
మాట్లాడుతున్న ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు, పెరంబూరు: ఇంతకు ముందు తాత కరుణానిధి ఉచితంగా టీవీలు ఇచ్చారని, ఈ సారి నాన్న స్టాలిన్ ఎన్నికల్లో గెలిస్తే సెటాప్ బాక్స్‌లు ప్రజలకు ఉచితంగా అందిస్తారని నటుడు, డీఎంకే నేత స్టాలిన్ కొడుకు ఉదయనిధిస్టాలిన్ వాగ్దానం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్లడం మొదలెట్టారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, కనిమొళి, ఉదయనిధిస్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ గ్రామసభలను నిర్వహిస్తున్నారు. అలా ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
మరి కొందరి ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు కూడా. కాగా మంగళవారం నటుడు ఉదయనిధిస్టాలిన్ తూత్తుక్కుడి జిల్లాలో పర్యటించారు. అక్కడు ఒక యువతి ఇం తకు ముందు కరుణానిధి ఉచితంగా టీవీలు పంచి పెట్టారని, అప్పట్లో కేబుల్ ప్రసారాలు ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉన్నా తక్కువ ధరకే చానళ్లలో కార్యక్రమాలు చూసే వారమని, ఇప్పుడు కేబుల్ ప్రసారాలను ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవడంతో ఎక్కువ చానళ్లు రావడం లేదని చెప్పిం ది. అందుకు సెటాప్ బాక్స్ తీసుకోవాలని, అందుకు అధిక డబ్బును వసూలు చేస్తున్నారని చెప్పింది. దీంతో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ అప్పుట్లో తాత టీవీలను ఉచితంగా ఇచ్చారని, నాన్న స్టాలిన్ అధికారంలోకి వస్తే ఉచితంగా సెటాప్ బాక్స్‌లను పంచుతారని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment