ఢిల్లీ: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉదయనిధితోపాటు ఏ రాజా, మరో 14 మందికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు పంపింది. ఇందులో సీబీఐ అధికారులతో పాటు తమిళనాడు పోలీసులు కూడా ఉన్నారు.
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. అనంతరం ఈ వ్యాఖ్యలకు పాల్పడినవారికి నోటీసులు పంపింది. ఈ కేసును విద్వేష ప్రసంగంతో అనుసంధానం చేయడానికి నిరాకరించింది.
ఉదయనిధి వ్యాఖ్యలు..
సనాతన నిర్మూళన కాన్ఫరెన్స్‌లో ఉదయనిధి మాట్లాడుతూ.. సనాతనా ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి రోగాలతో పోల్చారు. ఇలాంటి విషయాలను వ్యతిరేకిస్తే సరిపోదని, మొత్తానికి నిర్మూలించాలని అన్నారు. సామాజిక న్యాయానికి సనాతన ధర్మం వ్యతిరేకమని అన్నారు.
ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయన్ను అరెస్టు చేయాలని దేశవ్యాప్తంగా పలు స్టేషన్‌లలో ఫిర్యాదులు వచ్చాయి. ఉదయనిధిని అరెస్టు చేసేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఇదీ చదవండి: ఎన్సీపీలో రగులుతున్న వివాదం.. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు?
Comments
Please login to add a commentAdd a comment