
తమన్నా భాటియా
తమిళసినిమా: నటి తమన్నా భాటియా. ఈ ఉత్తరాది భామ దక్షిణాదిలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తోంది. నాజూకైన నడుము, పాలవన్నె శరీరం, ఆకర్షణీయమైన నగుమోము ఈ అమ్మడికే సొంతం. మొదట్లో హిందీ చిత్రంతో రంగప్రవేశం చేసినా, ఆపై దక్షిణాదికే పరిమితమైంది. 2005లో శ్రీ చిత్రంతో టాలీవుడ్‌కు దిగుమతి అయిన తమన్నా కోలీవుడ్‌లో కేడీ చిత్రంతో దూసుకొచ్చింది. విశేషం ఏమిటంటే ఈ రెండు చిత్రాలు ఆశించిన సక్సెస్‌ను అందించకపోయినా, తమిళంలో కల్లూరి చిత్రం పేరును, తెలుగులో హ్యాపీడేస్ చిత్రం విజయాన్ని అందించాయి. ఆ తరువాత అమ్మడికి ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. బాలీవుడ్‌లో కలిసి రాకపోయినా, తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరునే తెచ్చుకుంది.
మొదట్లో తన అందానే నమ్ముకుని కమర్శియల్ చిత్రాల్లో నటించి గ్లామరస్ కథానాయకిగా గుర్తింపు పొందినా, బాహుబలి చిత్రంలో అవంతికగా నటిగా తానేమిటో నిరూపించుకుంది. అలా వచ్చిన అవకాశాలన్నీ ఎడాపెడా ఒప్పేసుకుని నటించేస్తున్న ఈ బ్యూటీకి ఇటీవల స్పీడ్ తగ్గింది. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్‌లో గత ఏడాది స్కెచ్ చిత్రం తరువాత మరో చిత్రం తెరపైకి రాలేదు. ప్రస్తుతం ఉదయనిధిస్టాలిన్‌తో నటిస్తున్న కన్నే కలైమానే చిత్రం ఒక్కటే చేతిలో ఉంది. ఇక తెలుగులో చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తోంది. కల్యాణ్ రామ్‌తో నటించిన నా నువ్వే గురువారం తెరపైకి రానుంది.ఇక నాగచైతన్య హీరోగా నటిస్తున్న సవ్యసాచి చిత్రంలో గెస్ట్ రోల్‌లో మెరవనుంది.
సో మొత్తం మీద ఈ మిల్కీబ్యూటీకి అవకాశాలు తగ్గు ముఖం పట్టాయనే చెప్పాలి. తమన్నా జోరు తగ్గిందా? అన్న ప్రశ్నకు ఆమె మాత్రం అంగీకరించడంలేదు. తమన్నా ఏమంటుందో చూద్దాం. కొందరు అనుకుంటున్నట్లు నాకు అవకాశాలు తగ్గలేదు. నా జోరు తగ్గలేదు. అవకాశాలు తగ్గలేదు. నేను 13 ఏళ్లుగా వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా నటిస్తున్నానని చెప్పింది. కొంచెం విరామం కోరుకుంటున్నానని చెప్పింది. అందుకే ఇకపై వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోకుండా, నచ్చిన పాత్రలనే అంగీకరించి నటించాలని నిర్ణయించుకున్నానంది.
Comments
Please login to add a commentAdd a comment