![Tamil Nadu Assembly Polls 2021 Durga Stalin Campaign For Son Udhayanidhi - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/29/tn-polls.jpg.webp?itok=GmeB1Qo3)
సాక్షి, చెన్నై: తన కుమారుడు ఉదయనిధి ఏ రంగంలోనైనా రాణించగలడని దుర్గా స్టాలిన్ వ్యాఖ్యానించారు. చేపాక్కం – ట్రిప్లికేన్ నియోజకవర్గంలో ఉదయనిధి పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా తల్లి దుర్గా స్టాలిన్ ప్రచారానికి సిద్ధం అయ్యారు. స్టాలిన్ పోటీ చేస్తున్న కొళత్తూరులో ఆమె పర్యటిస్తున్నారు. కొందరు మహిళతో కలిసి ఇంటింటా వెళ్లి కరపత్రాలు అందిస్తూ స్టాలిన్‌ను ఆదరించాలని, గెలిపించాలని విన్నవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆమెను మీడియా చుట్టుముట్టి ప్రశ్నల్ని అడగ్గా, సమాధానాలు ఇచ్చారు.
అది పార్టీ నిర్ణయం..
ఉదయ నిధి రాజకీయాల్లోకి రావడమే కాదు, చేస్తున్న ప్రసంగాలను చూసి తానే ఆశ్చర్యానికి లోనయ్యానని పేర్కొన్నారు. తన కుమారుడికి సీటు ఇవ్వాలని స్టాలిన్‌ను తాను కోరలేదని, అది పార్టీ తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. తన బిడ్డ రాజకీయాల్లో రాణిస్తాడని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అధికారంలోకి వస్తే ఉదయనిధికి మంత్రి పదవి గ్యారంటీ అన్నట్టుందే అని ప్రశ్నించగా, అది పార్టీ తీసుకునే నిర్ణయం మేరకు ఉంటుందన్నారు. స్టాలిన్ గెలుపు కోసమే కాదు, డీఎంకే కూటమిలోని అందరు అభ్యర్థుల గెలుపు కోసం తాను పూజలు చేస్తున్నానని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment