శశి దర్శకత్వంలో ఉదయనిధి | udayanidhi stalin in shashi direction | Sakshi
Sakshi News home page

శశి దర్శకత్వంలో ఉదయనిధి

Published Sat, Mar 19 2016 2:51 AM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

శశి దర్శకత్వంలో ఉదయనిధి

శశి దర్శకత్వంలో ఉదయనిధి

దర్శకుడు శశి, నటుడు ఉదయనిధి స్టాలిన్‌ల రేర్ కాంబినేషన్‌లో ఒక చిత్రం తెరకెక్కనుందన్న ప్రచారం కోలీవుడ్‌లో వినిపిస్తోంది.

దర్శకుడు శశి, నటుడు ఉదయనిధి స్టాలిన్‌ల రేర్ కాంబినేషన్‌లో ఒక చిత్రం తెరకెక్కనుందన్న ప్రచారం కోలీవుడ్‌లో వినిపిస్తోంది. రోజాకూటం, సొల్లామలే, డిష్యుం, పూ తదితర వైవిధ్యభరిత కథా చిత్రాలను రూపొందించిన శశి ఇటీవల సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోని హీరోగా తెరకెక్కించిన పిచ్చైక్కారన్ చిత్రం సూపర్‌హిట్ అయ్యింది. దీంతో శశి తాజా చిత్రానికి సిద్ధమయ్యారు. సక్సెస్ చిత్రాల దర్శకులపై వాలిపోయే నటుడు ఉదయనిధి స్టాలిన్ శశి దర్శకత్వంలో నటించడానికి రెడీ అయ్యిపోయారనే టాక్ వినిపిస్తోంది.  శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ ఈ క్రేజీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ తన సొంత నిర్మాణ సంస్థలోనే నటిస్తున్న ఉదయనిధి స్టాలిన్ బయటి సంస్థలో నటించనున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ మనిదన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హన్సిక నాయకి. ఇక శశి దర్శకత్వంలో నటించనున్న చిత్రం గురించి పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement