చెన్నె: తాత మాజీ ముఖ్యమంత్రి.. తండ్రి పార్టీ అధినేత.. కుమారుడు సినీ రంగంలో ప్రవేశించి ఇప్పుడు రాజకీయాల్లో ఎంటరయ్యాడు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి తాతకు తగ్గ మనుమడు అని తాజా ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ నిరూపించుకున్నాడు. అయితే ఉదయనిధి చేసిన ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మధురై ప్రచారంలో ఉదయనిధి వ్యంగ్యంగా చేసిన విమర్శలు.. చర్యలను ఓటర్లను అమితంగా ఆకట్టుకున్నాయి. డీఎంకే గెలుపులో కీలక పాత్ర పోషించింది ఏమిటంటే ఒక ‘ఇటుక’. ప్రచారంలో ఉదయనిధి వాడిన ఇటుక వైరల్‌గా మారింది. ఆ పార్టీ విజయంలో ఇటుక పాత్ర ఎంతో ఉంది.
కేంద్ర ప్రభుత్వం మధురైకు ఎయిమ్స్ (ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను మంజూరు చేసింది. మంజూరు చేసి మూడేళ్లు దాటినా ఇంతవరకు పనులు పూర్తికాలేదు. శంకుస్థాపనకే పరిమితమైంది. దీన్ని అస్త్రంగా చేసుకుని ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ దూసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీరును ‘ఇటుక’ చూయిస్తూ ఇదిగోండి ఎయిమ్స్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎయిమ్స్ అని రాసి ఉన్న ఇటుకను పార్టీ అధినేత, తన తండ్రి ఎంకే స్టాలిన్‌కు ఉదయనిధి ఆదివారం అప్పగించాడు. దానర్థం నాన్న మీరైనా ఎయిమ్స్‌ను పూర్తి చేయండి పరోక్షంగా చెప్పాడు. ఈ విధంగా తమిళనాడు ఎన్నికల్లో ఇటుక కీలక పాత్ర పోషించింది. ఇంతకీ ఉదయనిధి స్టాలిన్ తొలిసారి చెపాక్కం- ట్రిప్లికేన్ నుంచి విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఏకంగా 68,880 ఓట్ల మెజార్టీ సాధించి తాత, తండ్రికి వారసుడిగా దూసుకొచ్చాడు.
చదవండి: ఊహించని షాక్: 3 రాష్ట్రాల్లో బీజేపీకి ఘోర పరాభవం
చదవండి: కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?'
తన తండ్రి స్టాలిన్‌కు ఎయిమ్స్ ఇటుక ఇస్తున్న ఉదయనిధి స్టాలిన్
#DMKwinsTN #AIIMS #TNwithDMK pic.twitter.com/da6aF5k6qW
— Udhay (@Udhaystalin) May 2, 2021
Comments
Please login to add a commentAdd a comment