కోల్కతా: తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమిలో ఒక్కొక్క పార్టీ విభేదిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా చేరిపోయారు.
వివాదం జరిగిన ఒక రోజు తర్వాత మమతా బెనర్జీ స్పందిస్తూ ఏమన్నారంటే.. ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఎప్పుడూ మాట్లాడకూడదు. నా దృష్టిలో ఉదయనిధి స్టాలిన్ చాలా జూనియర్. ఆయన ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారన్నది నాకు తెలియదు. అన్ని మతాలను గౌరవించాలన్నది నా అభిప్రాయం. నాకు తమిళనాడు ప్రజలంటే అమితమైన గౌరవం. కానీ వారు అన్ని మతాలను సమానంగా గౌరవించాలని కోరుతున్నాను.
భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం. నాకు సనాతన ధర్మం మీద అపార గౌరవముంది. వేదాల నుంచే మనం అన్నీ నేర్చుకున్నాము. పౌరోహిత్యాన్ని గౌరవించుకుంటాము.. పౌరోహిత్యం చేస్తున్న వారికి పెన్షన్లు కూడా ఇస్తున్నాము. దేశ వ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. మనమంతా దేవాలయాలకు వెళ్తాం, మసీదులకు వెళ్తాం, చర్చిలకు కూడా వెళ్తుంటాం. భారతదేశ మూలాల నుంచి గమనిస్తే భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇక్కడ అనాదిగా కొనసాగుతూ వస్తోంది. దాన్ని మనం గౌరవించాలని అన్నారు.
ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల ప్రభావం పరిణామ క్రమంలో వృద్ధి చెందుతున్న 'ఇండియా' కూటమిపైన పడే అవకాశమున్నందున ఇప్పటికే ఈ కూటమిలోని పార్టీలు నష్ట నివారణ చర్యలు చేపట్తాయి. కాంగ్రెస్ పార్టీ తమకు అన్ని మతాలపైనా గౌరవముందని ప్రకటించగా.. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీ ఉదయనిధి వ్యాఖ్యలతో తీవ్రంగా విభేదించింది. తాజాగా మమతా బెనర్జీ కూడా ఈ జాబితాలో చెరిపియారు.
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ఎన్ని సెలవులు తీసుకున్నారో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment