తమిళ సినిమా: ఎస్‌సీ జననాథన్ దర్శకత్వం వహింన పేరాన్మై చిత్రం ద్వారా పరిచయం అయిన నటి వసుంధర. జయం రవి కథానాయకుడిగా నటించారు. ఐదుగురు హీరోయిన్లలో ఒకరిగా నటించి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. తాజాగా ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన కన్నై నంబాదే చిత్రం, సముద్రఖని సరసన తలైకుత్తల్ చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా నటి వసుంధర తన భావాలను వ్యక్తం చేస్త దర్శకుడు, నటుడు సముద్రఖని, శీనరామసామి వంటి దర్శకులు తనను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
ఆ మధ్య నటించిన కన్నే కలైమానే, బక్రీద్ వంటి త్రాలు తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయన్నారు. తాజాగా ఉదయనిధి స్టాలిన్, ప్రసన్న శ్రీకాంత్ నాతో నటింన కన్నై నంబాదే చిత్రం మల్టీస్టార్‌గా రపొందిందన్నారు. ఇరవుక్కు అయిందు కన్‌గళ్ చిత్రం ఫేమ్ ఎం.వరన్ ఈ చిత్రానికి దర్శకుడు అని చెప్పారు. ఇందులో తనది కొంచెం మోడ్రన్ పాత్ర అని చెప్పారు.
ఇలాంటి మోడ్రన్ పాత్రల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. పేరాన్మై చిత్రం తరువాత ఇందులో కొంచెం గరుకు తనం కలిగిన పాత్రలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో తనకు ఉదయనిధి స్టాలిన్‌కు మధ్య కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయన్నారు. ఆయనది రాజకీయ కుటుంబం అయినా అందరితో ఎంతో మర్యాదగా ఉండేవారని, ఫైట్ సన్నివేశాల్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చాలా కేర్ తీసుకునే వారిని చెప్పారు.
ప్రస్తుతం క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్లు చెప్పారు. అదేవిధంగా కలైకుత్తల్ చిత్రంలో సముద్రఖని సరసన నటించడం మం అనుభవంగా పేర్కొన్నారు. ఇందులో ఖదిర్, వయ్యాపురి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారని చెప్పారు. జయప్రకాష్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహింన చిత్రం ఇదని తెలిపారు. ఈ చిత్రంలో సముద్రఖని నుం తాను చాలా నేర్చుకున్నానన్నారు. ప్రస్తుతం లక్ష్మీనారాయణన్ దర్శకత్వంలో రపొందుతున్న థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న త్రంలో నటిస్తున్నట్లు చెప్పారు.
కాగా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రేక్షకుల అభిరుచిని మార్చే విధంగా వినూత్న కథా చిత్రాలను అందిస్తున్నాయన్నారు. అలాంటి చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహింన పొన్నియిన్ సెల్వన్ వంటి చారిత్రక కథా చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు నటి వసుంధర పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment