
తమిళసినిమా: ప్రతి విషయానికి ఎవరో ఒకరు, ఏదో ఒకటి స్ఫూర్తిగా నిలుస్తుంది. అలా ఒక చిత్ర హీరోయిన్ పాత్రకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్ఫూర్తి అయ్యారు. ఈ విషయాన్ని దర్శకుడు శీనూ రామస్వామి స్వయంగా వెల్లడించారు. ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం కన్నె కలైమానే. ఉదయనిధిస్టాలిన్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 22వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శీనూరామస్వామి మాట్లాడుతూ ధర్మదురై చిత్రాన్ని పూర్తి చేసి విజయ్‌సేతుపతి హీరోగా మామనిదన్ చిత్రాన్ని చేయాలని భావించగా, విజయ్‌సేతుపతి వేరే చిత్రాలతో బిజీగా ఉన్నారని తెలిపారు.
అలాంటి సమయంలో రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నుంచి షణ్ముగమూర్తి తనను కలిశారన్నారు. దాని ఫలితమే కన్నె కలైమానే అని చెప్పారు. ఆ సమయంలో ఆయన పెట్టిన ఒకే ఒక్క కడింషన్ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ ఉండాలన్నారు. అయితే అందుకు ఈ చిత్రంలో అవకాశం లేదని చెప్పానన్నారు. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్ కలిసి ఫర్వాలేదు తాను చూసుకుం టాను అని చెప్పారన్నారు. అలా ఆయన హీరో యిన్‌కు ప్రాధాన్యత ఉన్న చిత్రంలో నటించడానికి ముందుకొచ్చిన ధైర్యానికి ధన్యవాదాలన్నారు. ఇందులో నటి తమన్నాది చాలా «దైర్యం కలిగిన అమ్మాయి పాత్ర అని చెప్పారు. ధైర్యవంతురాలంటే ఎలా ఉండాలన్నదానికి తన మనసులో మెదిలింది దివంగత ముఖ్యమంత్రి జయలలిత రూపమేనన్నారు. ఆమె నడక, చీర కట్టు, బొట్టు ఎలా ఉండాలన్నది జయలలిత పాత ఫొటోల ను ఇంటర్నెట్‌లో చూసి, ఆమెను స్ఫూర్తిగా తీ సుకుని తమన్న పాత్రను తీర్చిదిద్దానని చెప్పా ý‡ు. కార్యక్రమానికి నటుడు విజయ్ సేతుపతి అతిథిగా విచ్చేయగా ఉదయనిధిస్టాలిన్, తమ న్నా తదితర చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment