పెళ్లి వయసు | Sivakarthikeyan turns lyricist for Nayanthara’s 'Kolamavu Kokila' | Sakshi
Sakshi News home page

పెళ్లి వయసు

Published Tue, May 15 2018 1:45 AM | Last Updated on Fri, Aug 17 2018 2:27 PM

Sivakarthikeyan turns lyricist for Nayanthara’s 'Kolamavu Kokila' - Sakshi

యాంకర్‌ నుంచి హీరోగా మారారు తమిళ నటుడు శివ కార్తికేయన్‌. ముందు కమెడియన్‌గా, తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, ఇప్పుడు హీరోగా.. ఇలా అంచలంచెలుగా ఎదిగారు. ఇలా తనలోని కొత్త టాలెంట్‌ను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నారాయన. ‘మాన్‌ కరాటే’తో  సింగర్‌గా కూడా మారారు. ఇప్పుడు పాటల రచయితగా కలం పట్టారు.

నయనతార ప్రధాన పాత్రలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘కోలమావు కోకిల’ సినిమా కోసం ఓ పాట రాశారు శివ కార్తికేయన్‌. అనిరు«ద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకుడు. ‘కల్యాణ వయసు....’ అంటూ సాగే ఈ పాట మే 17న రిలీజ్‌ కానుంది. అన్నట్లు... ‘పెళ్లి వయసు’ అని పాట రాసిన శివ కార్తికేయన్‌కి పెళ్లయింది. ఒక పాప కూడా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement