కోలీవుడ్ ప్రముఖ హీరో, నిర్మాత, తమిళనాడు రాష్ట్రమంత్రి ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మామన్నన్'. నటి కీర్తి సురేష్ నాయకిగా నటించిన ఇందులో వడివేలు, ఫాహత్ ఫాజిల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. జూన్ 29వ తేదీన విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సందర్భంగా చైన్నెలోని ఒక స్టార్ హోటల్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.
(ఇదీ చదవండి: జవాన్ ట్రైలర్: నేను విలనైతే ఏ హీరో నాముందు నిలబడలేడు)
ఇందులో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తాను కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం 'ఆరుకల్ ఆరు కన్నాడీ' పెద్ద విజయం సాధించిందన్నారు. కాగా ఇప్పుడు తన చివరి చిత్రం 'మామన్నన్' మంచి ఓపినింగ్స్ సాధిస్తూ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని 510 థియేటర్లలో విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పుడు రెండవ వారంలో కూడా 470 థియేటర్లలో రన్ అవుతోందని చెప్పారు. ఇంత మంచి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రం చేస్తున్నప్పుడు చాలా అనుభవాలను చవి చూశామన్నారు.
(ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్)
చిత్ర ఇంటర్‌వెల్‌లో వచ్చే ఫైట్ సన్నివేశాలను నాలుగు రోజులు పాటు చిత్రీకరించినట్లు చెప్పారు. షూటింగ్ మొదలైన 8 రోజులు వరకు దర్శకుడు మారి సెల్వరాజ ఏం తీస్తున్నారో అర్థం కాలేదన్నారు. తర్వాత క్రమంగా అవగాహన వచ్చిందన్నారు. ఈ చిత్రంలో తనకు తండ్రిగా వడివేలు పేరు చెప్పగానే షాక్‌కు గురయ్యానన్నారు. అయితే ఇందులో వడివేలు నటించకపోతే ఈ చిత్రమే వద్దు వేరే చిత్రం చేద్దామని మారి సెల్వరాజ అన్నారన్నారు. ఆయనకు ఈ నమ్మకంతో ఈ చిత్రాన్ని అప్పగించానో దాన్ని పూర్తి చేశారని అన్నారు. మామన్నన్ చిత్రం 9 రోజుల్లోనే రూ.52 కోట్లు వసూలు చేసిందని, తన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రం ఇదని ఆయన పేర్కొన్నారు. తెలుగులో మామన్నన్ జులై 14న 'నాయకుడు' పేరుతో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment