Sanatan Sanstha
-
దసరా ఉత్సవాల్లో సనాతన ధర్మం విమర్శకులపై పోస్టర్లు
ఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరుగుతున్న దసరా వేడుకల్లో దిష్టిబొమ్మలకు సనాతన ధర్మ వ్యతిరేకులపై పోస్టర్లు వెలిశాయి. 'సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్లు నశించిపోతారు', 'సనాతన ధర్మ విమర్శకులు అంతరించిపోతారు' అని పేర్కొన్న పోస్టర్లను దిష్టిబొమ్మలకు అంటించారు. కానీ వేడుకల ప్రారంభానికి ముందే వాటన్నింటిని తొలగించారు. కాగా ఈ ఏడాది ఎర్రకోటలో జరుగుతున్న దసరా ఉత్సవాలకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా హాజరుకానున్నారు. 50 ఏళ్లుగా జరుగుతున్న ఎర్రకోట ఉత్సవాల చరిత్రలో తొలిసారి ఓ మహిళ కంగనా రనౌత్ ఈ సారి దిష్టిబొమ్మను దహనం చేయనుంది. ఎర్రకోట వద్ద జరుగుతున్న ఉత్సవాల్లో రావణ, కుంభకర్ణ, మేఘనాథ్ ల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. రావణ దహనం పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమం దసరా వేడుకల్లో ఓ సాంప్రదాయంగా వస్తోంది. చెడుపై మంచి విజయానికి గుర్తుగా ఈ వేడుకలను జరుపుతున్నారు. సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో పోలుస్తూ ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ మండిపడింది. దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే చర్యగా పరిగణించింది. ఇదీ చదవండి: మొసలితో రైతుల వినూత్న నిరసన.. కేటీఆర్ రియాక్షన్ ఇది..! -
మాటలు జాగ్రత్త.. విద్వేషాలను రెచ్చగొట్టకూడదు
చెన్నై: ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కే కానీ అది ద్వేషపూరితంగా ఉండకూడదని తెలిపింది. బాధ్యతలను తెలియజేసేది.. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు సనాతన ధర్మంపై వ్యతిరేకత గురించి డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఎలాంగోవన్ వేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ శేషసాయి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అనేది మన దేశం, మన పరిపాలకులు, తల్లిదండ్రులు, గురువుల పట్ల మన శాశ్వత బాధ్యతను గుర్తుచేసే ధర్మాల సమూహమని పేదల పట్ల దయ చూపించమని చెబుతుందని అన్నారు. సనాతన ధర్మంపై డిబేట్లా.. ఈ సందర్బంగా ఆయన సనాతన ధర్మంపై డిబేట్లు పెట్టడంపై మరింత తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మం కులవ్యవస్థను ప్రోత్సహించి అంటరానితనాన్ని ప్రేరేపిస్తుందన్న అసత్యాన్ని ప్రజల మనసుల్లో నాటే ప్రయత్నం చేయడాన్ని ఆయన ఖండించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని ఎప్పుడో నిర్మూలించడం జరిగిందని గుర్తుచేశారు. మనుషులంతా ఒక్కటే.. ఈ దేశంలో అందరూ ఒక్కటేనని ఇటువంటి దేశంలో అంటరానితనాన్ని సహించేది లేదని అన్నారు. మతం అనేది సహజమైన కల్మషంలేని స్వచమైన విశ్వాసం అనే పునాది మీద నిర్మితమైందని భావ ప్రకటన స్వేచ్ఛ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండకూడదని అన్నారు. ఇది కూడా చదవండి: ICMR: కరోనా కంటే నిఫాతోనే మరణాల రేటు ఎక్కువ -
సనాతన ధర్మాన్ని అంతం చేసేందుకు కుట్రలు
బీనా/రాయ్‌గఢ్: ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిని దురంహకారి కూటమిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఇండియా కూటమి లక్ష్యంగా పెట్టుకుందని, వెయ్యి సంవత్సరాల బానిసత్వంలోకి దేశాన్ని నెట్టివేయాలని చూస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమైందని, ఈ ఘనత 140 కోట్ల మంది భారతీయులకు దక్కుతుందని పేర్కొన్నారు. ఈ విజయం దేశ ప్రజల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ గురువారం పర్యటించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలోని బీనా రిఫైనరీలో రూ.49 వేల కోట్లతో నిర్మించే పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. దాంతోపాటు మరో 10 పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధానమంత్రి ప్రసంగించారు. అలాగే చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా కొండతరాయి గ్రామంలో ‘విజయ్ శంఖనాథ్’ సభలోనూ మాట్లాడారు. రెండు సభల్లో ఆయన ఏం చెప్పారంటే... కుట్రలను అడ్డుకోవాలి ‘‘దురహంకారి కూటమి ఇటీవలే ముంబైలో సమావేశమైంది. ఆ కూటమికి ఒక విధానం లేదు, ఒక నాయకుడు లేడు. సనాతన ధర్మంపై దాడి చేసి, నాశనం చేయాలన్న రహస్య ఎజెండా మాత్రమే ఉంది. సనాతన ధర్మం నుంచి జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తి పొందారు. స్వాతంత్య్రం కోసం ఆయన సాగించిన పోరాటం సనాతన ధర్మం చుట్టూ కేంద్రీకృతమైంది. మహాత్ముడు జీవితాంతం సనాతన ధర్మాన్ని పాటించారు. ఆయన చివరిసారిగా ‘హే రామ్’ అంటూ నెలకొరిగారు. రాణి అహిల్యాబాయి హోల్కర్, ఝాన్సీ లక్ష్మీబాయి, స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్ వంటి మహనీయులు సనాతన ధర్మ నుంచి స్ఫూర్తి పొంది ముందుకు నడిచారు. విపక్ష కూటమి నాయకులు బహిరంగంగా మాట్లాడడం ప్రారంభించారు. వారు మనపై దాడికి పదును పెడుతున్నారు. దేశంలో సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ, దేశాభిమానులు ఈ విషయం గమనించాలి. అప్రమత్తంగా ఉండాలి. సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు సాగుతున్న కుట్రలను మనమంతా కలిసికట్టుగా అడ్డుకోవాలి. మనం ఐక్యంగా ఉంటే వారి ఆటలు సాగవు. వారి ప్రయత్నాలనీ విఫలమవుతాయి. మన లక్ష్యం ‘ఆత్మనిర్భర్ భారత్’ జీ20 సదస్సు విజయంతో దేశ ప్రజల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి. ఈ ఘనత మోదీకి కాదు, ముమ్మాటికీ 140 మంది భారతీయులదే. చిన్నపిల్లలకు కూడా జీ20 గురించి తెలిసింది. బృంద స్ఫూర్తితో పని చేయడం వల్ల ఈ సదస్సు విజయవంతమైంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ చాలా ఏళ్లు అధికారంలో ఉంది. కానీ, ఆ పార్టీ చేసిందేమీ లేదు. అవినీతికి, నేరాలకు పాల్పడడంతోనే కాంగ్రెస్‌కు సమయం సరిపోయింది. కాంగ్రెస్ హయాంలో నేరగాళ్లు రాజ్యమేలారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకివచ్చాక అవినీతి అంతమైంది. సుపరిపాలన కొనసాగుతోంది. పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామివేత్తలు తరలివస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించుకోవాలి. పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోకెమికల్ ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మారాలి. దిగుమతులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. స్వయం స్వావలంబన దిశగా బీనా రిఫైనరీ ఒక ముందడుగు అవుతుంది. దళారుల ప్రమేయాన్ని అంతం చేశాం బానిస మనస్తత్వం నుంచి దేశం బయట పడింది. ‘న్యూ ఇండియా’ సగర్వంగా ముందడుగు వేస్తోంది. ప్రభుత్వ పథకాల అమలులో దళారుల ప్రమేయాన్ని అంతం చేశాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందజేస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటిదాకా రూ.2.60 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో జమచేశాం. వ్యవసాయ రంగంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నాం. రైతులపై భారం తగ్గిస్తున్నాం. ఎరువులను చౌకగా అందజేయడానికి సబ్సిడీ రూపంలో గత తొమ్మిదేళ్లలో రూ.10 లక్షల కోట్లకుపైగా వెచి్చంచాం. అమెరికాలో ఒక యూరియా సంచి ధర రూ.3,000 ఉంది. మన దగ్గర మాత్రం రైతులకు కేవలం రూ.300కే లభిస్తోంది. దేశంలో గత నాలుగేళ్లలో కొత్తగా 10 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చాం. మొఘల్ రాజులపై పోరాటం చేసిన గిరిజన పాలకురాలు రాణి దుర్గావతి 500వ జయంతి వేడుకలను అక్టోబర్ 5న ఘనంగా నిర్వహిస్తాం. ‘ఇండియా’ పట్ల జాగ్రత్త భారత్‌ను, ప్రాచీన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కనుమరుగు చేయాలని చూస్తున్న విపక్ష ‘ఇండియా’ కూటమి కుయుక్తుల పట్ల ప్రజలు నిత్యం జాగరూకులై ఉండాలి. మన దేశానికి, మన విశ్వాసాలకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. కొందరు వ్యక్తులు అధికారం నుంచి దూరమయ్యాక ప్రజల పట్ల ద్వేషం పెంచుకున్నారు. అందుకే ప్రజల గుర్తింపుపై, సంస్కృతిపై దాడి చేస్తున్నారు. దేశంలో వేలాది సంవత్సరాలుగా అవిచి్ఛన్నంగా కొనసాగుతున్న సంస్కృతిని విచి్ఛన్నం చేయాలని చూస్తున్నారు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్నదే వారి అసలు లక్ష్యం. సనాతన ధర్మం వ్యక్తుల జన్మకు కాదు, వారి కర్మ(చేసే పనులు) ప్రాధాన్యం ఇస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. -
భారతదేశం మీ తాతల సొత్తు కాదు
న్యూఢిల్లీ: కొద్దిరోజుల క్రితం డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఎంతటి రాజకీయా దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసందే. ఈ వ్యాఖ్యలు ఇండియాకూటమి చేసినా వ్యాఖ్యలుగా భావంచకూడదని ఏవి ఒక పార్టేకి చెందిన చిన్న నేత చేసినవని అన్నారు ఆప్ నేత రాఘవ్ చద్దా. ఎవరో చిన్న నేత.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి ఇండియా కూటమి భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి స్పందిస్తూ నేను సనాతన ధర్మానికి చెందిన వాడిని. ఇటువంటి వ్యాఖ్యలకు అందరూ దూరంగా ఉండాలి. మనం అన్ని మతాలను గౌరవించాలన్నారు. ఆ వ్యాఖ్యలు ఎవరో ఒక పార్టీకి చెందిన చిన్ననేత చేసిన వ్యాఖ్యలని ఇండియా కూటమి అధికారికంగా చేసినవి కాదని అన్నారు. అదే మా ప్రణాళిక.. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమి చేసిందన్నట్లుగా బీజేపీ పార్టీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. దేశం ఇంతకంటే పెద్ద సమస్యలను ఎదుర్కుంటోందని ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి మేము లేవనెత్తాల్సిన అంశాలు చాలానే ఉన్నాయన్నారు. ఇక ఈరోజు ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో జరగనున్న సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించబోయే అంశాల గురించి ప్రస్తావించగా ఒక్కో రాష్ట్రంలో ఎన్నికలు ఒక్కో రీతిగా ఉంటాయని వాటిప్రకారం ఎన్నికల ప్రణాళికను రూపొందించే విషయమై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు. కూటమి అవసరాన్ని బట్టి ఆయా పార్టీలు కొన్ని త్యాగాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆ సీన్ రిపీట్ అవుతుంది.. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి గురించి ప్రశ్నించగా మేము కూటమిలో నమ్మకమైన సైనికుడిగా ఉన్నామని ప్రధాని అభ్యర్థి గురించి కూటమి కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వానికి అర్హులైన చాలామంది ముఖ్య నాయకులు ఉన్నారని ఎన్డీయే కూటమిలోలా ఒక్కరి పేరు చెప్పుకుని ఎన్నికల్లోకి వెళ్ళమని అన్నారు. 1977లో కూడా ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పడిందని అప్పుడు కూడా ప్రధాని అభ్యర్థిని ముందుగా నిర్ణయించలేదని కానీ ఆ కూటమి ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని గుర్తు చేస్తూ 2024లో కూడాఅదే కథ పునరావృతమవుతుందని అన్నారు. భయం మొదలైంది.. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కూడా ఇండియా కూటమి నాలుగింట విజయం సాధించగా ఎన్డీయే కూటమి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింద అక్కడ కూడా వారికి స్వల్ప ఆధిక్యత మాత్రమే దక్కిందన్నారు. ఇండియా బలమైన కూటమని ఎన్డీయే సిద్ధాంతాలు చెప్పే కూటమని అన్నారు. ఇప్పటికే వారిలో భయం పుట్టుకుందని అందుకే ఏకంగా దేశం పేరు మార్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ఒక్కటే చెప్పదలచుకున్నాను. ఇండియా వారి తాతల సొత్తు కాదు. 135 కోట్ల భారతీయులదని అన్నారు. త్వరలో జరుగనున్న ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల గురించి చెబుతూ ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలకు కూడా మాట్లాడే అవకాశమివ్వాలని అజెండా లేకుండా సమావేశాలు ఏమిటో నాకర్ధం కావడం లేదని అసలు ఈ సమావేశాల ఎజెండా ఏమిటో ఒకరిద్దరు బీజేపీ నేతలకు మినహాయిస్తే ఎవ్వరికి తెలియదని అన్నారు. ఇది కూడా చదవండి: నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం.. -
సనాతన ధర్మం వ్యాఖ్యలపై ధీటుగా స్పందించండి.. ప్రధాని మోదీ ఆదేశం
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలు పెనురాజకీయ దుమారాన్నే సృష్టించాయి. ఇప్పటివరకు ఈ అంశంపై మౌనంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జరిగిన మంత్రుల సమావేశంలో స్పందించారు. ఈ వ్యాఖ్యలపై సరైన విధంగా స్పందించాలని ఆదేశించారు. ఇది హైలైట్ చెయ్యండి.. బుధవారం జరిగిన క్యాబినెట్ మంత్రుల సమావేశంలో ప్రధాని రెండు అంశాలపై వారికి స్పష్టతనిచ్చారు. మొదటిది సనాతన ధర్మంపై డీఎంకే నేత చేసిన వ్యాఖ్యలపై కఠినంగా స్పందించమన్నారు. రెండవది 'ఇండియా' 'భారత్' అంశంపై మాట్లాడవద్దని మంత్రులకు ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. కేవలం పార్టీ అధికార ప్రతినిధులు మాత్రమే ఈ అంశంపై స్పందిస్తారని మిగతావారంతా సనాతన ధర్మాన్ని కించపరచిన వ్యాఖ్యలకు దీటుగా సమాధానమివ్వాలని కోరారు. కుర్రనేత తగ్గేదెలే.. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకపక్క బీజేపీ నేతలంతా ఈ వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తుంటే.. మరోపక్క డీఎంకే యువనేత మాత్రం తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని మళ్ళీ మళ్ళీ ఇదే మాట అంటానని తెగేసి చెబుతున్నారు. కేంద్రం కులవివక్షను పెంచి పోషిస్తోందని, నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఉదయనిధి స్టాలిన్ పైన ఆ వ్యాఖ్యలను సమర్ధించినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే పైన కూడా యూపీలోని రామ్‌పూర్‌లో కేసు నమోదైంది. ఇది కూడా చదవండి: రామ్‌నాథ్ కోవింద్ కమిటీ మొదటి సమావేశంలో కీలకాంశాలు -
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా.. అతడొక జూనియర్
కోల్‌కతా: తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమిలో ఒక్కొక్క పార్టీ విభేదిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా చేరిపోయారు. వివాదం జరిగిన ఒక రోజు తర్వాత మమతా బెనర్జీ స్పందిస్తూ ఏమన్నారంటే.. ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఎప్పుడూ మాట్లాడకూడదు. నా దృష్టిలో ఉదయనిధి స్టాలిన్ చాలా జూనియర్. ఆయన ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారన్నది నాకు తెలియదు. అన్ని మతాలను గౌరవించాలన్నది నా అభిప్రాయం. నాకు తమిళనాడు ప్రజలంటే అమితమైన గౌరవం. కానీ వారు అన్ని మతాలను సమానంగా గౌరవించాలని కోరుతున్నాను. భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం. నాకు సనాతన ధర్మం మీద అపార గౌరవముంది. వేదాల నుంచే మనం అన్నీ నేర్చుకున్నాము. పౌరోహిత్యాన్ని గౌరవించుకుంటాము.. పౌరోహిత్యం చేస్తున్న వారికి పెన్షన్లు కూడా ఇస్తున్నాము. దేశ వ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. మనమంతా దేవాలయాలకు వెళ్తాం, మసీదులకు వెళ్తాం, చర్చిలకు కూడా వెళ్తుంటాం. భారతదేశ మూలాల నుంచి గమనిస్తే భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇక్కడ అనాదిగా కొనసాగుతూ వస్తోంది. దాన్ని మనం గౌరవించాలని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల ప్రభావం పరిణామ క్రమంలో వృద్ధి చెందుతున్న 'ఇండియా' కూటమిపైన పడే అవకాశమున్నందున ఇప్పటికే ఈ కూటమిలోని పార్టీలు నష్ట నివారణ చర్యలు చేపట్తాయి. కాంగ్రెస్ పార్టీ తమకు అన్ని మతాలపైనా గౌరవముందని ప్రకటించగా.. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీ ఉదయనిధి వ్యాఖ్యలతో తీవ్రంగా విభేదించింది. తాజాగా మమతా బెనర్జీ కూడా ఈ జాబితాలో చెరిపియారు. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ఎన్ని సెలవులు తీసుకున్నారో తెలుసా? -
ఆయన రెచ్చగొడుతుంటే, నిద్రపోతున్నారా?
లక్నో: ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే నిఘా వర్గాలు నిద్రపోతున్నాయా అని ఉత్తర ప్రదేశ్ సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అబు అజ్మీ ప్రశ్నించారు. ఒకవేళ తీవ్రవాదులను జకీర్ నాయక్ ప్రోత్సహిస్తుంటే ఆయనపై చర్యలు తీసుకోకుండా దేశంలోని అధికారులంతా ఏమైపోయారని ఆయన నిలదీశారు. ఇస్లాంలోని వివిధ విశ్వాసాలు గల ప్రజల మనోభావాలను వెల్లడిస్తున్నందుకే ఆయనపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. 'జకీర్ నాయక్ 25 ఏళ్లుగా మత బోధకుడిగా ఉన్నారు. తీవ్రవాదులకు ఆయన ప్రేరణ ఇస్తుంటే ఇంతకాలం ఎందుకు ఆయనపై చర్య తీసుకోలేదు. ఎందుకు దర్యాప్తు చేపట్టలేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపింది. అప్పటి వరకు ఆయనకు వ్యతిరేకంగా మీడియా విచారణ ఆపాల'ని అబు అజ్మీ పేర్కొన్నారు. హేతువాదులు నరేంద్ర దలోల్కర్, గోవింద్ పన్సారే, ఎంఎం కుల్బర్గీ హత్యలకు కారణమైన సనాతన సంస్థను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. -
'సనాతన్ సంస్థ' సభ్యుడే సూత్రధారి!
కొల్హాపూర్/ న్యూఢిల్లీ: హేతువాది గోవింద్ పన్సారే హత్యకు 'సనాతన్ సంస్థ' సభ్యుడు రుద్ర పాటిల్ సూత్రధారి అని దర్యాప్తు సంస్థ సిట్ భావిస్తోంది. అతనితోపాటు మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పన్సారే హత్యకు గురయ్యారు. గతవారం సనాతన్ సంస్థ సభ్యుడు గైక్వాడ్‌ను సిట్ అరెస్టు చేసింది. ముంబైకి చెందిన ఒకరిని, కర్ణాటకకు చెందిన మరో ఇద్దరిని ప్రశ్నించింది. గైక్వాడ్, ఇతరులు వెల్లడించిన వివరాల ఆధారంగా రుద్ర పాటిల్, సారంగ్ అకోల్కర్లకు ఈ హత్యతో సంబంధమున్నట్లు వెల్లడైందని పోలీసు అధికారి వెల్లడించారు.