నవంబర్ 27న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On November 27, the birthday of celebrities | Sakshi
Sakshi News home page

నవంబర్ 27న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Published Thu, Nov 26 2015 10:49 PM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM

నవంబర్  27న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

నవంబర్ 27న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
బప్పీ లహరి (మ్యూజిక్ డైరక్టర్), ఉదయనిధి స్టాలిన్ (యాక్టర్
)
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యసంబంధ సంఖ్య కావడం వల్ల వీరికి ఈ సంవత్సరం వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. పుష్కలంగా ధనం చేతికంది, ఇల్లు, ఆస్తులు కొనుక్కోవాలనే కోరిక తీరుతుంది. పెద్దలతో, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి, వాటిని తమ ఉన్నతికి ఉపయోగించుకుంటారు. అవివాహితులకు వివాహం అవుతుంది. సంతానం  కలుగుతుంది. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. అనుకున్న పనులన్నింటినీ అవలీలగా సాధిస్తారు. పుట్టిన తేదీ 27. ఇది కుజునికి సంబంధించిన సంఖ ్య కాబట్టి సహజంగానే నాయకత్వ లక్షణాలు, ఇతరులను ప్రభావితం చేయగలిగిన కార్యనిర్వహణా సామర్థ్యం కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలతో మంచి సాంకేతిక నైపుణ్యంతో చురుకుగా పని చేసి మంచి పేరు తెచ్చుకుంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తిస్తుంది. యూనిఫారం ధరించే ఉద్యోగులు మంచి ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి ప్రదర్శించి అధికారుల మన్ననలు అందుకుంటారు. అయితే వాహనాలు నడిపేటప్పుడు, ఆయుధాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తత అవసరం. లక్కీ నంబర్స్: 1,5,6,8,9; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ బుధ, శుక్ర, శనివారాలు; లక్కీ కలర్స్: రెడ్, రోజ్, బ్లూ, ఎల్లో, సిల్వర్, గోల్డెన్. సూచనలు: రుద్రాభిషేకం చేయించుకోవడం, ఆదిత్య హృదయం పఠించడం లేదా వినడం,  సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం, రక్తదానం చేయటం, చేయించటం, పేదవిద్యార్థులకు పుస్తకాలు, పరికరాలు కొనిపెట్టడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement