14 ఏళ్ల బంధానికి స్వస్తి.. భర్తకు చంద్రలేఖ హీరోయిన్‌ విడాకులు! | Bollywood Actress Isha Koppikar And Timmy Narang Heading For Divorce? Deets Inside - Sakshi
Sakshi News home page

Isha Koppikar-Timmy Narang Divorce: కూతురితో సహా భర్త ఇంటి నుంచి బయటకు.. విడాకులకు సిద్ధమైన హీరోయిన్‌!

Published Thu, Dec 28 2023 9:35 PM | Last Updated on Fri, Dec 29 2023 12:13 PM

Isha Koppikar, Timmy Narang Heading for Divorce? - Sakshi

బాలీవుడ్‌లో మరో జంట విడాకులు తీసుకునేందుకు రెడీ అయింది. నటి ఇషా కొప్పికర్‌ భర్త టిమ్మి నారంగ్‌తో విడిపోతున్నట్లు తెలిసింది. 14 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా వీరి మధ్య చీటికిమాటికి గొడవలు జరుగుతున్నాయని.. సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అది సఫలం కానట్లు సమాచారం. దీంతో ఇషా- టిమ్మి కలిసి ఉండటం కంటే విడిపోవడానికే సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఇషా తన కూతురిని తీసుకుని కొంతకాలం క్రితమే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసిందట! 

చెప్పడానికి ఏమీ లేదు
ఈ విషయం గురించి కొందరు ఆమెను ప్రశ్నించగా దానికి సమాధానం ఇవ్వడానికి ఇష్టపడనట్లు భోగట్టా!  'నేను చెప్పడానికి ఏమీ లేదు. ఇ‍ప్పుడు నేనేమీ మాట్లాడదల్చుకోలేదు. నాకు ప్రైవసీ కావాలి. దయచేసి మరింకేమీ అడగొద్దు' అని సున్నితంగా తిరస్కరించిదట! కాగా ఇషా కొప్పికర్‌కు హీరోయిన్‌ ప్రీతి జింటా వల్ల రెస్టారెంట్‌ యజమాని టిమ్మితో పరిచయం ఏర్పడింది. మూడేళ్లపాటు స్నేహం చేసిన వీరు తమకు తెలియకుండానే ఒకరితో మరొకరు ప్రేమలో పడ్డారు.

2009లో పెళ్లి..
ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు పచ్చజెండా ఊపడంతో 2009 నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2014లో రియానా అనే కూతురు జన్మించింది. ఇషా సినిమాల విషయానికి వస్తే.. 2000వ సంవత్సరంలో వచ్చిన ఫిజా సినిమాతో బాలీవుడ్‌లో తన ప్రయాణం మొదలుపెట్టింది ఇషా. కంపెనీ, కాంటె, పింజర్‌, డాన్‌.. తదితర చిత్రాల్లో నటించింది. హిందీలోనే కాకుండా తమిళ, తెలుగు, కన్నడ, మరాఠి భాషల్లోనూ నటించింది. తెలుగులో చంద్రలేఖలో హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటీ ప్రేమతో రా, కేశవ చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఆమె నటించిన అయాలన్‌ అనే తమిళ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది.

చదవండి: శుక్రవారం ఒక్కరోజే OTTలో 17 సినిమాలు రిలీజ్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement