చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అత్యధికులు స్టాలిన్ మాటలను వ్యతిరేకిస్తుంటే కొందరు మాత్రమే సమర్థిస్తున్నారు. తాజాగా డీఎంకే మరో మంత్రి ఏ రాజా.. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను వెనకేసుకొచ్చారు.
గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఏ రాజా మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ సున్నిత మనస్కులు కాబట్టి సున్నితంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో పోల్చారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులకు సమాజంలో ఎలాంటి బెరుకు ఉండదని సనాతన ధర్మాన్ని సమాజాన్ని భయపెట్టే హెచ్ఐవి, కుష్టు వంటి వ్యాధులతో పోల్చాలని అన్నారు. సనాతన ధర్మం, విశ్వకర్మ యోజన రెండు వేర్వేరు కాదని రెండూ ఒక్కటేనని అన్నారు.
ఈ అంశంపై డిబేట్ పెడితే చర్చలకు పెరియార్, అంబేద్కర్ పుస్తకాలను వెంటబెట్టుకుని ఢిల్లీ వస్తానని అన్నారు. నాపై రివార్డులు కూడా ప్రకటించనీ నేనైతే భయపడేది లేదని అన్నారు. ఒకవేళ ప్రధాన మంత్రి చర్చలకు రమ్మన్నా వెళతాను.. అనుమతిస్తే కేంద్ర కేబినెట్ మంత్రులతో కూడా దీనిపై చర్చకు సిద్ధమని సనాతన ధర్మం అంటే ఏమిటో చెబుతానని అన్నారు.
ఇది కూడా చదవండి: ‘బాలకృష్ణలా చంద్రబాబు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా?
Comments
Please login to add a commentAdd a comment