అనుకున్నవన్నీ జరగవు | Tamannaah 12 years Completed In Film Industry | Sakshi
Sakshi News home page

అనుకున్నవన్నీ జరగవు

Published Fri, Aug 31 2018 9:21 AM | Last Updated on Fri, Aug 31 2018 9:21 AM

Tamannaah 12 years Completed In Film Industry - Sakshi

సాక్షి, సినిమా: అనుకున్నవి జరగవు, ఊహించనివి జరుగుతాయి ఇది జీవితానికే కాదు, సినీరంగానికి వర్తిస్తుంది అంటోంది మిల్కీబ్యూటి తమన్న. ఈమె సినీ జీవితం బాహుబలికి ముందు, ఆ తరువాత అన్నట్లుగా విభజించవచ్చు. అగ్రనటిగా రాణిస్తున్న ఈ బ్యూటీకి ఇటీవల కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ఇంకో విషయం ఏమిటంటే ఆమె ఉదయనిధి స్టాలిన్‌తో నటించిన కన్నె కలమానే చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా, విడుదలలో జాప్యం జరుగుతోంది. ఆ చిత్రం మినహా చేతిలో మరో చిత్రం లేదు. ఈ సందర్భంగా తమన్న ఏమంటుందో చూద్దాం. ‘‘నేను సినీరంగప్రవేశం చేసి 12 ఏళ్లు అయ్యింది. ఆరంభంలో సినిమా గురించి పెద్దగా అర్థం కాకపోయినా ఇప్పుడు చాలా అనుభవం పొందా. చిత్ర పరిశ్రమ గురించి అర్థం అయ్యింది. ఇంకా చెప్పాలంటే నా నిజజీవితానికి, సినీ జీవితానికి అనుబంధం ఉందనిపిస్తోంది. ఆదిలో వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించి నటించాను.

అందులో కొన్ని చిత్రాలు అనూహ్యంగా విజయం సాధించి నా కెరీర్‌కు ఉపయోగ పడ్డాయి. బాహుబలి చిత్రం తరువాతే ఉత్తమ నటి అనిపించుకున్నాను. అంతకు ముందు హిందీలో కొన్ని చిత్రాల్లో నటించినా, అక్కడా నాకు గుర్తింపు తెచ్చి పెట్టిన చిత్రం బాహుబలినే. హిందీలో డబ్బింగ్‌ చేసిన బాహుబలి చిత్రం అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఓ చిత్రంలో నటిస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందీ? విజయం సాధిస్తుందా. అపజయం చెందుతుందా? అన్నది ఎవరూ చెప్పలేరు. ప్రతి చిత్రాన్ని  ముఖ్యంగానే భావించి నటిస్తాం. కొన్ని చిత్రాలే సంతృప్తిని కలిగిస్తాయి. కొన్ని  చిత్రాలు  విజయం సాధిస్తాయని భావించినా ప్లాప్‌ అవుతుంటాయి. నిజం చెప్పాలంటే కొన్ని చిత్రాల్లో ఎలాంటి నమ్మకం లేకుండా నటిస్తాం. అవి అనుకోకుండా సక్సెస్‌ అవుతుంటాయి. ఇక్కడ ఊహించినవి జరగవు, అనుకోనివీ జరుగుతుంటాయి. సినిమా పేరు, డబ్బు అన్నీ ఇస్తుంది. అద్భుత చిత్రాలు ఎప్పుడు వస్తాయన్నది ఎవరూ చెప్పలేరు. అనూహ్యంగా వస్తాయి. ఉన్నత స్థాయిలో కూర్చోబెడతాయి’’ అని తమన్న పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement