
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి మనవడు.. డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించారు. డీఎంకే పార్టీకి కంచుకోట అయిన చెపాక్ నియోజకవర్గంనుంచి గెలుపొందారు. హీరోగా పలు చిత్రాల్లో నటించిన ఉదయనిధి.. స్టార్‌డమ్ సంపాదించుకోలేకపోయారు. ఒకరకంగా ఆయనకు సినిమాలు అచ్చిరాలేదని చెప్పాలి. హిట్లకంటే ఎక్కువ ప్లాపులే మూటకట్టుకున్నారు. ప్రస్తుతం డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్న ఆయన మొదటి సారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు.
కుటుంబానికి అచ్చువచ్చిన స్థానం నుంచి పోటీ చేశారు. డెబ్యూనే అదరగొట్టారు. దాదాపు 60 వేల ఓట్ల ఆధిక్యాన్ని సాధించాడు. ఇదే నియోజకవర్గం నుంచి తాత కరుణానిధి మూడుసార్లు గెలిచారు. వరుసగా 1996, 2001, 2006లలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కరుణా నిధి కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తారో లేదో చూడాలి మరి.