నయనతార
కమెడియన్ నుంచి హీరోగా మారిన శివ కార్తికేయన్‌తో గతేడాది ‘వేలైక్కారన్’ సినిమాలో యాక్ట్ చేసిన నయనతార మరోసారి అతనితో జోడీ కట్టడానికి రెడీ అయ్యార ని కోలీవుడ్ సమాచారం. శివ కార్తికేయన్ హీరోగా ‘నేనే అంబానీ’ ఫేమ్ రాజేష్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతారను తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించుకున్నారట. దర్శకుడు రాజేశ్ చెప్పిన కథ నచ్చటంతో నయన్ ఓకే కూడా చెప్పేశారని సమాచారమ్. ఆల్రెడీ రాజేశ్ డైరెక్ట్ చేసిన ‘బాస్ ఎన్‌గిర భాస్కరన్’ (తెలుగులో ‘నేనే అంబాని’) సినిమాలో నయనతార యాక్ట్ చేశారు.
స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మించనున్న తాజా సినిమా తమిళనాడు ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ స్ట్రైక్ పూర్తయిన వెంటనే స్టార్ట్ అవుతుందట. ఆల్రెడీ రవికుమార్ డైరెక్షన్‌లో శివకార్తికేయన్ చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీతో పాటు ఈ సినిమాను కూడా ఒకేసారి షూట్ చేయనున్నారట. హీరో శివకార్తికేయన్‌తోనే కాదు దర్శకుడు రాజేశ్‌తో కూడా నయనతార సినిమా చేయడం ఇది రెండోసారి. ఈ సినిమా కాకుండా నయనతార ప్రస్తుతం చిరంజీవితో ‘సైరా’, తమిళంలో అజిత్‌తో ‘విశ్వాసం’, కొత్త దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ‘కోకో’(కోలమావు కోకిల ) సినిమాలతో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment