Set top boxes
-
తాత టీవీ ఇచ్చారు.. నాన్న సెటాప్ బాక్స్ ఇస్తారు
తమిళనాడు, పెరంబూరు: ఇంతకు ముందు తాత కరుణానిధి ఉచితంగా టీవీలు ఇచ్చారని, ఈ సారి నాన్న స్టాలిన్ ఎన్నికల్లో గెలిస్తే సెటాప్ బాక్స్‌లు ప్రజలకు ఉచితంగా అందిస్తారని నటుడు, డీఎంకే నేత స్టాలిన్ కొడుకు ఉదయనిధిస్టాలిన్ వాగ్దానం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్లడం మొదలెట్టారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, కనిమొళి, ఉదయనిధిస్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ గ్రామసభలను నిర్వహిస్తున్నారు. అలా ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మరి కొందరి ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు కూడా. కాగా మంగళవారం నటుడు ఉదయనిధిస్టాలిన్ తూత్తుక్కుడి జిల్లాలో పర్యటించారు. అక్కడు ఒక యువతి ఇం తకు ముందు కరుణానిధి ఉచితంగా టీవీలు పంచి పెట్టారని, అప్పట్లో కేబుల్ ప్రసారాలు ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉన్నా తక్కువ ధరకే చానళ్లలో కార్యక్రమాలు చూసే వారమని, ఇప్పుడు కేబుల్ ప్రసారాలను ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవడంతో ఎక్కువ చానళ్లు రావడం లేదని చెప్పిం ది. అందుకు సెటాప్ బాక్స్ తీసుకోవాలని, అందుకు అధిక డబ్బును వసూలు చేస్తున్నారని చెప్పింది. దీంతో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ అప్పుట్లో తాత టీవీలను ఉచితంగా ఇచ్చారని, నాన్న స్టాలిన్ అధికారంలోకి వస్తే ఉచితంగా సెటాప్ బాక్స్‌లను పంచుతారని హామీ ఇచ్చారు. -
రిలయన్స్ బిగ్ టీవీ సరికొత్త ఆఫర్
న్యూఢిల్లీ : అనిల్ అంబానీకి చెందిన డీటీహెచ్ సర్వీసు ప్రొవైడర్ రిలయన్స్ బిగ్ టీవీ సరికొత్త ఆఫర్‌తో యూజర్ల ముందుకు వచ్చింది. తొలుత 500 రూపాయల చెల్లించి తమ కొత్త హెచ్డీ హెచ్ఈవీసీ సెటాప్ బాక్స్‌లను ఉచితంగా పోస్టు ఆఫీసుల వద్ద పొందవచ్చని ప్రకటించింది. అనంతరం ఆ మొత్తాన్ని కంపెనీ రీఫండ్ చేయనున్నట్టు తెలిపింది. 50 వేల పోస్టు ఆఫీసులతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని ఈ సర్వీసులను అందజేస్తున్నామని రిలయన్స్ బిగ్ టీవీ ఓ ప్రకటనలో తెలిపింది. రాజస్తాన్, పంజాబ్, ఉత్తరఖాండ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం ప్రాంతాల పోస్టు ఆఫీసుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ఆఫర్ కింద ఏడాది పాటు ఉచితంగా ఛానల్స్‌ను ఆఫర్ చేయనుంది. దీనిలో హెచ్డీ ఛానల్స్ కూడా ఉండనున్నాయి. 500 ఎఫ్‌టీఏ(ఫ్రీ టూ ఎయిర్) ఛానల్స్‌ను ఎలాంటి ఖర్చు లేకుండా ఐదేళ్ల పాటు అందించనుంది. జూన్ 15 నుంచి ఈ సెటాప్ బాక్స్‌లను కంపెనీ డెలివరీ చేయనుంది. ముందస్తు బుక్ చేసుకున్న కస్టమర్లు జూలై 30 లోపల ఈ సెటాప్ బాక్స్‌లను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంది. పోస్టు ఆఫీసుల్లో వీటి బుకింగ్స్‌ను జూన్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ‘తాజా ఆఫర్‌తో రిలయన్స్ బిగ్ టీవీ భారత్‌లో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ స్పేస్‌లో సంచలనం సృష్టించనుంది. దీంతో ప్రతి ఒక్క గృహంలో మా హెచ్డీ హెచ్ఈవీసీ సెటాప్ బాక్స్‌లు నిలుస్తాయి. ఉచితంగా, అత్యధిక క్వాలిటీలో ఎంటర్టైన్మెంట్ను మా సెటాప్ బాక్స్‌లు ఆఫర్ చేయనున్నాయి. ఆసక్తి గల విద్యార్థులకు ఎడ్యుకేషనల్ కంటెంట్‌ను కూడా ఇవ్వనున్నాం. ఇండియన్ పోస్టు ఆఫీసుల్లో వీటిని బుక్ చేసుకోవచ్చు’ అని రిలయన్స్ బిగ్ టీవీ డైరెక్టర్ విజేంద్ర సింగ్ తెలిపారు. తాము ఆఫర్ చేసే హెచ్డీ హెచ్ఈవీసీ సెటాప్ బాక్స్‌లు షెడ్యూల్డ్ రికార్డింగ్, యూఎస్బీ పోర్ట్, హెచ్డీఎంఐ పోర్ట్, ఏకకాలంలో రికార్డు చేయడం, వీక్షించడం వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. పోస్టు ఆఫీసుల వద్ద బుక్ చేసుకునేటప్పుడు రూ.500 కట్టిన అనంతరం, వాటిని ఇంటి వద్ద డెలివరీ చేసిన తర్వాత మిగిలిన మొత్తం రూ.1500 ను చెల్లించాలి. ఆ అనంతరం ఈ మొత్తం అంతా కస్టమర్లకు రీఫండ్ అవుతుంది. లోయల్టీ బోనస్లుగా రీఛార్జ్‌ల రూపంలో తిరిగి కస్టమర్లు పొందనున్నారు. బుక్ చేసుకున్న 30 నుంచి 45 రోజుల్లో కంపెనీ వీటిని వినియోగదారులకు డెలివరీ చేయనుంది. -
సెట్‌టాప్ బాక్స్ లేని టీవీలకు ప్రసారాలు బంద్
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పూర్తిస్థాయి డిజిటల్ కేబుల్ టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. అనలాగ్ పద్ధతిలో కొనసాగుతున్న ప్రసారాలు నిలిచిపోయాయి. ఫలితంగా గత రెండు మూడు రోజుల నుంచి సెట్‌టాప్ బాక్స్ లేని టీవీలు మూగబోయాయి. డిజిటల్ ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్‌టాప్ బాక్స్ (ఎస్టీబీ) లేదా డీటీహెచ్ తప్పని సరిగా మారాయి. టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డిజిటల్ పద్ధతిలో ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్ టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. ఇందుకోసం నాలుగు విడతలుగా గడువు కూడా విధించింది. ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడంతో కేబుల్ టీవీలకు రెండు రకాల అనలాగ్, డిజిటల్ పద్ధతుల్లో ప్రసారాలకు వెసులుబాటు కల్పిస్తూ వచ్చింది. తాజాగా పూర్తిస్థాయి డిజిటలైజేషన్ ప్రక్రియ అమలులో భాగంగా మల్టీ సిస్టమ్ ఆపరేటర్ల (ఎమ్ఎస్ఓ)కు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కేబుల్ టీవీలకు అనలాగ్ ప్రసారాలు పూర్తిగా నిలిచిపోగా, కేవలం డిజిటల్ ప్రసారాలు మాత్రమే అందుతున్నాయి. పూర్తికాని డిజిటలైజేషన్... నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని కేబుల్ టీవీలకు డిజిటలైజేషన్ పూర్తి కాలేదు. ఫలితంగా సుమారు 20 శాతం కేబుల్ టీవీలు మూగబోయాయి. మొత్తం మీద 25 లక్షల టీవీ కనెక్షన్లు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్) లెక్కల ప్రకారం కేబుల్ కనెక్షన్ల సంఖ్యలో సగానికి పైగా వ్యత్యాసం కనిపిస్తోంది. అధికారికంగా 10 లక్షలు మాత్రమే నమోదై ఉన్నట్లు సమాచార ప్రసార శాఖ గణాంకలు స్పష్టం చేస్తున్నాయి. నగరంలోని మొత్తం టీవీ కనెక్షన్లల్లో 80 శాతం వరకు డీటీహెచ్ కనెక్షన్లు కలిగి ఉన్నట్లు అంచనా. కేబుల్ ప్రసారాలు అందిస్తున్న సిటీ కేబుల్,హత్వే,డిజీ కేబుల్, ఆర్వీఆర్, భాగ్యనగర్, ఇన్ డిజిటల్ తదితర సంస్ధలు తమ ఆపరేటర్ల ద్వారా సుమారు 20 లక్షల వరకు సెట్‌టాప్ బాక్స్‌లు విక్రయించినట్లు సమాచారం. దీన్ని బట్టి మరో 20 శాతం వరకు కేబుల్ టీవీలకు సెట్‌టాప్ బాక్స్‌లు లేనట్లు తెలుస్తోంది. డిజిటల్ ప్రసారాలతో అవి కాస్తా మూగబోయాయి. -
మరోసారి డెడ్‌లైన్
ఈ నెల 31 నుంచి అనలాగ్ ప్రసారాలు బంద్ డిజిటలైజేషన్ చేయాలంటూ ఆదేశాలు 30శాతం మించని సెట్‌టాప్ బాక్సులు ఈసారి ఉపేక్షించబోమన్న ప్రభుత్వం సాక్షి, హన్మకొండ: కేబుల్ టీవీ అనలాగ్ ప్రసారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. కేబుల్ ప్రసారాలను అనలాగ్ పద్ధతి నుంచి డిజిటల్లోకి మర్చాలంటూ ప్రభుత్వం ఇంతకుముందు ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు తగ్గట్లు ప్రజల్లో అవగాహన కల్పించడం, మాస్టర్ సిస్టమ్ ఆపరేటర్లను (ఎంఎస్ఓ) సిద్ధం చేయకపోవడంతో ఈ ప్రక్రియ వేగం పుంజుకోవడం లేదు. తాజాగా ఈ నెల 31లోగా కేబుల్ టీవీ ప్రసారాలన్నీ డిజిటలైజ్ చేస్తూ సెట్‌టాప్ బాక్సులు అమర్చుకోవాలంటూ జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ముఫై శాతమే కేబుల్ టీవీ డిజిటలైజేషన్ పరిధిలోకి ప్రస్తుతం వరంగల్ జిల్లాలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, నర్సంపేట, పరకాల, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి పట్టణాలు వస్తున్నాయి. వీటి పరిధిలో 1.62 లక్షల కేబుల్ టీవీ కనక్షన్లు ఉన్నాయి. గత ఆర్నెళ్ల కాలంగా సెట్ టాప్ బాక్సులను అమర్చే ప్రక్రియ కొనసాగుతోంది. గడువు పొడిగించినా సెట్ టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రజల నుంచి ఆశించిన స్పందన లేదు. దీంతో ఇప్పటి వరకు కేవలం 30 శాతం కనెక్షన్లలకు సెట్ టాప్ బాక్సులు అమర్చి డిజిటలైజ్ చేశారు. రాబోయే ఏడు రోజుల వ్యవధిలో దాదాపు లక్ష కేబుల్ కనెక్షన్లకు సెట్‌టాప్ బాక్సులు అమర్చడం ఇబ్బందికరమైన వ్యవహరంగా మారనుంది. మూగనోమే.. కేబుల్ టీవీ డిజిటలైజేషన్‌కు ఈ నెల 31 ఆఖరి గడువును కచ్చితంగా అమలు చేస్తామని జిల్లా యంత్రాంగం చెబుతుంది. దీని వల్ల ప్రస్తుతం ఉన్న అనలాగ్ కేబుల్ టీవీ ప్రసారాలు పూర్తిగా ఆగిపోతాయి. 31వ తేదీ అర్థరాత్రి నుంచి కేబుల్ ప్రసారాలు నిలిచిపోతే, వినియోగదారులకు ఇక్కట్లు తప్పేలా లేవు. కేబుల ప్రసారాలు ఆగిపోయిన పక్షంలో సెట్ టాప్ బాక్సులకు గిరాకీ పెరిగిపోతుంది. అయితే డిమాండ్‌కు తగ్గ రీతిలో ఎంఎస్ఓల దగ్గర సెట్‌టాప్ బాక్సులు లేవు. ఏడునెలలుగా.. కేబుల్ టీవీ ప్రసారాలను క్రమబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం అమలవుతున్న అనలాగ్ కేబుల్ టీవీ వ్యవస్థను డిజిటలైజ్ చేయాలని కేంద్ర ప్రసార, సమాచార శాఖ నిర్ణయించింది. ఈ మేరకు గత ఐదేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కేబుల్ టీవీ ప్రసారాలను డిజిటలైజ్ చేయాలంటూ అన్ని టీవీ ఛానల్స్ యాజమన్యాలకు కేంద్రం చివరి హెచ్చరికను 2015 డిసెంబరు 22న జారీ చేసింది. 2015 డిసెంబరు 31లోగా డిజిటలైజ్ చేయాలని హెచ్చరించింది. దీంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఉన్న కేబుల్ టీవీ అనలాగ్ ప్రసారాల్ని ఒకేసారి డిజిటిలైజ్ చేయాల్సి వచ్చింది. దీంతో సెట్‌టాప్ బాక్సులకు అనూహ్యంగా డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్‌కు తగ్గ బాక్సులు లేని ఫలితంగా నిర్దేశించిన గడువులోగా కేబుల్ వ్యవస్థను డిజిటలైజ్ చేయడం సాధ్యం కాలేదు. దీంతో కేంద్రం మరో ఆర్నెళ్ల గడువు పొడిగించింది. ప్రస్తుతం ఈ గడువు ముగిసింది. పట్టణం కేబుల్ టీవీ కనెక్షన్లు జనగామ 9,364 నర్సంపేట 5,100 భూపాలపల్లి 8,959 మహబూబాబాద్ 7,516 పరకాల 3,093 గ్రేటర్ వరంగల్ 1,27,968 –––––––––––––––––––––– -
నిరుపయోగంగా 3 కోట్ల డీటీహెచ్ ఎస్టీబీలు
* వీటి విలువ 750 మిలియన్ డాలర్లు * ముందస్తు సంప్రదింపుల పత్రంలో పేర్కొన్న ట్రాయ్ న్యూఢిల్లీ: దేశంలో దాదాపు 3 కోట్ల డీటీహెచ్ (డెరైక్ట్ టు హోమ్) సెట్ టాప్ బాక్స్‌లు (ఎస్టీబీ) నిరుపయోగంగా ఉన్నాయని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తెలిపింది. వీటి విలువ 750 మిలియన్ డాలర్లమేర ఉండొచ్చని అభిప్రాయపడింది. ‘ఒక ఆపరేటరుకు సంబంధించిన ఎస్టీబీతో వినియోగదారులు ఇతర ఆపరేటరు సిగ్నల్స్‌ను స్వీకరించడం సాధ్యపడదు. దీంతో వినియోగదారులు తమ ఆపరేటర్‌ను మార్చుకోవాలనుకుంటే అప్పుడు కొత్తగా మరొక ఎస్టీబీని కొనుగోలు చేయాల్సి వస్తోంది. అందుకే వీటి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే వాటిపై ఇన్వెస్ట్ చేసిన డబ్బు వృథా అవుతోంది. మరొకవైపు ఈ-వ్యర్థాలు కూడా పెరిగిపోతున్నాయి’ అని ట్రాయ్ తన ముందస్తు సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. డీటీహెచ్ ఆపరేటర్లు గతేడాది డిసెంబర్లో ట్రాయ్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం.. అవి 8.5 కోట్ల ఎస్టీబీలు సబ్‌స్క్రైబర్‌కు అందించాయి. ఇందులో 5.5 కోట్లు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. అంటే 3 కోట్ల ఎస్టీబీలు నిరుపయోగంగా ఉన్నట్లు లెక్క. ఒక్కొక్క ఎస్టీబీకి 25 డాలర్లు వేసుకున్నా మొత్తం ఎస్‌టీబీల విలువ 750 మిలియన్ డాలర్లు ఉంటుందని ట్రాయ్ తెలిపింది.