గా నటించింది. ఇక తెలుగులో నాగార్జునకు జంటగా చంద్రలేఖ చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటిది ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రతినాయకిగా రీఎంట్రీ ఇస్తోంది.

నటుడు శివకార్తీకేయన్‌కు బద్ధ శత్రువుగా నటిస్తోంది. శివకార్తీకేయన్‌ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి డాక్టర్‌. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో  ప్రియాంకమోహన్‌ నాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే అయలాన్‌ అనే మరో చిత్రంలోనూ శివకార్తీకేయన్‌ నటిస్తున్నారు. ఇది కొంత షూటింగ్‌ను జరుపుకుని ఆగిపోయింది. చాలా గ్యాప్‌ తరువాత మళ్లీ మొదలయ్యింది.  రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఏలియన్స్‌ ఇతి వృత్తంతో సైన్స్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నటి ఇషాకోపికర్‌ ప్రతినాయకి పాత్రలో నటిస్తోంది. కాగా సుమారు 10 ఏళ్ల తరువాత కోలీవుడ్‌లో నటిస్తున్న చిత్రం ఇది. ఆమె పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందట. ప్రస్తుతం ఈ చిత్రం క్‌లైమాక్స్‌ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement