ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం శుభ్రం చేసుకో అన్నాడు: నిధి అగర్వాల్‌ | Nidhi Agarwal Interesting Comments on Director Magizh Thirumeni | Sakshi
Sakshi News home page

Nidhi Agarwal: ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం శుభ్రం చేసుకో అన్నాడు: నిధి అగర్వాల్‌

Published Sat, Nov 19 2022 8:45 AM | Last Updated on Sat, Nov 19 2022 9:29 AM

Nidhi Agarwal Interesting Comments on Director Magizh Thirumeni - Sakshi

నటి నిధి అగర్వాల్‌ ప్రస్తుతం కోలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఇంతకుముందు శింబు సరసన ఈశ్వరన్, జయం రవికి జంటగా భూమి చిత్రాల్లో మెరిసింది. తాజాగా ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా కలగ తలైవన్‌ చిత్రంలో నాయికగా నటించింది. మగిళ్‌ తిరుమేణి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ నిర్మించింది. చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా నటి నిధి అగర్వాల్‌ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ కలగ సంఘం చిత్రంలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ఒకసారి దర్శకుడు మగిళ్‌ తిరుమేణి నుంచి ఫోన్‌ వచ్చిందని, వెంటనే ఆయన్ని కలుస్తానని చెప్పానంది.

అలా కలిసిన వెంటనే ముందు ముఖాన్ని శుభ్రపరుచుకోమని చెప్పారంది. ఆ తర్వాత ఆయన తన ముఖ కవళికలను మాత్రమే ఫొటో షూట్‌ చేశారని చెప్పింది. ఈ చిత్రంలో మేకప్‌ లేకుండా నటించాలని తెలిపారు. ఇందులో నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నట్లు చెప్పింది. ఆయన సహ నటీనటులకు ఎంతో గౌరవం ఇస్తారంది. ఉదయనిధి స్టాలిన్‌కు వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు, పనుల ఒత్తిడి ఉంటుందని, అయితే వాటిని షూటింగ్‌లో ఎప్పుడు కనబరిచే వారు కాదని చెప్పింది. తమిళ చిత్రాల్లో నటిస్తున్నప్పటి నుంచి తమిళభాషను నేర్చుకుంటున్నానని నిధి అగర్వాల్‌ తెలిపింది.  

చదవండి: 
మహాలక్ష్మి తల్లి కాబోతుందా? ఫొటో వైరల్‌
ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్‌ ఆరోగ్యం, నడవలేని స్థితిలో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement