
తమిళ సినిమా: శీనురామస్వామి దర్శకత్వం వహించనున్న చిత్రంలో కథానాయకుడిగా నటించి నిర్మించడానికి యువ నటుడు ఉదయనిధి స్టాలిన్ రెడీ అవుతున్నారన్నది తాజా న్యూస్. మంచి కథావస్తువుతో కూడిన సెలెక్టెడ్ చిత్రాలను చేస్తూ విజయాలను అందుకుంటున్న ఉదయనిధి స్టాలిన్ తాజాగా ప్రియదర్శన్ దర్శకత్వంలో నటిస్తున్న నిమిర్ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే నెల తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
కాగా ఈ నటుడు నూతన చిత్రాన్ని కమిట్ అయ్యారు. ధర్మదురై వంటి మంచి విలువలతో కూడిన చిత్రాల దర్శకుడు శీనురామస్వామితో చేతులు కలిపారు. వీరి కాంబనేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం జనవరి 19వ తేదీన ప్రారంభం కానుంది. దీని గురించి ఉదయనిధి స్టాలిన్ తెలుపుతూ దర్శకుడు శీనురామస్వామి చిత్రాలంటే తనకు చాలా ఇష్టం అన్నారు. ఆయన చిత్రాల్లో మావనతా విలువలతో పాటు కుటుంబ సమేతంగా చూసి ఆనందించే జనరంజక అంశాలు చోటు చేసుకుంటాయన్నారు.
ఆయనతో జాతీయ అవార్డును గెలుచుకున్న నీర్‌ప్పరవై వంటి చిత్రాన్ని నిర్మించిన అనుభవంతో చెబుతున్నానని, అలాంటి దర్శకుడితో చిత్రాన్ని నిర్మించి, కథానాయకుడిగా నటించడం తన బాధ్యతను, ఇష్టాన్ని పెంచుతాయని అన్నారు.శీనూరామస్వామి దర్శకత్వంలో నటించనుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఉదయనిధిస్టాలిన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment