నిరుపయోగంగా 3 కోట్ల డీటీహెచ్ ఎస్‌టీబీలు | Unused DTH Set Top Boxes could be worth $750 million: TRAI | Sakshi
Sakshi News home page

నిరుపయోగంగా 3 కోట్ల డీటీహెచ్ ఎస్‌టీబీలు

Published Mon, Apr 11 2016 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

నిరుపయోగంగా 3 కోట్ల డీటీహెచ్ ఎస్‌టీబీలు

* వీటి విలువ 750 మిలియన్ డాలర్లు
* ముందస్తు సంప్రదింపుల పత్రంలో పేర్కొన్న ట్రాయ్

న్యూఢిల్లీ: దేశంలో దాదాపు 3 కోట్ల డీటీహెచ్ (డెరైక్ట్ టు హోమ్) సెట్ టాప్ బాక్స్‌లు (ఎస్‌టీబీ) నిరుపయోగంగా ఉన్నాయని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తెలిపింది. వీటి విలువ 750 మిలియన్ డాలర్లమేర ఉండొచ్చని అభిప్రాయపడింది. ‘ఒక ఆపరేటరుకు సంబంధించిన ఎస్‌టీబీతో వినియోగదారులు ఇతర ఆపరేటరు సిగ్నల్స్‌ను స్వీకరించడం సాధ్యపడదు.

దీంతో వినియోగదారులు తమ ఆపరేటర్‌ను మార్చుకోవాలనుకుంటే అప్పుడు కొత్తగా మరొక ఎస్‌టీబీని కొనుగోలు చేయాల్సి వస్తోంది. అందుకే వీటి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే వాటిపై ఇన్వెస్ట్ చేసిన డబ్బు వృథా అవుతోంది. మరొకవైపు ఈ-వ్యర్థాలు కూడా పెరిగిపోతున్నాయి’ అని ట్రాయ్ తన ముందస్తు సంప్రదింపుల పత్రంలో పేర్కొంది.

డీటీహెచ్ ఆపరేటర్లు గతేడాది డిసెంబర్‌లో ట్రాయ్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం.. అవి 8.5 కోట్ల ఎస్‌టీబీలు సబ్‌స్క్రైబర్‌కు అందించాయి. ఇందులో 5.5 కోట్లు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. అంటే 3 కోట్ల ఎస్‌టీబీలు నిరుపయోగంగా ఉన్నట్లు లెక్క. ఒక్కొక్క ఎస్‌టీబీకి 25 డాలర్లు వేసుకున్నా మొత్తం ఎస్‌టీబీల విలువ 750 మిలియన్ డాలర్లు ఉంటుందని ట్రాయ్ తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement