
న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజా చేసిన వ్యాఖ్యలతో తాము ఏకీభవించబోమని కాంగ్రెస్ పేర్కొంది. అన్ని మతాలకు సమాన గౌరవం(సర్వధర్మ సమభావ) భావననే తమ పార్టీ విశ్వసిస్తుందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్ పవన్ ఖెరా స్పందిస్తూ..‘సమధర్మ సమభా వమనే దానినే కాంగ్రెస్ ఎల్లప్పుడూ విశ్వసిస్తుంది, ప్రతి మతం, ప్రతి విశ్వాసాలకు ఇందులో సమస్థానం ఉంటుంది. ఎవరూ ఎవరినీ తక్కువగా చూడరు. ఇలాంటి వ్యాఖ్య లను కాంగ్రెస్ పార్టీ కూడా సమ్మతించదని అన్నారు.
విద్వేషాలు తొలిగేదాకా యాత్ర: రాహుల్
విద్వేషాలు తొలిగిపోయి భారత్ ఏకమయ్యేదాకా తన యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ప్రారంభమై గురువారం ఏడాది పూర్తయిన సందర్భంగా రాహుల్ స్పందించారు. నాలుగు వేల కిలోమీటర్ల పైచిలుకు సాగిన తన పాదయాత్ర తాలూకు వీడియో ఫుటేజిని ఎక్స్‌లో పంచుకుంటూ.. ‘ఈ యాత్ర కొనసాగుతుంది. ఇది నా ప్రామిస్’ అని రాహుల్ పేర్కొన్నారు. భారత్ జోడోయాత్రలో రాహుల్ 12 బహిరంగ సభల్లో, 100 పైచిలుకు రోడ్డు కార్నర్ మీటింగ్‌లలో, 13 విలేకరుల సమావేశాల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment