Seenu Ramaswamy
-
హీరోయిన్‌పై లైంగిక వేధింపులు.. నిలిచిన విజయ్ సేతుపతి సినిమా!
కోలీవుడ్‌లో నటి త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు కొద్దిరోజులుగా సౌత్ ఇండియాలో పెద్ద చర్చాంశంగా మారింది. త్రిషకు మన్సూర్ సారీ చెప్పడంతో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడింది. తమిళ చిత్రసీమలో ఇలాంటి ఘటనలు చాలా సార్లు జరిగాయని.. ఇదే తొలిసారి కాదని, గతంలో కూడా పలువురు హీరోయిన్లు లైంగిక వేధింపులకు గురికావడం జరిగిందని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. హీరోయిన్ మనీషాపై సుమారు 9 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఇప్పుడు తెరపైకి వచ్చింది మనీషా యాదవ్‌పై లైంగిక వేధింపులు శీను రామసామి దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన 'ఉదామ విధ ఏవల్' చిత్రం ఇంకా విడుదల కాలేదు. అయితే, కొడైకెనాల్లో సినిమా షూటింగ్లో నటి మనీషా యాదవ్‌ను శీను రామసామి లైంగికంగా వేధించాడని జర్నలిస్ట్ బిస్మీ భకీర్ తాజాగా ఆరోపించారు. ఈ సందర్భంలో మనీషా యాదవ్ దీనిపై ఓ పోస్ట్ పెట్టి మరోసారి వైరల్‌గా మారింది. శీను రామస్వామి షేర్ చేసిన వీడియో: మనీషా యాదవ్ తన వల్లనే సినిమా నుంచి తప్పుకున్నారా..? అంటూ ఒక వీడియో షేర్ చేశారు. అందులో శీను రామస్వామి కృతజ్ఞతలు చెబుతూ మనీషా యాదవ్ కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆ పోస్ట్‌పై మనీషా యాదవ్ స్పందించింది. 2010లో విజయ్ సేతుపతితో శీను రామస్వామి తీసిన మరోచిత్రం 'తెన్మెర్కు పరువాకత్రు'. ఈ సినిమాకు నేషనల్ అవార్డు దక్కింది. విజయ్‌కు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. నేను ఏదీ ఎప్పటికీ మరచిపోలేను శీను రామస్వామి వీడీయోకు కౌంటర్‌గా మనీషా కూడా ఒక పోస్ట్ పెట్టింది. 'ఒక చెత్త కథ ఆడియో ఆవిష్కరణలో అందరికీ కృతజ్ఞతలు తెలిపినట్లే శీను రామస్వామికి కూడా నేను కృతజ్ఞతలు తెలిపాను. లేదంటే 9 ఏళ్ల క్రితం నేను అతని గురించి చెప్పిన దానికి ప్రత్యామ్నాయం లేదని, తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తితో ఎప్పటికీ పని చేయను.' మనీషా యాదవ్ చెప్పింది. అప్పట్లో అతనిపై ఆమె చేసిన ఆరోపణల వల్లే అప్పట్లో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. 9 ఏళ్లు అయినా ఆ చిత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. -
ఉదయనిధి స్వీయ నిర్మాణంలో కొత్త సినిమా
తమిళ సినిమా: శీనురామస్వామి దర్శకత్వం వహించనున్న చిత్రంలో కథానాయకుడిగా నటించి నిర్మించడానికి యువ నటుడు ఉదయనిధి స్టాలిన్ రెడీ అవుతున్నారన్నది తాజా న్యూస్. మంచి కథావస్తువుతో కూడిన సెలెక్టెడ్ చిత్రాలను చేస్తూ విజయాలను అందుకుంటున్న ఉదయనిధి స్టాలిన్ తాజాగా ప్రియదర్శన్ దర్శకత్వంలో నటిస్తున్న నిమిర్ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే నెల తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా ఈ నటుడు నూతన చిత్రాన్ని కమిట్ అయ్యారు. ధర్మదురై వంటి మంచి విలువలతో కూడిన చిత్రాల దర్శకుడు శీనురామస్వామితో చేతులు కలిపారు. వీరి కాంబనేషన్లో తెరకెక్కనున్న చిత్రం జనవరి 19వ తేదీన ప్రారంభం కానుంది. దీని గురించి ఉదయనిధి స్టాలిన్ తెలుపుతూ దర్శకుడు శీనురామస్వామి చిత్రాలంటే తనకు చాలా ఇష్టం అన్నారు. ఆయన చిత్రాల్లో మావనతా విలువలతో పాటు కుటుంబ సమేతంగా చూసి ఆనందించే జనరంజక అంశాలు చోటు చేసుకుంటాయన్నారు. ఆయనతో జాతీయ అవార్డును గెలుచుకున్న నీర్ప్పరవై వంటి చిత్రాన్ని నిర్మించిన అనుభవంతో చెబుతున్నానని, అలాంటి దర్శకుడితో చిత్రాన్ని నిర్మించి, కథానాయకుడిగా నటించడం తన బాధ్యతను, ఇష్టాన్ని పెంచుతాయని అన్నారు.శీనూరామస్వామి దర్శకత్వంలో నటించనుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఉదయనిధిస్టాలిన్ తెలిపారు. -
మనీషా నటన నచ్చలేదా?
వర్ధమాన హీరోయిన్ మనీషాయాదవ్కు చేదు అనుభవం ఎదురైందా? జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు శీను రామస్వామికి ఆమె నటన నచ్చలేదా? అలాంటప్పుడు ముందుగానే మూడు సార్లు అడిషన్లు జరిపి మనీషాను ఇదం పొరుల్ ఇవళ్ చిత్రానికి హీరోయిన్గా ఎందుకు ఎంపిక చేశారు? షూటింగ్ ప్రారంభం అయిన తరువాత ఆమెనెందుకు తొలగించాల్సి వచ్చింది? ఈ పరిణామంతో మనసు గాయపడిన నటి మనీషా యాదవ్ న్యాయం కోసం నటీనటుల సంఘాన్ని ఆశ్రయించనుందా? లాంటి పలు ఆసక్తికరమైన అంశాలు కోడంబాక్కంలో హల్చల్ చేస్తున్నాయి. తెన్మేర్కు పరువకాత్తు చిత్రంలో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు నందుకున్న దర్శకుడు శీనురామసామి. నీర్పరవై చిత్రం తరువాత తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదం పొరుల్ ఇవళ్. విజయ్ సేతుపతి, విష్ణువిశాల్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత లింగుసామి తిరుపతి బ్రదర్స్ సంస్థ నిర్మిస్తోంది. మనీషా నే పర్ఫెక్ట్ విజయ్ సేతుపతికి జంటగా వర్ధమాన నటి మనీషా యాదవ్‌ను ఎంపిక చేశారు. ఆమె ఇందులో కొండ ప్రాంతపు వ్యవసాయ కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్ర పోషించనున్నట్లు, ఇంతకు ముందు మనీషా యాదవ్ నటించిన వళక్కు ఎన్ 18/9, ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్ చిత్రాల్లో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయానని, తన చిత్రంలో హీరోయిన్ పాత్రకు మనీషా యాదవ్‌నే పర్ఫెక్ట్గా సరిపోతుందని దర్శకుడు శీను రామసామి చిత్ర ప్రారంభానికి ముందు వెల్లడించారు. అభినయం నచ్చలేదు ఇదం పొరుల్ ఇవళ్ చిత్ర షూటింగ్ ఈ నెల మూడో తేదీన దిండుగల్‌లో ప్రారంభమైంది. ప్రారంభ దశలోనే నటి మనీషా యాదవ్ నటన దర్శకుడిని సంతృప్తి పరచలేదని ఆయన చిత్రాల్లో హీరోయిన్లకు అధిక ప్రాముఖ్యత ఉంటుందని, అలాంటి మనీషా యాదవ్ అభినయం, షార్ట్ సంభాషణల ఉచ్ఛరణ దర్శకుడు శీనురామస్వామికి నచ్చలేదని అందుకే ఆమెను చిత్రం నుంచి తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. అమర్యాదగా తొలగించారు ఈ వ్యవహారం గురించి నటి మనీషా తల్లి యమునా సురేష్‌ను స్పందించాలని అడగ్గా ఇదం పొరుల్ ఇవళ్ చిత్రం విషయంలో సమస్య ఉత్పన్నమైన సంగతి నిజమేనన్నారు. అయితే ఇందులో మనీషా యాదవ్ తప్పు ఏమీ లేదని పేర్కొన్నారు. ఆమెను అమర్యాదగా చిత్రం నుంచి తొలగించారని ఆరోపించారు. మనీషా యాదవ్ సరిగ్గా నటించలేదన్నది నిజం కాదన్నారు. ఈ చిత్రానికి ఎంపిక చేసే విషయంలో దర్శకుడు శీను రామసామి, మనీషాను మూడు దశలుగా ఆడిషన్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు దర్శకుడికి తెలియదా? ఆ పాత్రకు ఆమె నప్పుతారా? లేదా? అన్నది అని ప్రశ్నించారు. నిజానికి తాము మూడు రోజుల క్రితమే చిత్ర షూటింగ్లో పాల్గొన్నామని వెల్లడించారు. ఆ రోజు కూడా షూటింగ్ సక్సెస్ అయ్యే ముందు సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదున్నర వరకు మనీషా సన్నివేశాలను చిత్రీకరించారని తెలిపారు. అరగంట షూటింగ్‌లోనే ఆమె అభినయం గురించి దర్శకుడు జడ్జ్ చేయగలరా? అంటూ ప్రశ్నించారు. మరుసటి రోజునే ఆ చిత్ర ప్రొడక్షన్ మేనేజర్ చేత బెంగళూరుకు టికెట్ పంపించడం నిరాధారంగా చిత్రం నుంచి తొలగించడం బాధాకరం అన్నారు.