Sanathan Sanstha
-
సనాతన ధర్మం.. భారత్‌కు మారుపేరు: మోహన్ భగవత్
ఛండీగర్: సనాతన ధర్మం భారత్‌కు పర్యాయపదమని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశ సంస్కృతి సనాతన ధర్మం మీదే ఆధారపడి ఉందని చెప్పారు. అలాంటి ధర్మాన్ని నాశనం చేయాలనుకోవడం స్వీయ హానితో సమానమని అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మంటలు రేపుతుండటం తెలిసిందే. వాటిని ఉద్దేశించి భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం హరియాణాలోని రోహతక్‌లో బాబా మస్త్‌నాథ్ మఠంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. సనాతనమంటేనే ఎప్పటికీ నిలిచి ఉండేదని, మన ధర్మం కూడా అంతేనని చెప్పారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి వీకే సింగ్, యోగ గురు రామ్‌దేవ్, పలువురు సాధు ప్రముఖులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా పరిష్కారం కోసం అంతా భారత్‌కేసే చూస్తున్నారని ఆదిత్యనాథ్ అన్నారు. ఒకప్పుడు అసాధ్యమనుకున్న అయోధ్య రామాలయ నిర్మాణం ఇప్పుడు కళ్లముందు కన్పిస్తున్న వాస్తమని చెప్పారు. అంతకుముందు ఉదయం జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహంత్ చంద్‌నాథ్ యోగి విగ్రహాన్ని మఠంలో ఆవిష్కరించారు. ఇదీ చదవండి: గంగా జలంపై జీఎస్టీ.. ట్యాక్స్ బోర్డు ఏం చెప్పిందంటే.. -
ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం నోటీసులు
ఢిల్లీ: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉదయనిధితోపాటు ఏ రాజా, మరో 14 మందికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు పంపింది. ఇందులో సీబీఐ అధికారులతో పాటు తమిళనాడు పోలీసులు కూడా ఉన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. అనంతరం ఈ వ్యాఖ్యలకు పాల్పడినవారికి నోటీసులు పంపింది. ఈ కేసును విద్వేష ప్రసంగంతో అనుసంధానం చేయడానికి నిరాకరించింది. ఉదయనిధి వ్యాఖ్యలు.. సనాతన నిర్మూళన కాన్ఫరెన్స్‌లో ఉదయనిధి మాట్లాడుతూ.. సనాతనా ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి రోగాలతో పోల్చారు. ఇలాంటి విషయాలను వ్యతిరేకిస్తే సరిపోదని, మొత్తానికి నిర్మూలించాలని అన్నారు. సామాజిక న్యాయానికి సనాతన ధర్మం వ్యతిరేకమని అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయన్ను అరెస్టు చేయాలని దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయి. ఉదయనిధిని అరెస్టు చేసేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇదీ చదవండి: ఎన్సీపీలో రగులుతున్న వివాదం.. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? -
సనాతన ధర్మాన్ని అంతం చేసేందుకు కుట్రలు
బీనా/రాయ్‌గఢ్: ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిని దురంహకారి కూటమిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఇండియా కూటమి లక్ష్యంగా పెట్టుకుందని, వెయ్యి సంవత్సరాల బానిసత్వంలోకి దేశాన్ని నెట్టివేయాలని చూస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమైందని, ఈ ఘనత 140 కోట్ల మంది భారతీయులకు దక్కుతుందని పేర్కొన్నారు. ఈ విజయం దేశ ప్రజల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ గురువారం పర్యటించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలోని బీనా రిఫైనరీలో రూ.49 వేల కోట్లతో నిర్మించే పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. దాంతోపాటు మరో 10 పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధానమంత్రి ప్రసంగించారు. అలాగే చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా కొండతరాయి గ్రామంలో ‘విజయ్ శంఖనాథ్’ సభలోనూ మాట్లాడారు. రెండు సభల్లో ఆయన ఏం చెప్పారంటే... కుట్రలను అడ్డుకోవాలి ‘‘దురహంకారి కూటమి ఇటీవలే ముంబైలో సమావేశమైంది. ఆ కూటమికి ఒక విధానం లేదు, ఒక నాయకుడు లేడు. సనాతన ధర్మంపై దాడి చేసి, నాశనం చేయాలన్న రహస్య ఎజెండా మాత్రమే ఉంది. సనాతన ధర్మం నుంచి జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తి పొందారు. స్వాతంత్య్రం కోసం ఆయన సాగించిన పోరాటం సనాతన ధర్మం చుట్టూ కేంద్రీకృతమైంది. మహాత్ముడు జీవితాంతం సనాతన ధర్మాన్ని పాటించారు. ఆయన చివరిసారిగా ‘హే రామ్’ అంటూ నెలకొరిగారు. రాణి అహిల్యాబాయి హోల్కర్, ఝాన్సీ లక్ష్మీబాయి, స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్ వంటి మహనీయులు సనాతన ధర్మ నుంచి స్ఫూర్తి పొంది ముందుకు నడిచారు. విపక్ష కూటమి నాయకులు బహిరంగంగా మాట్లాడడం ప్రారంభించారు. వారు మనపై దాడికి పదును పెడుతున్నారు. దేశంలో సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ, దేశాభిమానులు ఈ విషయం గమనించాలి. అప్రమత్తంగా ఉండాలి. సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు సాగుతున్న కుట్రలను మనమంతా కలిసికట్టుగా అడ్డుకోవాలి. మనం ఐక్యంగా ఉంటే వారి ఆటలు సాగవు. వారి ప్రయత్నాలనీ విఫలమవుతాయి. మన లక్ష్యం ‘ఆత్మనిర్భర్ భారత్’ జీ20 సదస్సు విజయంతో దేశ ప్రజల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి. ఈ ఘనత మోదీకి కాదు, ముమ్మాటికీ 140 మంది భారతీయులదే. చిన్నపిల్లలకు కూడా జీ20 గురించి తెలిసింది. బృంద స్ఫూర్తితో పని చేయడం వల్ల ఈ సదస్సు విజయవంతమైంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ చాలా ఏళ్లు అధికారంలో ఉంది. కానీ, ఆ పార్టీ చేసిందేమీ లేదు. అవినీతికి, నేరాలకు పాల్పడడంతోనే కాంగ్రెస్‌కు సమయం సరిపోయింది. కాంగ్రెస్ హయాంలో నేరగాళ్లు రాజ్యమేలారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకివచ్చాక అవినీతి అంతమైంది. సుపరిపాలన కొనసాగుతోంది. పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామివేత్తలు తరలివస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించుకోవాలి. పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోకెమికల్ ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మారాలి. దిగుమతులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. స్వయం స్వావలంబన దిశగా బీనా రిఫైనరీ ఒక ముందడుగు అవుతుంది. దళారుల ప్రమేయాన్ని అంతం చేశాం బానిస మనస్తత్వం నుంచి దేశం బయట పడింది. ‘న్యూ ఇండియా’ సగర్వంగా ముందడుగు వేస్తోంది. ప్రభుత్వ పథకాల అమలులో దళారుల ప్రమేయాన్ని అంతం చేశాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందజేస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటిదాకా రూ.2.60 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో జమచేశాం. వ్యవసాయ రంగంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నాం. రైతులపై భారం తగ్గిస్తున్నాం. ఎరువులను చౌకగా అందజేయడానికి సబ్సిడీ రూపంలో గత తొమ్మిదేళ్లలో రూ.10 లక్షల కోట్లకుపైగా వెచి్చంచాం. అమెరికాలో ఒక యూరియా సంచి ధర రూ.3,000 ఉంది. మన దగ్గర మాత్రం రైతులకు కేవలం రూ.300కే లభిస్తోంది. దేశంలో గత నాలుగేళ్లలో కొత్తగా 10 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చాం. మొఘల్ రాజులపై పోరాటం చేసిన గిరిజన పాలకురాలు రాణి దుర్గావతి 500వ జయంతి వేడుకలను అక్టోబర్ 5న ఘనంగా నిర్వహిస్తాం. ‘ఇండియా’ పట్ల జాగ్రత్త భారత్‌ను, ప్రాచీన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కనుమరుగు చేయాలని చూస్తున్న విపక్ష ‘ఇండియా’ కూటమి కుయుక్తుల పట్ల ప్రజలు నిత్యం జాగరూకులై ఉండాలి. మన దేశానికి, మన విశ్వాసాలకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. కొందరు వ్యక్తులు అధికారం నుంచి దూరమయ్యాక ప్రజల పట్ల ద్వేషం పెంచుకున్నారు. అందుకే ప్రజల గుర్తింపుపై, సంస్కృతిపై దాడి చేస్తున్నారు. దేశంలో వేలాది సంవత్సరాలుగా అవిచి్ఛన్నంగా కొనసాగుతున్న సంస్కృతిని విచి్ఛన్నం చేయాలని చూస్తున్నారు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్నదే వారి అసలు లక్ష్యం. సనాతన ధర్మం వ్యక్తుల జన్మకు కాదు, వారి కర్మ(చేసే పనులు) ప్రాధాన్యం ఇస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. -
‘సనాతన ధర్మం అంశంపై చర్చలకు ఎవరు రమ్మన్నా వస్తా’
చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అత్యధికులు స్టాలిన్ మాటలను వ్యతిరేకిస్తుంటే కొందరు మాత్రమే సమర్థిస్తున్నారు. తాజాగా డీఎంకే మరో మంత్రి ఏ రాజా.. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను వెనకేసుకొచ్చారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఏ రాజా మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ సున్నిత మనస్కులు కాబట్టి సున్నితంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో పోల్చారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులకు సమాజంలో ఎలాంటి బెరుకు ఉండదని సనాతన ధర్మాన్ని సమాజాన్ని భయపెట్టే హెచ్ఐవి, కుష్టు వంటి వ్యాధులతో పోల్చాలని అన్నారు. సనాతన ధర్మం, విశ్వకర్మ యోజన రెండు వేర్వేరు కాదని రెండూ ఒక్కటేనని అన్నారు. ఈ అంశంపై డిబేట్ పెడితే చర్చలకు పెరియార్, అంబేద్కర్ పుస్తకాలను వెంటబెట్టుకుని ఢిల్లీ వస్తానని అన్నారు. నాపై రివార్డులు కూడా ప్రకటించనీ నేనైతే భయపడేది లేదని అన్నారు. ఒకవేళ ప్రధాన మంత్రి చర్చలకు రమ్మన్నా వెళతాను.. అనుమతిస్తే కేంద్ర కేబినెట్ మంత్రులతో కూడా దీనిపై చర్చకు సిద్ధమని సనాతన ధర్మం అంటే ఏమిటో చెబుతానని అన్నారు. ఇది కూడా చదవండి: ‘బాలకృష్ణలా చంద్రబాబు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా? -
ఆ ముగ్గురి హత్యల వెనుక ఒకే సంస్థ
ముంబై: హేతువాదులు నరేంద్ర దబోల్కర్, ఎంఎం కలబురిగి, జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యలకు ఒకే అతివాద సంస్థ కారణమని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. అయితే, హేతువాది, కమ్యూనిస్టు నేత గోవింద్ పన్సారే హత్యతో ఈ సంస్థకు లింకులున్నట్లు ఆధారాలు లభించలేదన్నారు. ‘దబోల్కర్, లంకేశ్, కలబురిగిల హత్యల్లో ఒకే రకమైన భావాలున్న వ్యక్తులు పాల్గొన్నట్లు గుర్తించాం. ఆ సంస్థలోని దాదాపు అందరు సభ్యులకూ సనాతన్ సంస్థతోనూ దాని అనుబంధ ‘హిందూ జనజాగృతి సమితి’తోనూ సంబంధాలున్నాయని తేలింది. పాల్ఘర్ జిల్లా నల్లసోపారలో ఇటీవల ఆయుధాలు, పేలుడు సామగ్రితోపాటు అరెస్టయిన వారికి దబోల్కర్, లంకేశ్, కలబురిగిల హత్యలతో ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైంది. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే దబోల్కర్ హత్యతో సంబంధమున్న ఇద్దరిని అరెస్టు చేశాం. దీంతోపాటు ఈ ముగ్గురి హత్యలకు కీలక సూత్రధారి వీరేంద్ర సింగ్ తవాడేను కూడా పట్టుకున్నాం’ అని తెలిపారు. -
లంకేష్‌పై చేతన్ ఆరోపణలు
బెంగళూరు: దుండగుల చేతుల్లో దారుణ హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు గుంజేవారని సనాతన్ సంస్థా అధికారిక ప్రతినిధి చేతన్ రాజన్ అన్నారు. ఆమెకు మావోయిస్టులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అయితే, కమ్యునిజం భావజాలం ఉన్న వ్యక్తులు హత్యకు గురవుతున్నప్పుడు స్పందిస్తున్నవారంతా హిందూత్వ భావజాలం ఉన్నవారు హత్యకు గురైనప్పుడు మాత్రం స్పందించడం లేదంటూ వ్యాఖ్యానించారు. గౌరీ లంకేష్ హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె హత్యను తాము కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వాటిని ఏమాత్రం సహించరాదని చెప్పారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఇలా వ్యాఖ్యానించారు. గౌరీ లంకేష్ హత్య విషయంలో సనాతన్ సంస్థ హస్తం ఉందంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.