
తమిళసినిమా: నెంజిక్కు నీతి వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఉదయనిధి స్టాలిన్ వరుసగా చిత్రాలు చేస్తున్నారు. అలా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రాల్లో ఒకటి కలగ తలైవన్. తన రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఈయన నిర్మించిన ఈ చిత్రంలో ఈశ్వరన్, భూమి చిత్రాల ఫేమ్ నిధిఅగర్వాల్ కథా నాయకిగా నటించింది. బిగ్‌బాస్ ఆరవ్ విలన్‌గా నటించిన ఈ చిత్రానికి మీగామన్, తోడు చిత్రాల ఫేమ్ మేడి న్ తిరుమేణి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ దేవా సంగీతం, దిల్ రాజు చాయాగ్రహణం అందించిన ఈ చి త్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఈ నెల 18వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం రాత్రి చెన్నైలోని సత్యం థియేటర్లో చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పా ల్గొన్న శాసనసభ్యుడు, చిత్ర కథానాయకుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ దర్శకుడు చిత్రాన్ని చాలా చక్కగా, త్వరగా చిత్రీకరించా రని పేర్కొన్నారు. అయితే దీన్ని మూ డేళ్లుగా చెక్కుకుంటూ వచ్చారన్నారు. ఈనెల 18వ తేదీన విడుదల చేయాలని చెప్పామని, లేకపోతే ఇంకా దీన్ని చెక్కుతూనే ఉండేవారని, అంత పర్ఫెక్ట్‌గా కలగ తలైవన్ చిత్రాన్ని దర్శకుడు తీర్చిదిద్దారని తెలిపారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు.
ఇందులో తనకంటే కథానాయకి నిధిఅగర్వాల్‌నే ఎక్కువగా శ్రమించారని, ఆమెకే ఎక్కువగా ఫైట్స్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, వాటి కోసం ఆమె దెబ్బలు తింటూ చాలానే కష్టపడ్డారని చెప్పారు. పాపం ఆమె మళ్లీ తమిళ చిత్రాల్లో నటిస్తుందో? లేదో అని సరదాగా వ్యాఖ్యానించారు. దీని తర్వాత మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న మా మన్నన్ చిత్రం విడుదల కానుందని తెలిపారు. కాగా అందరూ చిత్రాల నుంచి వైదొలగవద్దని చెబుతున్నారని తెలి పారు. తాను నటించడం మొదలెట్టిందే ఇప్పుడే అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment