సాక్షి, చెన్నై: సీఎం ఎంకే స్టాలిన్ కోడలు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిక ఉదయ నిధికి సంబంధించిన రూ. 36.3 కోట్లు విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అటాచ్ చేసినట్లు తెలిసింది.
ఇటీవల ఉదయ నిధి సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో లభించిన ఆధారాల మేరకు ఉదయ నిధి సేవా ట్రస్ట్‌కు సంబంధించిన నిర్వాహణ బాధ్యతల్లో ఉన్న కృతికను ఈడీ టార్గెట్ చేసినట్లు సమాచారం. ఆమె పేరిట ఉన్న స్థిర, చర ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంతో పాటు ఆమె పేరిట బ్యాంక్‌లో ఉన్న రూ. 34 లక్షల నగదును సీజ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment