DTH
-
ఎయిర్టెల్, జియో పరస్పరం విరుద్ధ వాదనలు
డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) ఆపరేటర్ల లైసెన్స్ ఫీజు రద్దు అంశంపై టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, భారతీ ఎయిర్టెల్ మరోసారి విభేదించాయి. డీటీహెచ్ ఆపరేటర్లను ఇతర టీవీ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్‌లతో సమానంగా పరిగణించాలని, లైసెన్స్ ఫీజును పూర్తిగా ఎత్తివేయాలని ఎయిర్టెల్ పట్టుబడుతోంది. మరోవైపు, లైసెన్స్ ఫీజు రద్దు చేస్తే కేబుల్ టీవీ, ఐపీటీవీ(ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) ప్రొవైడర్లకు నష్టం జరుగుతుందని రిలయన్స్ జియో వాదిస్తోంది.‘టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 పరిధిలో బ్రాడ్‌కాస్టింగ్ సేవల ప్రొవిజన్ కోసం సర్వీస్ ఆథరైజేషన్స్ ఫ్రేమ్‌వర్క్’ అనే అంశంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల టెలికాం సంస్థలతో సంప్రదింపులు జరిపింది. అందులో ఎయిర్టెల్, జియో వంటి దిగ్గజ కంపెనీలు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపాయి. డీటీహెచ్ లైసెన్స్ ఫీజును పూర్తిగా తొలగించాలని ఎయిర్టెల్ కోరింది. ప్రస్తుతం కంటెంట్ ఆదాయంపై విధిస్తున్న లైసెన్స్ ఫీజు, డీటీహెచ్ ఆపరేటర్లు చెల్లించే లైసెన్స్ ఫీజును బ్రాడ్కాస్టర్లు భరించాలని, అంతిమంగా అలాంటి ఆదాయంతో ప్రయోజనం పొందవచ్చని ఎయిర్టెల్ సూచించింది. గతంలో ట్రాయ్ చేసిన సిఫార్సులను వీలైనంత త్వరగా అమలు చేయాలని, మార్కెట్లో బ్రాడ్కాస్టర్లు 20% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండకుండా నిరోధించేలా క్రాస్ మీడియా ఆంక్షలను తొలగించాలని టాటా ప్లే ట్రాయ్‌ను కోరింది.టెలికాం రంగానికి కేబినెట్ నిర్దేశించిన స్థూల ఆదాయం (జీఆర్), సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వంటి వాటిని డీటీహెచ్ లైసెన్సులకు కూడా వర్తింపజేయాలని ఎయిర్టెల్ సూచించింది. ఎయిర్ ప్రతిపాదించిన ఫీజు రద్దు అంశాన్ని జియో వ్యతిరేకించింది. ఉచిత స్పెక్ట్రమ్ కేటాయింపులు అందిస్తే డీటీహెచ్ సంస్థలు ప్రయోజనం పొందుతాయి కానీ, ఇది జాతీయ ఖజానాకు నష్టం కలిగిస్తుందని తెలిపింది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) ప్రొవైడర్లు తీవ్రంగా నష్టపోతారని వాదిస్తోంది. ఉచిత స్పెక్ట్రమ్ వల్ల డీటీహెచ్ సంస్థలు పొందే ప్రత్యేక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇతర ప్లాట్‌ఫామ్‌లతో పోల్చి లైసెన్స్ ఫీజును మాఫీ చేయడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని జియో ఇన్ఫోకామ్ పేర్కొంది.ఇదీ చదవండి: వేగంగా బ్యాంకు మోసాల దర్యాప్తునకు చర్యలుడీటీహెచ్ లైసెన్స్ ఫీజును ప్రస్తుతమున్న 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని 2023 ఆగస్టులో ట్రాయ్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఈ సిఫార్సు వల్ల డీటీహెచ్, కేబుల్ టీవీ, ఐపీటీవీ ప్లాట్‌ఫామ్‌ల మధ్య సమాన వాటాను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
ఎయిర్టెల్ భారీ వ్యూహం.. టాటాగ్రూప్ కంపెనీపై కన్ను!
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన డిజిటల్ టెలివిజన్ విభాగాన్ని విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్) సర్వీస్ ప్రొవైడర్ టాటా ప్లే (గతంలో టాటాస్కై)ని కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఎయిర్టెల్ ప్రస్తుతం టాటా గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది.ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ఎఫ్‌టీఏ సేవల ఆవిర్భావం కారణంగా వృద్ధి సమస్యలను ఎదుర్కొంటున్న డిజిటల్ టెలివిజన్ మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని ఎయిర్టెల్ భావిస్తోంది. ఇందులో భాగంగా టాటాప్లేని కొనుగోలు చేయడానికి ఎయిర్టెల్ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. 2017లో టాటా కన్స్యూమర్ మొబిలిటీ వ్యాపారాన్ని భారతీ ఎయిర్టెల్ కొనుగోలు చేసిన తర్వాత రెండు కంపెనీల మధ్య ఇది రెండో ఒప్పందం కానుంది. ఈ ఒప్పదం కుదిరి టాటా ప్లేను ఎయిర్టెల్ కొనుగోలు చేస్తే టాటా తన కంటెంట్, ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాల పూర్తిగా వైదొలుగుతుంది.టాటా ప్లే ప్రస్తుతం డీటీహెచ్ విభాగంలో 20.77 మిలియన్ల సబ్స్క్రైబర్లు, 32.7 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉంది. కానీ ఆర్థిక పరంగా నష్టాల్లో నడుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకీకృత నికర నష్టం రూ.353.8 కోట్లుగా ఉంది. టాటా ప్లే కొనుగోలుతో ఎయిర్టెల్ కస్టమర్ బేస్ పెరుగుతుందని, అదే సమయంలో జియో అందిస్తున్న ఆఫర్లతో పోటీపడే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. -
ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో కొత్త సర్వీసులు
భారతీయ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తన డిజిటల్ చెల్లింపు సర్వీసులను విస్తరించేందుకు బిల్‌డెస్క్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని పేర్కొంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్‌లు, ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ పోస్ట్‌పెయిడ్ బిల్లు చెల్లింపులను అందిస్తున్నట్లు తెలిపింది.ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ పేమెంట్స్ అండ్ సూపర్‌కాయిన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ అరోరా మాట్లాడుతూ..‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన భారత్ బిల్ పేమెంట్స్ సిస్టమ్ (బీబీపీఎస్)తో కొత్త సేవలను ఏకీకృతం చేయడానికి బిల్‌డెస్క్‌తో కుదిదిన ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది. కంపెనీ అందిస్తున్న ఈ సేవలకు అదనంగా విద్యుత్ బిల్లు చెల్లింపులు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ద్వారా లావాదేవీలు చేసి 10 శాతం వరకు సూపర్కాయిన్లను రెడీమ్ చేసుకోవచ్చు. కస్టమర్ల కోసం డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయడానికి, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారా దేశమంతటా సుమారు 1.3 బిలియన్(130 కోట్లు) లావాదేవీలు జరుగుతాయని సమాచారం. 2026 నాటికి ఈ సంఖ్య 3 బిలియన్ల(300 కోట్లు)కు పైగా ఉంటుందని అంచనా. -
వినోదం కోసం..ఫైబర్‌కు సై!
న్యూఢిల్లీ: దేశీయంగా టీవీ వీక్షకులు వినోదం కోసం క్రమంగా డీటీహెచ్ (డైరెక్ట్ టు హోమ్) సర్వీసుల నుంచి ఫైబర్ కనెక్షన్ల వైపు మళ్లుతున్నారు. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ వేగవంతంగా ఉండటం, అనేకానేక ఓటీటీ యాప్‌లు అందుబాటులోకి రావడం, నెట్వర్క్ స్థిరంగా ఉండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి. దీంతో లక్షల మంది కస్టమర్లు డీటీహెచ్‌ను వదిలేసి ఫైబర్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత త్రైమాసికంలో డీటీహెచ్ కస్టమర్ల సంఖ్య ఏకంగా 13.20 లక్షలు తగ్గడం ఇందుకు నిదర్శనం. ఫైబర్ కనెక్షన్లకు ఆదరణ పెరుగుతుండటమనేది వినోదం విషయంలో ప్రజల అలవాట్లు మారుతుండటాన్ని సూచిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాతావరణంలో మార్పులు, సాంకేతిక లోపాల కారణంగా పదే పదే అంతరాయాలు వస్తుంటాయని డీటీహెచ్ సర్విసులపై విమర్శలు ఉన్నాయి. అదే ఫైబర్ కనెక్షన్లయితే పటిష్టమైన, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా ఉంటాయని ధీమా ఉంటోంది. గ్యారంటీగా నిరంతరాయ సర్వీసుతో పాటు పనితీరు కూడా అత్యుత్తమంగా ఉండటంతో ఇవి మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయి. యువత దన్ను.. జియో సినిమా, జియోటీవీ వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లు ప్రజల ధోరణులు మారడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫైబర్ కనెక్షన్ల ద్వారా అందుబాటులో ఉండే ఈ ప్లాట్‌ఫామ్‌లు.. భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా లైవ్ స్పోర్ట్స్, లేటెస్ట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు లాంటి బోలెడంత కంటెంట్‌ను హై డెఫినిషన్ నాణ్యతతో అందిస్తున్నాయి. ఇంటర్నెట్ ద్వారా నిరంతరాయంగా వినోద సర్విసులు అందుబాటులో ఉండటమనేది ఆకర్షణీయంగా ఉండటంతో యువత ఎక్కువగా ఫైబర్ కనెక్షన్ల వైపు మొగ్గు చూపుతోంది. గణాంకాల ప్రకారం ఇప్పటికే 2.23 కోట్ల మంది యూజర్లు ఫైబర్వైపు మారారు. సాంప్రదాయ డీటీహెచ్ సేవలతో పోలిస్తే ఇంటర్నెట్ ఆధారిత ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని విశ్లేషకులు తెలిపారు. అదే సమయంలో డీటీహెచ్ సర్విసులకు డిమాండ్ తగ్గుతుండటాన్ని కూడా సూచిస్తోందని పేర్కొన్నారు. -
ఇంటికే ‘ఈ–పాఠం’
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఇప్పటికే అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరిన్ని చర్యలకు శ్రీకారం చుడుతోంది. విద్యార్థి ఎక్కడున్నా నేర్చుకునేలా పాఠాలను అందిస్తోంది. పాఠ్యాంశాలు విద్యార్థికి మరింత అర్థమయ్యేలా, వివిధ మాధ్యమాల ద్వారా నేర్చుకునేలా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఏపీ ఎస్సీఈఆర్టీ) వీడియో కంటెంట్‌ను రూపొందించింది. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులతో మూడు నుంచి 9వ తరగతి వరకు అన్ని పాఠ్యాంశాలను సిద్ధం చేసింది.ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల (ఐఎఫ్‌పీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందిస్తోంది. మరోవైపు అవే పాఠాలను ట్యాబ్‌ల ద్వారా ఇంటి వద్ద కూడా నేర్చుకునేలా బైజూస్ కంటెంట్‌ను అప్లోడ్ చేసి అందించింది. వీటితోపాటు ఆయా తరగతుల అన్ని పాఠ్యాంశాలకు నిపుణులైన ఉపాధ్యాయులతో 366 వీడియోలను రూపొందించిన ఎస్సీఈఆర్టీ వాటిని యూట్యూబ్ (ఆంధ్రప్రదేశ్ ఈ–పాఠశాల చానల్)లోనూ అప్లోడ్ చేసింది.వీటిని మొబైల్ ఫోన్లోనూ చూసే అవకాశం కల్పించింది. ఈ వీడియోలను విద్యార్థి ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడ కావాలంటే అక్కడ చూడొచ్చు. తద్వారా బడిలో ఉపాధ్యాయులు బోధించినప్పుడు విస్మరించిన, మరిచిపోయిన అంశాలను తిరిగి మననం చేసుకోవచ్చు. ఐదు డీటీహెచ్ చానళ్ల ద్వారా ప్రసారం టీవీలకు అలవాటుపడిన విద్యార్థుల్లో కూడా చదువుపై ఆసక్తి కలిగించేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలను డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) విధానంలో ప్రసారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదు ఈ–విద్య డీటీహెచ్ చానళ్లను కేటాయించింది. వీటిలో ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక చానల్ వినియోగిస్తున్నారు. మిగిలిన నాలుగు చానళ్లను ఆరు నుంచి 9వ తరగతి పాఠ్యాంశాల ప్రసారానికి కేటాయించారు. ఎస్సీఈఆర్టీ రూపొందించిన విద్యా క్యాలండర్, పాఠ్యప్రణాళిక ప్రకారం.. ఆయా నిర్మిత తేదీల్లో డీటీహెచ్ చానళ్లలో ఆ నెల పాఠ్యాంశాలను నిరంతరం ప్రసారం చేస్తారు. ఇలా 100 శాతం కంటెంట్‌తో ఈ–విద్య డీటీహెచ్ చానళ్ల ద్వారా పూర్తి స్థాయి పాఠాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ, జూనియర్ విభాగాల్లో టోఫెల్‌ను ప్రవేశపెట్టడంతో ఆయా పాఠాల బోధనకు మరో మూడు డీటీహెచ్ చానళ్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. మొబైల్ యాప్ సైతం.. ఆన్లైన్లో కూడా విద్యార్థులు పాఠాలు చదువుకునేందుకు, ఉపాధ్యాయులు చెప్పినవి వినేందుకు అనువుగా ‘ఈ–పాఠశాల’ మొబైల్ యాప్‌ను సైతం అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఐఎఫ్‌పీ, ట్యాబ్, డీటీహెచ్, యూట్యూబ్, మొబైల్ యాప్.. ఇలా అన్ని మాధ్యమాల్లోనూ ఒకే తరహా కంటెంట్, బోధన ఉండేలా వీడియోలను రూపొందించారు. దీంతో విద్యార్థి ఎలాంటి గందరగోళం లేకుండా తన తరగతి పాఠాలను ఈ ఐదు మాధ్యమాల్లో సులువుగా నేర్చుకోవచ్చు. అన్ని కేబుల్ నెట్‌వర్క్‌ల్లోనూ ప్రసారం బడిలో ఉపాధ్యాయులు బోధించే అన్ని పాఠాలను ఈ–కంటెంట్ రూపంలోకి మార్చాం. నిష్ణాతులైన సబ్జెక్టు ఉపాధ్యాయులతో సిలబస్ వారీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వీడియో పాఠాలు రూపొందించాం. ఈ–పాఠశాల చానళ్లను అందించేందుకు ప్రైవేటు టీవీ నెట్వర్క్ ప్రొవైడర్లు కూడా అంగీకరించారు. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రసారమవుతున్నాయి. త్వరలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంట్లో టీవీ ద్వారా విద్యార్థులు పాఠాలు వినొచ్చు. అలాగే యూట్యూబ్‌లో కూడా ఎప్పుడైనా వీటిని చూడొచ్చు. – కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతులు 3 నుంచి 9 తరగతి వరకు వీడియో కంటెంట్ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టుల్లోని కంటెంట్‌ను ఇప్పటికే బైజూస్ రూపొందించి విద్యాశాఖకు అందించింది. వీటిని యధావిధిగా విద్యార్థులకు ఐఎఫ్‌పీల ద్వారా బోధించడంతోపాటు ట్యాబ్‌ల్లోనూ అప్లోడ్ చేశారు. అయితే, ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు లాంగ్వేజెస్‌తోపాటు కొన్ని సబ్జెక్టుల వీడియో పాఠాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. ఇందులో ప్రధానంగా మూడో తరగతి విద్యార్థులకు.. తెలుగు, ఇంగ్లిష్ , మ్యాథ్స్, ఈవీఎస్, నాలుగు, ఐదు తరగతులకు.. తెలుగు, ఇంగ్లిష్ , ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు.. తెలుగు, ఇంగ్లిష్ , హిందీ సబ్జెక్టుల్లో వీడియో పాఠాలను అందుబాటులోకి తెచ్చింది. యూట్యూబ్‌లో పాఠాలు అందరికీ అందుబాటులో ఉండగా.. ప్రైవేటు నెట్వర్క్ ప్రొవైడర్లు చాలా ప్రాంతాల్లో డీటీహెచ్ చానళ్లను అందించడం లేదు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన డీటీహెచ్ చానళ్లను అన్ని ప్రైవేటు కేబుల్ నెట్వర్క్ సంస్థలు కూడా అందించేలా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను రూపొందించనుంది. -
డీటీహెచ్ సంస్థలకు ఇకపై 20 ఏళ్ల లైసెన్స్
న్యూఢిల్లీ: డీటీహెచ్ (ఇళ్లకు నేరుగా ప్రసారాలు అందించే) సేవలు దేశంలో మరింత బలపడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. డీటీహెచ్ సంస్థలకు 20 ఏళ్ల కాలానికి లైసెన్స్ మంజూరు చేసేందుకు వీలుగా నిబంధనల సవరణకు.. అదేవిధంగా డీటీహెచ్ బ్రాడ్‌కాస్టింగ్ సేవల రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆరు కోట్ల ఇళ్లకు డీటీహెచ్ ‘‘భారత్‌లో ఆరు కోట్లకు పైగా ఇళ్లకు డీటీహెచ్ సేవలు అందుతున్నాయి. ఈ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతించాలని వాణిజ్య శాఖ లోగడ నిర్ణయించింది. అయితే, సమాచార, ప్రసార శాఖ నిబంధనల కారణంగా ఈ ప్రయోజనం డీటీహెచ్ రంగానికి ఇంతకాలం లభించలేదు. నూతన నిబంధనలు వాణిజ్య శాఖ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇప్పటివరకు సమాచార, ప్రసార శాఖ నిబంధనల కింద 49 శాతం ఎఫ్‌డీఐకే అనుమతి ఉంది’’ అని మంత్రి మీడియాకు వివరించారు. డీటీహెచ్ సంస్థలకు 20 ఏళ్ల కాలానికి లైసెన్స్ మంజూరు చేస్తామని, తర్వాత నుంచి ప్రతీ పదేళ్ల కాలానికి పునరుద్ధరించుకోవచ్చని వివరించారు. లైసెన్స్ ఫీజును ప్రస్తుతం ఏడాదికోసారి వసూలు చేస్తుండగా, ఇక మీదట త్రైమాసికానికి ఓసారి వసూలు చేస్తామన్నారు. ‘ఎఫ్‌డీఐ నిబంధనల సవరణతో ఈ రంగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఫలితంగా నూతన పెట్టుబడులు రావడంతోపాటు, నూతన ఉపాధి అవకాశాలూ ఏర్పడతాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. 8 శాతానికి తగ్గింపు నూతన నిబంధనల కింద లైసెన్స్ ఫీజును స్థూల ఆదాయంలో 10 శాతం కాకుండా.. సవరించిన స్థూల ఆదాయం (జీఎస్టీని మినహాయించిన తర్వాత)లో 8 శాతంగా మార్పు చేయనున్నారు. దీంతో టెలికం శాఖ మాదిరే లైసెన్స్ ఫీజు అమలు కానుంది. ఇలా ఆదా అయిన నిధులను సేవల విస్తరణకు వెచ్చించడం ద్వారా ఈ రంగం మరింత వృద్ధిని సాధించొచ్చన్నది సమాచార, ప్రసార శాఖ అంచనా. ‘‘డీటీహెచ్ ఆపరేటర్లు స్వచ్ఛందంగా డీటీహెచ్ వేదికలను, టీవీ చానళ్ల ట్రాన్స్పోర్ట్ స్ట్రీమ్‌లను పంచుకోవచ్చు. అదే విధంగా టీవీ చానళ్ల పంపిణీదారులు సైతం తమ సబ్‌స్క్రైబర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎస్ఎమ్ఎస్), కండీషనల్ యాక్సెస్ సిస్టమ్ (సీఏఎస్) అప్లికేషన్ల కోసం ఉమ్మడి హార్డ్‌వేర్‌ను పంచుకోవడానికి అనుమతిస్తాము. సదుపాయాలు పంచుకోవడం వల్ల శాటిలైట్ వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు’’ అని సమాచార శాఖ ప్రకటన తెలియజేసింది. సంతోషం.. ఫీజులు కూడా తగ్గించాలి ‘‘మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు మా కృతజ్ఞతలు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న లైసెన్స్ పాలసీని పరిష్కరించారు. ఇది అనిశ్చితిని తొలగిస్తుంది’’ అని టాటా స్కై ఎండీ, సీఈవో హరీత్ నాగ్‌పాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, కేబుల్ టీవీ మాదిరే ఒకే విధమైన ఫీజు వసూలు చేయాలని, అప్పుడు తాము మరింత పోటీపడగలమన్నారు. ‘‘కేబుల్ టీవీ మాదిరే ఒకే విధమైన ఫీజును నిర్ణయించడం ద్వారా మాకూ సమాన అవకాశం కల్పించాలి. కేబుల్ టీవీ కూడా సమాచార, ప్రసార శాఖ లైసెన్స్ పరిధిలోనే, ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ధరలు, మార్జిన్లను పాటిస్తోంది’’ అని నాగ్‌పాల్ చెప్పారు. ట్రాయ్ గణాంకాల ప్రకారం మార్చి చివరికి డీటీహెచ్ పరిశ్రమకు 7.24 కోట్ల మంది చెల్లింపుల చందాదారులు ఉన్నారు. -
త్వరలోనే డీటీహెచ్, కేబుల్ పోర్టబిలిటీ
న్యూఢిల్లీ: టీవీ వీక్షకులకు త్వరలోనే పోర్టబిలిటీ అవకాశం అందుబాటులోకి రానుంది. సెట్ టాప్ బాక్స్ మార్చే పని లేకుండానే డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్లను మార్చుకోవడం సాకారం కానుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది సాధ్యమవుతుందని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. ‘‘గత రెండేళ్లుగా సెట్ టాప్ బాక్స్(ఎస్టీబీలు)ల మధ్య ఇంటర్ ఆపరేబిలిటీని (అంతర్లీనంగా పనిచేయగలగడం) సాధ్యం చేసేందుకు కృషి చేస్తున్నాం. అవరోధాల్లో చాలా వరకు పరిష్కారం అయ్యాయి. కొన్ని వ్యాపారపరమైన సవాళ్లు మాత్రం ఉన్నాయి. వీటిని పరిశీలిస్తున్నాం. ఈ ఏడాది చివరికి సాధ్యమవుతుంది’’ అని శర్మ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఇంటర్ ఆపరేబిలిటీ ఆలోచన వచ్చిన వెంటనే సాధ్యం కాదని, ఇందుకు తొలుత ప్రణాళికను ప్రవేశపెట్టాల్సి ఉంటుందన్నారు. దేశీయ మొబైల్ ఫోన్ పరిశ్రమ విజయవంతం కావడానికి ఇంటర్ ఆపరేబిలిటీ కీలకమైన అంశంగా పేర్కొన్నారు. దేశంలో పరికరాలకు సంబంధించిన ఎకో సిస్టమ్‌పై అధ్యయనాన్ని శర్మ ఈ సందర్భంగా విడుదల చేశారు. -
త్వరలోనే డీటీహెచ్, కేబుల్ పోర్టబిలిటీ
న్యూఢిల్లీ: టీవీ వీక్షకులకు త్వరలోనే పోర్టబిలిటీ అవకాశం అందుబాటులోకి రానుంది. సెట్ టాప్ బాక్స్ మార్చే పని లేకుండానే డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్లను మార్చుకోవడం సాకారం కానుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది సాధ్యమవుతుందని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. ‘‘గత రెండేళ్లుగా సెట్ టాప్ బాక్స్(ఎస్టీబీలు)ల మధ్య ఇంటర్ ఆపరేబిలిటీని (అంతర్లీనంగా పనిచేయగలగడం) సాధ్యం చేసేందుకు కృషి చేస్తున్నాం. అవరోధాల్లో చాలా వరకు పరిష్కారం అయ్యాయి. కొన్ని వ్యాపారపరమైన సవాళ్లు మాత్రం ఉన్నాయి. వీటిని పరిశీలిస్తున్నాం. ఈ ఏడాది చివరికి సాధ్యమవుతుంది’’ అని శర్మ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఇంటర్ ఆపరేబిలిటీ ఆలోచన వచ్చిన వెంటనే సాధ్యం కాదని, ఇందుకు తొలుత ప్రణాళికను ప్రవేశపెట్టాల్సి ఉంటుందన్నారు. దేశీయ మొబైల్ ఫోన్ పరిశ్రమ విజయవంతం కావడానికి ఇంటర్ ఆపరేబిలిటీ కీలకమైన అంశంగా పేర్కొన్నారు. దేశంలో పరికరాలకు సంబంధించిన ఎకో సిస్టమ్‌పై అధ్యయనాన్ని శర్మ ఈ సందర్భంగా విడుదల చేశారు. -
వినోద భారం తగ్గేనా?
కూకట్‌పల్లిలో ఉండే శివకు కేబుల్ బిల్లు రూ.280 వచ్చింది. ‘మేం చూసేదే.. ఐదో, ఆరో చానళ్లు ఇంత ధరెందుకు? అంటే సార్ ఇది హైదరాబాద్.. ఇక్కడ అన్ని భాషలోళ్లు ఉంటరు.. మీ ఒక్కరికోసం తగ్గించలేం ’అని బదులిచ్చాడు కేబుల్ బాయ్. ఈ బాధ భరించలేక.. డీటీహెచ్ కొనుక్కున్నాడు. కానీ, అందులోనూ అదే దోపిడీ ఎంపిక చేసిన చానళ్ల పేరుతో ఖర్చు రూ.500లకు పెరిగింది.అందులోనూ తాను చూడని చానళ్లే అధికం. దీంతో దిక్కుతోచలేదు అతనికి. సాక్షి, హైదరాబాద్: కేబుల్ టీవీ, డీటీహెచ్ పేరిట ఇష్టానుసారంగా జరుగుతున్న దోపిడీకి ఇది నిదర్శనం. నిబంధనల్ని తుంగలో తొక్కి అవసరం ఉన్నా లేకున్నా.. నచ్చని చానళ్లను అంటగడుతూ.. అందినకాడికి డబ్బులు దండుకుంటున్నారు. ఇక నుంచి ఇలాంటి వినియోగదారులపై వినోద భారం తగ్గనుంది. ఫిబ్రవరి 1 నుంచి ట్రాయ్ కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. వాస్తవానికి ఇవి డిసెంబరు ఆఖరుకే అమలు కావాలి. కానీ, వివిధ వర్గాల ఆందోళనల నేపథ్యంలో అమలును ఫిబ్రవరి 1కి వాయిదా వేశారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం.. ఇష్టానుసారంగా చానళ్లకు రుసుం వసూళ్లు చేస్తామంటే కుదరదు. ఇష్టం లేని, చూడని చానళ్లకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువ వసూలు చేస్తున్నారు వాస్తవానికి ట్రాయ్ నిబంధనల ప్రకారం.. కనిష్టంగా రూ.100 నుంచి గరిష్టంగా రూ.153 వసూలు చేయాలి. కానీ.. ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ఎవరికి వారు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. తాము చూడని చానళ్లకు కూడా వారు డబ్బు చెల్లిస్తున్నారు. తెలంగాణలో దాదాపుగా 82 లక్షల మంది టీవీ సబ్స్క్రైబర్లున్నారు. వీరిలో 17 లక్షల మంది డీటీహెచ్ సబ్స్క్రైబర్లు. మీరు చూడని చానల్‌కు డబ్బులు చెల్లించనక్కర్లేదని ట్రాయ్చెబుతున్నా.. ఆ నిబంధనల్నికొన్ని శాటిలైట్ చానళ్లు పట్టించుకోవడం లేదు. వాస్తవానికి మదర్ చానల్ ఒకటి ఉంటుంది. దానికి అనుబంధంగా మరో డజను చానళ్ల వరకు ఉంటాయి. ఈ డజను చానళ్లలో ఏదో ఒకటే ఎంచుకుంటానంటే కుదరదు. ఏ ఒక్కటి చూడాలన్నా.. మొత్తం కొనుక్కోవాల్సిందే. వీటిపై ట్రాయ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రకటనల మాటేంటి? వివిధ చానళ్లలో యాడ్ల ద్వారా ఆయా చానళ్లకు కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. వీటిలో ఉచిత చానళ్లలో యాడ్లపై వినియోగదారులకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఎటొచ్చీ పెయిడ్ చానళ్ల విషయంలో అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు. ఇప్పటికే చానల్ చూస్తున్నందుకు డబ్బులిస్తున్నాం కదా? అలాంటప్పుడు మళ్లీ యాడ్ల గోల ఎందుకు? అని నిలదీస్తున్నారు. ట్రాయ్ కొత్త నిబంధనల నేపథ్యంలో ఒక్కో చానల్ ధరను 400% పెంచేశాయి. వీటి ద్వారానే కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నపుడు తిరిగి ప్రకటనలు ప్రసారం చేయడం ఎందుకంటున్నారు. వినియోగదారులకు హక్కులివి! 1. ఏ పే చానల్‌కు అయినా.. గరిష్ఠంగా 19 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. కొత్త నిబంధనల ప్రకారం 100 ఉచిత చానళ్లు తప్పనిసరిగా ఇవ్వాలి. అందులో 26 దూరదర్శన్ చానళ్లే ఉంటాయి. ఈ వంద చానళ్లకీ కలిపి 130 రూపాయలు, 18% జీఎస్టీ అంటే మొత్తం రూ.153.40 మాత్రమే చెల్లించాలి. 2. ఉచిత చానళ్ల ఎంపికలో పూర్తి స్వేచ్ఛ వినియోగదారుడిదే. వంద చానళ్ల కంటే ఎక్కువ ఉచిత చానళ్లను ఎంపిక చేసుకునే హక్కు కూడా వినియోగదారుడికి ఉంది. ఉదాహరణకు వందకు పైన ఇంకో 25 ఉచిత చానళ్లు కోరుకుంటే దానికి మరో 20 రూపాయలు ఎక్కువ బిల్లు కట్టాలి. 3. ప్రతీ చానల్ ధర వేర్వేరుగా ఉంటుంది. లేదంటే ఒకే గ్రూపునకు చెందిన చానళ్లు నాలుగైదింటికి కలిపి ఒక ధర ఇవ్వవచ్చు. 4. ప్రతీ ఆపరేటరూ తాను అందించే చానళ్ల లిస్టును వినియోగదారులకు వద్దకు తీసుకురావాలి. అందులో వినియోగదారులు నచ్చినవి ఎంపిక చేసుకుని, ఏది కావాలో టిక్ పెట్టి కింద సంతకం పెట్టాలి. 5. కేబుల్ యాక్టివేషన్ చార్జీలు 350 రూపాయలకు మించకూడదు. అన్నిటికీ బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలి. నెల నెలా కట్టే డబ్బులతో సహా. 6. మీకిచ్చే కార్డులో మొత్తం చానళ్ల పట్టిక, వాటి ధరలు, గ్రూపు చానళ్ల ధరలు, మీ ఎంపిక, నెలవారీ బిల్లు – మొత్తం ఉండాలి. 7. అన్ని రకాల నిబంధనలు ముద్రించిన కాగితం ఇవ్వాలి. అన్ని రకాల రేట్లు, రూల్స్ గురించి వివరించి చెప్పాలి. ఫిర్యాదు చేస్తే 8 గంటల్లో సర్వీసు సమస్య పరిష్కరించాలి. 8. ఏదైనా పే చానల్ ప్రసారాలు ఆగిపోతే ఆ డబ్బు వసూలు చేయకూడదు. కావాలంటే దాని బదులు అంతే ధర ఉన్న వేరే పే చానల్ ఇవ్వవచ్చు. 9. ఫిర్యాదులకు సంబంధించిన నంబర్లు ఇవ్వాలి, వెబ్ సైట్ ఏర్పాటు చేయాలి. చానళ్ల మార్పిడి రాతపూర్వకంగా ఉండాలి, 72 గంటల్లో జరగాలి. 10. నెల కంటే ఎక్కువ రోజులు చానల్ చూడకపోతే ఆ నెల బిల్లు కట్టక్కర్లేదు. కానీ ఆ విషయం 15 రోజుల ముందే ఆపరేటర్‌కి చెప్పాలి. కానీ రీ–కనెక్షన్‌కి 3 నెలల లోపు అయితే 25 రూపాయలు, మూడు నెలలు దాటితే 100 రూపాయలు కట్టాలి. ప్రస్తుత తెలుగు చానళ్లు ఆఫర్ చేస్తోన్న ధరలు(రూ.ల్లో): జెమినీ బొకే రూ.35.40, ఈటీవీ బొకే రూ.28.32, స్టార్ తెలుగు బొకే రూ.46.02, జీ ప్రైమ్ ప్యాక్ బొకే రూ.23.60, భవిష్యత్తులో అంతా ఆన్‌లైన్‌కే మొగ్గు! ఇప్పటికే ఆన్లైన్లో అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, జియో తదితర సంస్థలు యాడ్లు లేకుండా వినోదాన్ని అందించే ప్యాకేజీలు అందుబాటులో ఉంచాయి. ట్రాయ్ నిబంధనల ప్రకారం.. ప్రతీ ప్యాకేజీ భారంగా కనిపించే అవకాశాలున్న నేపథ్యంలో చాలామంది వీటివైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీటిలో నచ్చిన కార్యక్రమం చూసుకోవచ్చు. పైగా మొబైల్‌కు, టీవీకి, కంప్యూటర్, ట్యాబ్ ఎక్కడైనా ఎపుడైనా చూసుకోవచ్చు. పైగా వీటి సబ్స్క్రిప్షన్ ఏడాదికి రూ.1000 లోపే కావడం గమనార్హం. ట్రాయ్ నిబంధనల్లో ప్రైవేటు ప్యాకేజీల భారంగా భావించినవారంతా వీటివైపు మొగ్గుచూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఎలాగూ.. న్యూస్ చానళ్లు ఉచితంగా వస్తున్నాయి. పలు టీవీ సీరియళ్లు యూట్యూబ్ ఇతర యాప్‌లో అందుబాటులో ఉంటున్నాయి. -
కేబుల్ చందాదారును మోసగించిన ‘ట్రాయ్’
కేబుల్ టీవీ డిజిటైజేషన్ వలన చందాదారుకు ఎంతో మేలు జరు గుతుందంటూ కేబుల్ టీవీ నియం త్రణ చట్టాన్ని సవరించే సంద ర్భంలో కేంద్ర ప్రభుత్వం నమ్మబలి కింది. పారదర్శకత, ప్రసారాల నాణ్యత, కోరుకున్న చానల్స్‌కే చెల్లించే అవకాశం లాంటి మాయ మాటలు చెప్పింది. కానీ సామాన్య ప్రేక్షకులను బుట్టలో వేయటానికే ఈ అబద్ధాలు చెప్పిందన్నది ఇప్పుడు అందరికీ అర్థమవుతున్న నిజం. సగటున 15 నుంచి 20 చానల్స్ మాత్రమే చూసే ప్రేక్షకులకు వంద చానల్స్ అందుతున్న సమయంలో ఈ సంఖ్యను 500కు తీసుకుపోతా మంటూ చెప్పింది. అలా చానల్స్ పెరిగే కొద్దీ బిల్లు తడిసి మోపెడవుతుందని మాత్రం చెప్పలేదు. అనలాగ్ ప్రసారాల వలన కేబుల్ టీవీలు వంద చానల్స్ మించి ఇవ్వలేకపోతున్నాయని, అందువలన చందాదారు ఎంచుకునే స్వేచ్ఛకు భంగం కలుగుతోందని ప్రభుత్వానికి డిజిటైజేషన్ మీద చేసిన సిఫార్సులలో ట్రాయ్ చెప్పింది. డిజి టైజేషన్‌లో 500 చానల్స్ సైతం ఇవ్వగలిగే వీలుంటుందని చెప్పినా పంపిణీ సంస్థలకు మాత్రం 500 చానల్స్ ఇవ్వాలనే షరతు విధించలేదు. ఉచిత చానల్స్ ఎంచుకునే స్వేచ్ఛ చందాదారుడిదే అనేది మరో మోసం. స్వేచ్ఛ అంటున్నప్పుడు కనీసం 200 ఇవ్వ కుండా 100 ఎంచుకోమంటే దాన్ని స్వేచ్ఛ అనాలా? అలా 200 చానల్స్ ఎంతమంది ఎమ్ఎస్ఓలు ఇవ్వగలుగుతు న్నారు? పైగా ఆ 100 లోనే 26 దూరదర్శన్ చానల్స్ కచ్చి తంగా తీసుకోవాలి. మిగిలిన 74 చానల్స్ లో ఉచిత చానల్స్ తోబాటు మనం ఎంచుకునే పే చానల్స్ కూడా కలిసే ఉంటాయి. కాకపోతే పే చానల్స్‌కు అదనంగా చందా కడతాం. అంటే, ఈ 74 లో మనం కనీసం నాలుగు తెలుగు బొకేలు ఎంచుకున్నా 33 అయిపోతాయి. మిగిలేది 41. తెలు గులో ఉచిత చానల్స్ సంఖ్య దాదాపు 45. ఆ విధంగా చూస్తే మనం కోరుకునే చానల్స్ సంఖ్య 100 దాటిపోతుంది. అది దాటాక ప్రతి 25 చానల్స్ కు రూ.20 వసూలు చేస్తారు. ఇదీ ట్రాయ్ చెప్పే రూ. 130 – వంద చానల్స్ వెనుక అసలు కథ. పైగా ఇప్పుడున్న రూ.130 మరో ఆరు నెలల తరువాత పెంచుకోవటానికి పంపిణీ సంస్థలకు ట్రాయ్ అవకాశ మిచ్చింది. డిజిటైజేషన్ అనేది సెట్ టాప్ బాక్స్ తోనే సాధ్యం. ఇది టీవీ యజమాని సమకూర్చుకోవాలని ప్రచారం చేశారు. కానీ, ఆ సెట్ టాప్ బాక్స్ ఒకేసారి డబ్బు పెట్టి కొనుక్కో వాల్సిన అవసరం లేదని, అద్దెకు కూడా తీసుకోవచ్చునని, వాయిదాల పద్ధతిలో ఇమ్మని కూడా మీ ఎమ్మెస్వో/ ఆపరేటర్‌ను అడగవచ్చునని ఆ ప్రచారంలో ఎక్కడా చెప్ప లేదు. చందాదారుల ప్రయోజనం ముఖ్యమైతే ఈ వెసులు బాటు గురించి కదా ప్రచారం చేయించాల్సింది? ఎవరైనా ఆ ఎమ్ఎస్ఓ సేవలు నచ్చక ఇంకొకరి పరి ధిలోకి వెళ్ళాలంటే ఆ బాక్స్ పనికి రాదు. ఇంటర్ ఆపరేట బిలిటీ లక్షణం వాటికి లేదు. అంటే, చందాదారుడు కొను క్కున్న బాక్స్ మీద పరోక్షంగా యాజమాన్యం మాత్రం ఎమ్ ఎస్‌ఓదే. అతడి పరిధిలో మాత్రమే అది పనికొస్తుంది. ఎవ రైనా మరో ఊరికి మారితే మళ్ళీ అక్కడ సెట్ టాప్ బాక్స్ కొనుక్కోవాల్సిందే. అప్పట్లో స్వదేశీ సెట్ టాప్ బాక్సులు తగినన్ని లేక దిగుమతి చేసుకోవటం వలన ఈ ఫీచర్ లేక పోయినా తీసు కోవాల్సి వచ్చిందనేది ట్రాయ్ వివరణ. హడా వుడిగా డిజిటైజేషన్ అమలు చేసిన ఫలితమిది. డిజిటైజేషన్ వలన కేబుల్ బిల్లు తగ్గుతుందని ట్రాయ్ చెప్పటం అతిపెద్ద అబద్ధం. ఇప్పటికీ అదే అబద్ధం చెబు తోంది తప్ప వివరణ ఇవ్వటం లేదు. తగ్గటం, పెరగటం అనేది ఇప్పటి బిల్లుతోనే జనం పోల్చుకుంటారు. 200 చానల్స్ ఇచ్చే ఆపరేటర్ ప్రస్తుతం రూ. 200 వసూలు చేస్తున్నాడనుకుంటే ఇప్పుడు అవే చానల్స్‌కు బిల్లు లెక్కగడితే రూ.750కి తగ్గటం లేదు. ట్రాయ్ ఇప్పుడు చెబుతున్నదేం టంటే, ఆపరేటర్ ఇచ్చే చానల్స్ కాకుండా నిజంగా మీరు చూడాలనుకునే చానల్స్ కే లెక్కగట్టండి అంటోంది. అలా చూసినా రూ. 400 కి తగ్గేట్టు లేదు. టారిఫ్ ఆర్డర్ 36 వ పేజీ 52వ పాయింట్ ఇలా ఉంది: ‘‘ట్రాయ్ అందరి అభిప్రాయాలూ లెక్కలోకి తీసుకున్న మీదట చానల్స్‌కు పూర్తి స్వేచ్ఛ, వ్యాపారంలో వెసులుబాటు ఇవ్వటం ద్వారా అవి సొమ్ము చేసుకునే అవకాశం ఇవ్వాలని భావించింది. అందుకే పే చానల్స్ కు వాటి కంటెంట్ తరహా ఆధారంగా ధర పరిమితి విధించకూడదని నిర్ణయించింది. అయితే తన పే చానల్స్ ధర నిర్ణయించేటప్పుడు బ్రాడ్ కాస్టర్ పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తూ వివక్ష చూపకుండా, చందాదారుల ప్రయోజనాలు కాపాడతాడని ఆశిస్తున్నాం. అర్థవంతంగా ధర నిర్ణయించటం ద్వారా అధికాదాయం సంపాదించుకుంటాడని కూడా అంచనావేస్తున్నాం ’’. ఇది ట్రాయ్ చేసిన పెద్ద తప్పుడు అంచనా. బ్రాడ్‌కాస్టర్‌కు అవ కాశమిచ్చిన తరువాత తక్కువధర నిర్ణయించవచ్చునని ఆశించటమేంటి?. ప్రేక్షకులు ఆసక్తి చూపని చానల్స్‌ను కూడా అంటగట్టే బొకేల విధానాన్ని అదుపులో ఉంచటానికి ఒక నిబంధన పెట్టింది. బొకేలోని చానల్స్ విడివిడి ధరల మొత్తంలో డిస్కౌంట్ 15% మించకుండా బొకే ధర నిర్ణయించాలని చెప్పింది. ఇది కచ్చితంగా ధరలను అదుపు చేయటానికి వీలుండే అంశమే. అయితే మద్రాసు హైకోర్టు ఈ నిబం ధనను కొట్టివేసినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్న కనీస జ్ఞానం ట్రాయ్‌కి లేకపోయింది. నెలలతరబడి ఆలస్యంగా మేలుకొని వెళితే, మీరు ఇన్నాళ్ళూ నిద్రపోయారా అని సుప్రీంకోర్టు అడగ్గానే పిటిషన్ వెనక్కు తీసుకుని ‘‘బ్రాడ్ కాస్టర్లు తగ్గిస్తే తగ్గవచ్చునేమో వేచి చూద్దాం’’ అని చెప్పటం ఎంత సిగ్గు చేటు? డిజిటైజేషన్ గురించి స్పష్టత ఇవ్వకుండా, సెట్ టాప్ బాక్స్ కొనకపోతే ప్రసారాలు ఆగిపోతాయని భయపెట్టటాన్నే అవగాహనగా చెప్పుకుంది. ఇప్పుడు కూడా ‘‘మేం అవకాశ మిచ్చినట్టుగా చానల్స్ నిర్ణయించుకున్న ధరలకు మీరు ఆమోదముద్ర వెయ్యకపోతే ఫిబ్రవరి 1 తరువాత మీకు టీవీ ప్రసారాలు ఆగిపోతాయి’’ అనే ప్రచారం మొదలైంది. నియంత్రణా సంస్థ అయిన ట్రాయ్‌కి చాలా విషయాల్లో నియంత్రణ లేదు. కేబుల్ నెట్‌వర్క్స్‌ను ఎమ్ఎస్ఓలు అమ్ము కుంటున్నప్పుడు వాటి పరిధిలో ఉన్న ఆపరేటర్లు, చందా దారుల ప్రయోజనాల సంగతేంటని పట్టించుకోదు. ఈ మధ్య కాలంలో రిలయెన్స్ జియో లాంటి సంస్థలు పెద్ద ఎత్తున కార్పొరేట్ ఎమ్ఎస్ఓలను సైతం కొంటూ ఉంటే ఎలాంటి సమాచారమూ లేకుండానే స్థానిక కేబుల్ ఆపరేటర్లు, చందా దారులు గొర్రెల్లా కొత్త యజమాని అధీనంలోకి వెళ్ళిపోతు న్నారు. ఇది కచ్చితంగా గుత్తాధిపత్యానికి దారి తీసి చందా దారుల మీద పెనుభారం మోపే ప్రమాదం ఉంది. అయినా ట్రాయ్ జోక్యం చేసుకోవటానికి ఇష్టపడటం లేదు. చందా దారుల ప్రయోజనాలు గాని, కేబుల్ ఆపరేటర్ల ప్రయోజ నాలుగాని కాపాడలేని నియంత్రణా సంస్థ ఎవరికి మేలు చేస్తు న్నదో ఆత్మ విమర్శ చేసుకోవాలి. వ్యాసకర్త: తోట భావనారాయణ సీనియర్ పాత్రికేయుడు మొబైల్ : 99599 40194 -
వార్బర్గ్ చేతికి ఎయిర్టెల్ డీటీహెచ్‌లో 20 శాతం వాటా
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ డీటీహెచ్(డైరెక్ట్ టు హోమ్) విభాగంలో 20% వాటాను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, వార్బర్గ్ పిన్కస్ కొనుగోలు చేయనుంది. డీటీహెచ్ విభాగమైన భారతీ టెలీమీడియాలో 20% వాటాను వార్బర్గ్ అనుబంధ సంస్థ కొనుగోలు చేయనున్నట్లు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. ఈ డీల్ విలువ రూ.2,310 కోట్లు(35 కోట్ల డాలర్లు) అని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ (ఇండియా, సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ చెప్పారు. వార్బర్గ్ పిన్కస్ తమ నుంచి 15% వాటాను, మరో అనుబంధ సంస్థ నుంచి 5% వాటాను కొనుగోలు చేస్తుందన్నారు. గతంలో ఇరు సంస్థల మధ్య విజయవంతమైన భాగస్వామ్యం నెలకొందని, మరొక్కసారి వార్‌బర్గ్‌తో జట్టు కట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భారత డిజిటల్ టీవీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, ఎయిర్టెల్ డీటీహెచ్ విభాగం మంచి వృద్ధిని సాధించగలదన్న అంచనాలున్నాయని వార్బర్గ్ పిన్కస్ ఇండియా ఎండీ, విశాల్ మహాదేవ చెప్పారు. -
డిష్ టీవీలో వీడియోకాన్ డీ2హెచ్ విలీనం
పూర్తిగా షేర్ల రూపంలో ఒప్పందం.. న్యూఢిల్లీ: దేశీ శాటిలైట్ కేబుల్ టీవీ ప్రసారాల(డీటీహెచ్) పరిశ్రమలో అతిపెద్ద డీల్‌కు తెరలేచింది. సుభాష్ చంద్ర సారథ్యంలోని ఎసెల్ గ్రూప్ కంపెనీ డిష్ టీవీలో వీడియోకాన్ డీ2హెచ్ విలీనం అవుతోంది. ఈ ఒప్పందానికి తమ డెరైక్టర్ల బోర్డులు ఆమోదం తెలిపినట్లు ఇరు కంపెనీలు శుక్రవారం సంయుక్తంగా ప్రకటించారుు. పూర్తిగా షేర్ల రూపంలోనే ఈ డీల్ ఉంటుందని పేర్కొన్నారుు. విలీనం తర్వాత ఏర్పడే ఉమ్మడి కంపెనీ డిష్ టీవీ వీడియోకాన్ లిమిటెడ్‌గా మారుతుంది. ఈ కొత్త కంపెనీలో వీడియోకాన్ గ్రూప్‌నకు 44.6 శాతం, ఎస్సెల్ గ్రూప్‌నకు 55.4 శాతం చొప్పున వాటాలు ఉంటారుు. దేశంలోనే అతిపెద్ద డీటీహెచ్ ఆపరేటర్‌గా ఈ కొత్త కంపెనీ ఆవిర్భవిస్తుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో విలీనం అవుతున్న రెండు కంపెనీల మొత్తం ఆదాయం రూ.5,916 కోట్లుగా ఉంది. కాగా, ఈ లావాదేవీ వచ్చే ఏడాది ద్వితీయార్థంకల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. సెబీ, కాంపిటీషన్, బాంబే హైకోర్టు, ఇతరత్రా నియంత్రణ సంస్థలు, రుణదాతల ఆమోదానికి లోబడి ఒప్పందం ఉంటుంది. కాగా, విలీనం తర్వాత ఏర్పడే ‘డిష్‌టీవీ వీడియోకాన్’ కంపెనీ ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో లిస్టింగ్ సంస్థగా కొనసాగుతుంది. అదేవిధంగా లగ్జెంబర్గ్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్(జీడీఆర్)లు లిస్టవుతారుు. ప్రస్తుతం అమెరికాలోని నాస్డాక్ ఎక్స్ఛేంజీలో వీడియోకాన్ డీ2హెచ్ లిస్టరుు(ఏడీఆర్‌లు) ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి వాటాదారులకు విలీన సంస్థకు చెందిన జీడీఆర్‌లను జారీ చేయనున్నట్లు సంయుక్త ప్రకటన పేర్కొంది. -
ఇక ‘టీవీ’గా కోచింగ్
⇒ జేఈఈ పరీక్షలకు డీటూహెచ్, ఆన్లైన్ ఆధారిత శిక్షణ సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెరుున్, జేఈఈ అడ్వాన్సడ్ పరీక్షలకు హాజరయ్యే ఇంటర్మీడియెట్ విద్యార్థులకు టీవీ ఆధారిత (డీటూహెచ్), ఆన్లైన్ శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) కసరత్తు చేస్తోంది. వచ్చే జనవరి 1వ తేదీ నుంచి ఈ శిక్షణను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు కోచింగ్ కేంద్రాల్లో శిక్షణకు విద్యార్థులు దేశవ్యాప్తంగా ఏటా రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా వారికి ప్రత్యామ్నాయ బోధన అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఐఐటీలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఐఐటీ ప్రొఫెసర్లు అసిస్టెడ్ లెర్నింగ్ (ఐఐటీ-పాల్) పథకం కింద 11, 12వ తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ సబ్జెక్టుల్లో ఈ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఢిల్లీ ఐఐటీ డెరైక్టర్ ప్రొఫెసర్ రాంగోపాల్‌రావు వెల్ల్లడించారు. ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి 200 పాఠాలు (లెక్చర్స్) రికార్డు చేసి డీ టూ హెచ్ విద్యా చానళ్ల ద్వారా ప్రసారం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన స్వయం ప్రభ ప్రత్యేక విద్యా చానళ్ల ద్వారా వీటిని ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సబ్జెక్టును ఒక్కో స్వయంప్రభ చానల్ ద్వారా నాలుగు చానళ్లలో నాలుగు సబ్జెక్టుల లెక్చర్లను ప్రసారం చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఆయా పాఠాలను విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచేందుకు ఎంహెచ్ఆర్డీ కసరత్తు చేస్తోంది. తద్వారా విద్యార్థులు ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని భావిస్తోంది. ఐఐటీ ప్రొఫెసర్లతోపాటు కేంద్రీయ విద్యాలయాల ఆధ్యాపకులతోనూ ఈ పాఠాలు రూపొందించి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఆ పాఠాలకు సంబంధించి ఏమైనా సందేహాలు తలెత్తితే విద్యార్థులు ఆన్లైన్లో ఐఐటీ ప్రొఫెసర్లను సంప్రదించి, సమాధానాలు పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. ఏడాది తర్వాత కదలిక.. ఐఐటీ రూర్కీ డెరైక్టర్ అశోక్ మిశ్రా నేతృత్వంలో గతేడాది ఏర్పడిన కమిటీ జేఈఈ కోచింగ్‌పైనా అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా ఈ కోచింగ్‌పై రూ.24 వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని మిశ్రా స్పష్టం చేశారు. గ్రామీణ విద్యార్థులను జేఈఈ శిక్షణ పేరుతో ప్రైవేటు విద్యా సంస్థలు ఆకర్షిస్తూ.. వారిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో జేఈఈ పేరుతో వ్యాపారం చేస్తున్న ప్రైవేటు కోచింగ్ కేంద్రాలను నియంత్రించాలని గతేడాదే కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అయినా కేంద్రం వాటిపై చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఇంటర్ విద్యార్థులకు జేఈఈ శిక్షణను ప్రారంభించేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ తక్కువ కాదు.. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ రాత పరీక్షకు ఏటా 13 లక్షల మంది విద్యార్థులు హాజరవుతుండగా అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే 1.50 లక్షల వరకు హాజరవుతున్నారు. జేఈఈ అడ్వాన్సడ్కు దేశవ్యాప్తంగా గత ఏడాది టాప్ 1.08 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే 25 వేల మంది వరకున్నారు. జేఈఈ మెరుున్, జేఈఈ అడ్వాన్సడ్ పరీక్షలకు ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. అందులో సగం మంది విద్యార్థులు ఇంటర్‌తోపాటు జేఈఈ కోచింగ్ తీసుకుంటుండగా, మరో 30 శాతం మంది విద్యార్థులు ప్రత్యేకంగా జేఈఈ పరీక్ష రాసేందుకే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు. వారి నుంచి శిక్షణ కేంద్రాలు రూ.65 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఇలా జేఈఈ శిక్షణపైనే రూ.1,500 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. అలాగే పాఠశాల స్థారుులో 8వ తరగతి నుంచే ఐఐటీ చదువులు, శిక్షణ పేరుతో వ్యాపారం సాగుతోంది. పేద విద్యార్థులకు ఎంతో మేలు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చే టీవీ ఆధారిత, ఆన్లైన్ ఆధారిత జేఈఈ కోచింగ్‌తో పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. జేఈఈ కోసం వేల రూపాయలు వెచ్చించడమే కాకుండా, హైదరాబాద్, ఇతర జిల్లా కేంద్రాల్లో ఉండి చదువుకునేందుకు భారీగా డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. ఆన్లైన్, టీవీ ఆధారిత శిక్షణతో పేద విద్యార్థులకు ఆర్థిక భారం తప్పుతుంది. ఐఐటీ ప్రొఫెసర్లు రూపొందించే పాఠాలు వారికి ఎంతో ఉపయోగపడతాయి. - పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు -
జీశాట్-18 ప్రయోగం సక్సెస్
►సమాచార రంగంలో విప్లవాత్మక మార్పునకు బీజం ►ఫ్రెంచ్ గయానాలోని అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి ►డీటీహెచ్, టెలికం రంగాల్లో సేవల వేగవంతం ►ఇస్రో ప్రయోగాల్లో మరింత ముందడుగు జీశాట్-18 రాకెట్: ఏరియాన్ 5 ఈసీఏ, వీఏ231 మొత్తం బరువు: 3404 కేజీలు జీవితకాలం: 15 సంవత్సరాలు వినియోగ శక్తి: 6474 వాట్ల సౌరశక్తి, 144 ఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీలు -2 త్వరలో బరువైన రాకెట్ల ప్రయోగం ఇన్నాళ్లూ తేలికైన ఉపగ్రహాలను మాత్రమే పంపిస్తున్న ఇస్రో.. జీశాట్ వంటి బరువైన ఉపగ్రహాలను పంపేందుకు 1981 నుంచి ఏరియన్‌స్పేస్ కేంద్రాన్ని వినియోగించుకుంటోంది. అయితే.. ఈ ప్రయోగాలనూ సొంతంగా చేపట్టేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో జీఎస్ఎల్వీ ఎంకే-3ని రూపొందిం చింది. దీనిపై ప్రయోగాత్మకంగా జరిపిన పరీక్షలు విజయవంతమవటంతో.. 3.4 టన్నుల బరువు కలిగిన జీశాట్-19 ఉపగ్రహాన్ని డిసెంబర్లో పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే.. ముందుగా నిర్ణయించినట్లు ఇస్రో జీశాట్-17, జీశాట్-11 ప్రయోగాలు కూడా కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచే వచ్చేఏడాది ఆరంభంలో జరగనున్నాయి. ఇవి భారత్‌కు కీలకమైన ప్రయోగాలు. శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత సమాచార సేవలను మరింత వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన ఉపగ్రహం జీశాట్-18 ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచ్ గయానాలోని (దక్షిణ అమెరికా) కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం ఈ ప్రయోగం జరిగింది. దీని ద్వారా రానున్న రోజుల్లో టీవీ, టెలికమ్యూనికేషన్స్, వీశాట్, డిజిటల్ ఉపగ్రహ వార్తా సేకరణ వంటి విషయాల్లో విప్లవాత్మక మార్పులు అందుబాటులోకి రానున్నాయి. వాతావరణం సహకరించకపోవటంతో ప్రయోగం ఒకరోజు ఆలస్యమైన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో.. యూరోపియన్ లాంచర్ ‘ఏరియన్-5 వీఏ-231’ కౌరు కేంద్రం నుంచి బయలు దేరింది. 32 నిమిషాల తర్వాత ఆస్ట్రేలియా ఆపరేటర్ ఎన్‌బీఎన్‌కు సంబంధించిన ‘స్కై మస్టర్-2’ను ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. కాసేపటికే అత్యంత శక్తివంతమైన జీశాట్-18ను కూడా కక్ష్యలోకి పంపించింది. భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశించిన ఈ జీశాట్-18 మాస్టర్ కంట్రోలింగ్ కమాండ్ కర్ణాటకలోని హసన్ నుంచి జరగనుంది. డిజిటల్ కమ్యూనికేషన్‌కు ఊతం జీశాట్-18 సమాచార ఉపగ్రహంతో దేశంలో డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. ఈ ఉపగ్రహంలో 24 సీబ్యాండ్, 12 ఎక్సెటెండెడ్ సీబ్యాండ్ ట్రాన్స్పాండర్లు, 12 కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్లతో పాటు 2 కేయూ బీకాన్ బ్యాండ్ ట్రాన్స్పాండర్లను అమర్చి పంపారు. అయితే ఇప్పటికే 12 ఇస్రో సమాచార ఉపగ్రహాలు అంతరిక్ష కక్ష్యలో పనిచేస్తూ 235 ట్రాన్స్పాండర్లతో దేశవ్యాప్తంగా డీటీహెచ్ ప్రసారాలు, టెలికం సేవలు అందిస్తున్నాయి. అయితే సమాచార రంగంలో రోజు రోజుకు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు 500 ట్రాన్స్పాండర్ల దాకా డిమాండ్ వుండగా, ఇస్రో పరిధిలో 235 టాన్స్పాండర్లు పనిచేస్తున్నాయి. అయితే సమాచార రంగంలో ఉన్న అవసరాన్ని తీర్చేందుకు వచ్చే మూడునాలుగేళ్లలో మరో 450 టాన్స్పాండర్లును అందుబాటులోకి తేవడాన్ని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. జీశాట్-18 ద్వారా శాటిలైట్ ఫోన్స్ అభివృద్ధి, డిజిటల్ మల్టీ మీడియా, మొబైల్ కమ్యూనికేషన్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని ఇస్రో ప్రకటించింది. రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు జీశాట్ ప్రయోగం విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ‘భారత అంతరిక్ష ప్రయోగ చరిత్రలో మరో మైలురాయిని అందుకున్నారు. ఇస్రోకు శుభాకాంక్షలు’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ‘సమాచార ఉపగ్రహ ప్రయోగం విజ యవంతమైనందుకు ఇస్రోకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని రాష్ట్రపతి ప్రణబ్ కూడా ట్వీట్ చేశారు. భారత్‌కు ఇది కీలకమైన ప్రయోగమని.. పనిచేసే కాలవ్యవధి పూర్తయిన ఉపగ్రహాల స్థానంలో కొత్తవాటిని పంపించి దేశంలో సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు ఇస్రో చైర్మన్ కిరణ్ తెలిపారు. ఏరియన్ స్పేస్‌కు కిరణ్ శుభాకాంక్షలు తెలిపారు. -
సుల్తాన్ తో వీడియోకాన్ డీ2హెచ్ అనుబంధం
హైదరాబాద్: యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన, సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమాతో డీటీహెచ్(డెరైక్ట్ టు హోమ్) సర్వీసులందజేసే వీడియోకాన్ డీ2హెచ్ వినూత్నమైన అనుబంధం ఏర్పర్చుకుంది. సుల్తాన్ సినిమాలో హీరోగా నటించిన సల్మాన్ ఖాన్ వీడియోకాన్ డీ2హెచ్ సంస్థ సేల్స్, సర్వీస్ ఫ్రాంచైజీగా వ్యవహరిస్తారని వీడియోకాన్ డీ2హెచ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొంది. ఈ వినూత్నమైన అనుబంధం కారణంగా భారత గ్రామీణ ప్రాంతాల్లో వీడియోకా న్ డీ2హెచ్‌కు మంచి ప్రచారం లభిస్తుందని కంపెనీ సీఈవో అనిల్ ఖేరా పేర్కొన్నారు. తమ తాజా ప్రచారం ‘ఖుషియోంకీ ఛత్రి’ కి ఈ సులా ్తన్ అనుబంధం కొనసాగింపని వివరించారు. కాగా వీడియోకాన్ డీ2హెచ్‌తో ఈ అనుబంధం సంతోషకరంగా ఉందని యశ్‌రాజ్ ఫిల్మ్స్ వైస్ ప్రెసిడెంట్ అశీష్ పాటిల్ పేర్కొన్నారు. -
నిరుపయోగంగా 3 కోట్ల డీటీహెచ్ ఎస్టీబీలు
* వీటి విలువ 750 మిలియన్ డాలర్లు * ముందస్తు సంప్రదింపుల పత్రంలో పేర్కొన్న ట్రాయ్ న్యూఢిల్లీ: దేశంలో దాదాపు 3 కోట్ల డీటీహెచ్ (డెరైక్ట్ టు హోమ్) సెట్ టాప్ బాక్స్‌లు (ఎస్టీబీ) నిరుపయోగంగా ఉన్నాయని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తెలిపింది. వీటి విలువ 750 మిలియన్ డాలర్లమేర ఉండొచ్చని అభిప్రాయపడింది. ‘ఒక ఆపరేటరుకు సంబంధించిన ఎస్టీబీతో వినియోగదారులు ఇతర ఆపరేటరు సిగ్నల్స్‌ను స్వీకరించడం సాధ్యపడదు. దీంతో వినియోగదారులు తమ ఆపరేటర్‌ను మార్చుకోవాలనుకుంటే అప్పుడు కొత్తగా మరొక ఎస్టీబీని కొనుగోలు చేయాల్సి వస్తోంది. అందుకే వీటి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే వాటిపై ఇన్వెస్ట్ చేసిన డబ్బు వృథా అవుతోంది. మరొకవైపు ఈ-వ్యర్థాలు కూడా పెరిగిపోతున్నాయి’ అని ట్రాయ్ తన ముందస్తు సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. డీటీహెచ్ ఆపరేటర్లు గతేడాది డిసెంబర్లో ట్రాయ్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం.. అవి 8.5 కోట్ల ఎస్టీబీలు సబ్‌స్క్రైబర్‌కు అందించాయి. ఇందులో 5.5 కోట్లు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. అంటే 3 కోట్ల ఎస్టీబీలు నిరుపయోగంగా ఉన్నట్లు లెక్క. ఒక్కొక్క ఎస్టీబీకి 25 డాలర్లు వేసుకున్నా మొత్తం ఎస్‌టీబీల విలువ 750 మిలియన్ డాలర్లు ఉంటుందని ట్రాయ్ తెలిపింది. -
సన్ డెరైక్ట్ మొబైల్ యాప్
హైదరాబాద్: డెరైక్ట్ టు హోమ్(డీటీహెచ్) సేవలందించే సన్ డెరైక్ట్ సంస్థ కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మై సన్ డెరైక్ట్ మొబైల్ యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌పై అందిస్తున్నామని సన్ డెరైక్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా క్విక్ రీచార్జ్ చేసుకోవచ్చని, ప్యాకేజీల, డిస్కౌంట్లు, ఆఫర్ల వివరాలను తెలుసుకోవచ్చని వివరించింది. వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వినూత్నమైన ప్యాకేజీలను అందిస్తున్నామని, ఎస్డీ, హెచ్డీ బాక్సుల ద్వారా ఉచితంగా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చని తెలిపింది. సన్ షైన్ స్టోర్స్ పేరుతో దేవ్యాప్తంగా 300 ఎక్స్‌క్లూజివ్ సర్వీస్ సెంటర్లను నిర్వహిస్తున్నామని సన్ డెరైక్ట్ పేర్కొంది. -
వీడియోకాన్ వైఫై స్మార్ట్ హెచ్ డీ సెట్ టాప్ బాక్స్
హైదరాబాద్: డెరైక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో ఉన్న వీడియోకాన్ డీ2హెచ్ తాజాగా ఇన్‌బిల్ట్ వైఫైతో స్మార్ట్ హెచ్డీ సెట్ టాప్ బాక్స్‌ను రూపొందించింది. దీనితో ఎల్ఈడీ టీవీ కాస్తా స్మార్ట్ టీవీగా మారిపోతుంది. సామాజిక మాధ్యమాలైన ట్విటర్, ఫేస్‌బుక్‌తోపాటు వీడియో షేరింగ్ వెబ్సైట్ అయిన డైలీ మోషన్, మూవీస్, ఓవర్ ద టాప్ యాప్స్, వీడియో ఆన్ డిమాండ్ సైట్లు వీక్షించొచ్చు. మొబైల్ ఇంటర్నెట్, వైఫై, కేబుల్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా ఈ సెట్ టాప్ బాక్స్‌కు కనెక్ట్ అవ్వొచ్చు. ఎక్స్టర్నల్ రికార్డింగ్ సౌకర్యం కూడా ఉంది. తదుపరి తరం ఉత్పత్తుల తయారీలో సంస్థ సామర్థ్యానికి ఇది నిదర్శనమని వీడియోకాన్ డీ2హెచ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సౌరభ్ ధూత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 525 చానెళ్లు, సర్వీసులను కంపెనీ అందిస్తోంది. -
జనవరి నుంచి డిజిటల్ టీవీ ప్రసారాలు
సాక్షి, హైదరాబాద్: జనవరి 1 నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో కేబుల్ టీవీ ప్రసారాలు పూర్తిస్థాయి డిజిటల్ రూపంలోకి మారనున్నాయి. దీంతో ఇక ప్రతి కేబుల్ టీవీకీ సెట్‌టాప్ బాక్స్ లేదా డీటీహెచ్ ఏర్పాటు తప్పనిసరిగా మారింది. ఇందుకు టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. ఇప్పటికే కేబుల్ టీవీలకు సెట్‌టాప్ బాక్స్‌ల ఏర్పాటు కోసం రెండు విడతలుగా గడువు విధించి.. అనలాగ్, డిజిటల్ రెండు రకాల ప్రసారాలకూ వెసులుబాటు కల్పించింది. తాజాగా మూడో విడత గడువు విధించి పూర్తిస్థాయి డిజిటలైజేషన్ అమలుకు మల్టీ సిస్టమ్ ఆపరేటర్ల (ఎమ్ఎస్ఓ)కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అనలాగ్ ప్రసారాలను జనవరి నుంచి పూర్తిగా నిలిపేస్తూ కేవలం డిజిటల్ ప్రసారాలు మాత్రమే అందించేందుకు ఆపరేటర్లు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 25 లక్షల టీవీ కనెక్షన్లు ఉన్నాయి. నగరంలో ఎమ్‌ఎస్‌వోగా ఉన్న సిటీ కేబుల్, హాత్వే, డీజీ కేబుల్, ఆర్వీఆర్, భాగ్యనగర్, ఇన్ డిజిటల్ సంస్థలు కేబుల్ ప్రసారాలు అందిస్తున్నాయి. ఇప్పటికే ఈ సంస్థలు తమ కేబుల్ ఆపరేటర్ల ద్వారా సుమారు 13 లక్షల వరకు సెట్‌టాప్ బాక్స్‌లు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇవికాక సుమారు నాలుగు లక్షల వరకు డీటీహెచ్లు ఉన్నాయి. దీంతో ఇప్పటివరకు నగరంలో 68 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు తెలుస్తోంది. సెట్‌టాప్ బాక్స్‌లను దాని శ్రేణిని మట్టి రూ.1,100 నుంచి 1,600 వరకు విక్రయిస్తున్నారు. -
డీటీహెచ్, కేబుల్ నెట్వ ర్క్స్‌లో ఎఫ్‌డీఐ పరిమితి పెంపు?
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్ సర్వీసులతోపాటు డీటీహెచ్, కేబుల్ నెట్వర్క్స్ విభాగాల్లో ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) పరిమితిని 100 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం కేబుల్ నెట్వర్క్స్, డీటీహెచ్, మొబైల్ టీవీ, హెచ్ఐటీఎస్, టెలిపోర్ట్స్లలో 74 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని 100 శాతానికి పెంపు ప్రతిపాదనలను మంత్రిత్వ కమిటీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. న్యూస్, కరెంట్ అఫైర్స్ టీవీ చానల్స్ విషయంలో ప్రస్తుతం ఉన్న 26 శాతం ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచాలనే చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. ఈ ప్రతిపాదనలను 2013లో ట్రాయ్ రూపొందించింది. -
డీటీహెచ్‌కు పెరుగుతున్న ఆదరణ
⇒ టాటా స్కై చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ మలయ్ దీక్షిత్ ⇒ మార్కెట్లోకి టాటాస్కై ‘నా 99’ స్కీం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ టీవీ ప్రసారాలు వేగంగా విస్తరిస్తున్నాయని, మూడేళ్లలో టీవీ ఉన్న కుంటుంబాల సంఖ్య 20 కోట్లకు దాటుతుందని టాటా స్కై అంచనా వేస్తోంది. ప్రస్తుతం దేశంలో టీవీ కలిగిన కుటుంబాల సంఖ్య 14 కోట్లుగా ఉందని టాటా స్కై చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ మలయ్ దీక్షిత్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సగటు చందాదారుని ఆదాయంలో ఏటా 20 శాతం వృద్ధి నమోదవుతోందన్నారు. రెండేళ్ళ క్రితం చందాదారుడు నెలకు చెల్లిస్తున్న సగటు అద్దె రూ. 200 ఉండగా ఇప్పుడిది రూ.250కి చేరిందన్నారు. ప్రపంచదేశాల సగటుతో పోలిస్తే భారతీయులు చెల్లిస్తున్న అద్దె చాలా తక్కువని అన్నారు. 2018 నాటికి సగటు చందాదారుడు చెల్లించే నెల అద్దె రూ. 320 నుంచి రూ. 350కి చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఆయన ‘నా 99’ స్కీంను మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. ఇది బేసిక్ స్కీమ్. దీనికింద చందాదారుడు నెలకు రూ.99తో తెలుగు, ఇతర భాషలు, ఇంగ్లీష్ న్యూస్, స్పోర్ట్స్, సినిమాలు ఇలా కావల్సిన చానల్స్‌ను ప్యాకేజీల రూపంలో తీసుకోవచ్చు. -
సెట్ టాప్ బాక్స్ అక్కరలేదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెరైక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో ఎయిర్టెల్ మరో ముందడుగు వేసింది. అంతర్గతంగా స్మార్ట్ కార్డ్ కలిగిన ఇంటెగ్రేటెడ్ డిజిటల్ టీవీలను (ఐడీటీవీ) శామ్సంగ్తో కలిసి భారత్‌లో తొలిసారిగా ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ టీవీల కు సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుం డానే డిజిటల్ ప్రసారాలను వీక్షించొచ్చు. ఐడీటీవీల ప్రత్యేకత ఏమంటే సిగ్నల్ నష్టాలను తగ్గిస్తాయి. ఒకే రిమోట్‌తో టీవీ ఆపరేట్ చేయొచ్చు. యాంటెన్నా నుంచి టీవీ వరకు తక్కువ వైర్లుంటాయి. విద్యుత్ 10% ఆదా అవుతుంది. ఇక పిక్చర్, శబ్దం నాణ్యతా బాగుంటుంది. శామ్సంగ్ స్మార్ట్ యాప్స్‌తోపాటు ఇన్ బిల్ట్ వైఫై కూడా ఉంది.శామ్సంగ్ హెచ్డీ ఎల్ఈడీ స్మార్ట్ డెరైక్ట్ టీవీల ధర రూ.44,900 నుండి ప్రారంభం. శామ్సంగ్ ప్లాజా, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఔట్‌లెట్లలోనూ ఇవి లభిస్తాయి. పరిచయ ఆఫర్లో రూ.2,851 విలువగల ఎయిర్టెల్ మెగా హెచ్డీ డీటీహెచ్ ప్యాక్ 4 నెలలు ఉచితం. వీక్షణలో కొత్త అధ్యాయం..: టీవీ వీక్షణలో ఐడీటీవీలు నూతన ఒరవడి సృష్టిస్తాయని భారతి ఎయిర్టెల్ డీటీహెచ్, మీడియా సీఈవో శశి అరోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. టెక్నాలజీ, సౌకర్యం వీటి ప్రత్యేకతన్నారు. వీటి అభివృద్ధికి భారీగా వ్యయం చేశామన్నారు.యూఎస్, ఈయూ వంటి దేశాల్లో ఈ టెక్నాలజీ ప్రాచుర్యంలో ఉందన్నారు. ఐడీటీవీ కస్టమర్ల కోసం ప్రత్యేక బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లను ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. కాగా, హెచ్డీఎంఐ కేబుల్‌తో ఇతర కంపెనీల సెట్ టాప్ బాక్స్‌ను సైతం ఈ టీవీలకు అనుసంధానించుకోవచ్చు. -
రాష్ట్రంలో వొడాఫోన్ ఎం-పెసా సేవలు షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ వొడాఫోన్ ఆంధ్రప్రదేశ్‌లో మొబైల్ మనీ సేవలు ‘ఎం-పెసా’ ప్రారంభించింది. వొడాఫోన్ కస్టమర్లు తమ మొబైల్ ఫోన్ ద్వారా మరే ఇతర టెలికం ఆపరేటర్లకు చెందిన మొబైల్ ఫోన్‌కుగానీ, బ్యాంకు ఖాతాకుగానీ దేశంలో ఎక్కడున్నా నగదు పంపవచ్చు. ఈ మొత్తాన్ని స్వీకరించినవారు సమీపంలోని వొడాఫోన్ ఎం-పెసా కేంద్రానికి వెళ్లి నగదు స్వీకరించవచ్చు. బిల్లుల చెల్లింపులు, మొబైల్, డీటీహెచ్ రిచార్జ్ చేసుకోవచ్చు. ఎంపిక చేసిన దుకాణాల్లో మొబైల్ ద్వారా చెల్లించవచ్చు. ఇ-కామర్స్ సైట్లలో వస్తువులను కొనుక్కోవచ్చు. డిపాజిట్‌పై 4 శాతం వడ్డీ కూడా పొందవచ్చు. బతుకుదెరువు కోసం కుటుంబానికి దూరంగా ఉంటున్నవారికి ఇది ఎంతో ఉపయుక్తమని ఎం-పెసా బిజినెస్ హెడ్ సురేశ్ సేథి బుధవారమిక్కడ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి కంపెనీ ఈ సేవలను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3,826 ఎం-పెసా ఔట్లెట్లు ఉన్నాయని ఏపీ సర్కిల్ బిజినెస్ హెడ్ మన్దీప్ సింగ్ భాటియా పేర్కొన్నారు. ఇలా పనిచేస్తుంది..: వొడాఫోన్ కస్టమర్ తన ఫోన్ నుంచి గానీ, సమీపంలోని ఎం-పెసా ఔట్‌లెట్‌కు వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే ఫోన్ నంబరు ఆధారంగా ఒక ఖాతా(వాలెట్) తెరుస్తారు. పేరు నమోదుకు రూ. 200, యాక్టివేషన్‌కు రూ.100 రుసుం చెల్లించాలి. వాలెట్లో రూ.50 వేల వరకు డబ్బు జమ చేసుకోవచ్చు. నగదు స్వీకరించేవారికి ఎం-పెసా వాలెట్ ఉం డక్కరలేదు. రోజుకు రూ.5 వేలు, నెలకు రూ.25 వేల వరకే పంపొచ్చు. లావాదేవీనిబట్టి రూ.1-180 దాకా చార్జీ చేస్తారు. ఏపీలో అడుగు పెట్టడంతో ఎం-పెసా సేవలు దేశవ్యాప్తంగా విస్తరిం చినట్లయిందని వొడాఫోన్ ఇండియా సీవోవో సునిల్ సూధ్ తెలిపారు. -
ఎయిర్టెల్ ఏంజెల్ స్టోర్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఏంజెల్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. కేవలం మహిళా ఉద్యోగులే వీటిని నిర్వహిస్తారు. స్టోర్‌లో 10 మంది వరకు సిబ్బంది ఉంటారు. ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్‌లోని పాట్న నగరంలో తొలి స్టోర్ ఉంది. నెల రోజుల్లో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏర్పాటవుతోంది. స్టోర్‌లో పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లేయింగ్ జోన్ ఉంటుంది. కొత్త కనెక్షన్, డీటీహెచ్, రీచార్జ్ సేవలతోపాటు మొబైల్ ఫోన్లు ఇక్కడ విక్రయిస్తారు. వన్ స్టాప్ షాప్‌గా సేవలందిస్తారు. ఎయిర్టెల్ ఉద్యోగులే నేరుగా పనిచేస్తారు కాబట్టి ఈ సేవలు వేగంగా జరుగుతాయి. మహిళలకు ఉద్యోగావకాశాల కల్పనలో భాగంగా ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఎయిర్టెల్ చెబుతోంది. మహిళా ఉద్యోగులు మరింత స్నేహపూర్వకంగా ఉంటారని అంటోంది. సొంత స్టోర్ల విస్తరణ.. దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ సొంత స్టోర్లను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటి వరకు 100 స్టోర్లు రాగా, ఇందులో 14 హైదరాబాద్‌లో, 2 వైజాగ్‌లో నెలకొన్నాయి. సీమాంధ్ర, తెలంగాణలో 2014-15లో ఇటువంటివి 25 దాకా రానున్నాయని ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీఈఓ వెంకటేశ్ విజయ్‌రాఘవన్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఎయిర్‌టెల్‌కు టాప్-3 సర్కిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఉందని, ఈ ప్రాంతంలో 3జీతోపాటు ప్రస్తుత నెట్వర్క్ విస్తరణపై దృష్టిపెట్టామన్నారు. ఎయిర్టెల్ స్టోర్లలో ప్రతిరోజు 500-600 మంది కస్టమర్లు అడుగుపెడుతున్నారు. కాగా, నైట్ స్టోర్ పేరుతో ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం వివిధ ప్యాక్‌లను కంపెనీ ప్రకటించింది. ఇందులో భాగంగా రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు ఫేస్బుక్, ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ కాల్స్, 2జీ డాటా అపరిమితంగా వినియోగించుకోవచ్చు. ప్యాక్‌ల ధర రూ.7-49 వరకు ఉంది. -
'లైవ్ టీవీ 'యాక్షన్ షురూ!
దేశంలో మొదలైన మొబైల్ టీవీ విప్లవం డీటీహెచ్ సంస్థల ప్రవేశంతో పోటాపోటీ ఒక్క ఏడాదిలోనే 89% వృద్ధి చెందిన స్మార్ట్ఫోన్లు వాటి సాయంతో భారీగా విస్తరిస్తున్న మొబైల్ టీవీ మార్కెట్ హైదరాబాద్: ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సుకుమార్... తీరా ఆ రోజు వచ్చేసరికి మాత్రం టీవీ చూడలేకపోయాడు. అర్జెంటు పనిమీద ఊరికి బయల్దేరాడు. మనసంతా ఫలితాలపైనే ఉండటంతో... ప్రతి 10 నిమిషాలకోసారి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. బస్సులో పక్కవాళ్లు విసుక్కున్నారు కూడా. కాకపోతే... ఇదంతా ఐదేళ్ల కిందటి మాట. ఇప్పుడు సుకుమార్‌కే కాదు... చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నవాళ్లెవ్వరికీ ఇలాంటి అవసరం లేదు. ఎందుకంటే ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు. కావలసిన చానెల్ మార్చుకోవచ్చు. చేతిలో ఫోన్ పట్టుకుని దాన్లో టీవీ చూసేయొచ్చని పదేళ్ల కిందట కొందరు ఊహించినా... అది ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకుని ఉండరు. ఇప్పటికే ఆలస్యమైందని కొందరు భావిస్తున్నా... స్మార్ట్ఫోన్లలో లైవ్‌టీవీ విప్లవం ఇండియాలో రానేవచ్చింది. అతివేగంగా పెరుగుతున్న స్మార్ట్ఫోన్ల వినియోగం ఈ విప్లవాన్ని మరింత ఎగదోస్తోంది. ఈ ఏడాదిలో చేసిన స్మార్ట్‌ఫోన్ ఇన్సిడెన్స్, నీల్సన్ ఇన్ఫర్మేట్ మొబైల్ ఇన్సైట్ల అధ్యయనాన్ని కలిపి చూస్తే... ఒక్క పట్టణ భారతంలోనే దాదాపు 5.1 కోట్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులున్నారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 89 శాతం వృద్ధి చెందినట్లు లెక్క. ఎందుకంటే 2012 నాటికి ఉన్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 2.7 కోట్ల మందే. టాటా స్కై సంస్థ చెబుతున్నదాని ప్రకారం దాని కస్టమర్లలో 60% మంది వీడియోలను మొబైల్లో చూస్తున్నవారే. దీనికితోడు డేటా, వైఫై సేవలు విస్తరించటం, ఎలాంటి మల్టీమీడియా కంటెంట్‌నైనా హ్యాండిల్ చేసే శక్తిమంతమైన మొబైల్స్ మార్కెట్లోకి రావటంతో వీటికి ఆకాశమే హద్దవుతోంది. రంగంలోకి దిగ్గజాలు... మొబైల్‌లోకి లైవ్‌టీవీ రావ టానికి ప్రధాన కారణం ప్రధాన డీటీహెచ్ సంస్థలన్నీ ఈ రంగంలోకి ప్రవేశించటమేనని స్పష్టంగా చెప్పొచ్చు. డిష్ టీవీ ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లలో లైవ్‌టీవీ చూసేందుకు వీలైన ‘డిష్ ఆన్లైన్’ అప్లికేషన్‌ను విడుదల చేసింది. బోలెడన్ని కేటగిరీలు, చానెళ్లున్న ఈ అప్లికేషన్‌ను రూ.49కే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఆన్లైన్ స్ట్రీమింగ్‌ను ‘డిట్టో టీవీ’ అందిస్తోంది. అయితే డిష్ పోటీదారు టాటా స్కై మరో అడుగు ముందుకేసి ‘ఎవ్రీవేర్ టీవీ’ పేరిట కొత్త అప్లికేషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. టీవీ చూడటానికే కాక... దాన్ని రికార్డ్ చేసుకోవడానికీ వీలు కల్పించటం దీని ప్రత్యేకత. వీడియో ఆన్ డిమాండ్‌తో పాటు వారం కిందటి టీవీ షోలు కూడా చూపించే ఈ యాప్‌కు టాటా స్కై నెలకు రూ. 60 వసూలు చేస్తోంది. ఇక ఎయిర్టెల్ డిజిటల్ టీవీ.. వినియోగదారులు లైవ్‌టీవీ చూస్తూనే ట్వీట్ చేసుకోవటం, ఇతరులతో మాట్లాడటం వంటి అవకాశాల్ని కల్పిస్తోంది. ఈ ట్వీట్లు ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో ప్రసారమవుతాయి కూడా. ఇక డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లతో పాటు ఇండిపెండెంట్ యాప్ డెవలపర్లూ ఈ రంగంపై సీరియస్‌గా దృష్టిపెట్టారు. టీవీ షోలు చూస్తూ వాటి గురించి, ఇతరత్రా మాట్లాడుకునేవారు ఎక్కువవుతుండటంతో ఆ రకంగా సోషల్ నెట్‌వర్కింగ్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే వీటికి చిన్నచిన్న పరిమితులూ ఉంటున్నాయి. టాటా స్కై యాప్‌కు ఐఫోన్ వెర్షన్ తప్ప ఆండ్రాయిడ్ వెర్షన్ ఇంకా రాలేదు. హెచ్డీఎంఐ కంటెంట్‌ను మొబైల్ ద్వారా మెయిన్ టీవీలో నేరుగా ప్రసారం చేసే అవకాశం లేదు. ఇన్ని పరిమితులున్నా... కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ మధ్య లైవ్‌టీవీ విస్ఫోటనం స్థాయికి వెళ్లటానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. ఫ్రీగా చూడొచ్చు కూడా... మొబైల్, కంప్యూటర్, స్మార్ట్ టీవీ... ఇలా ఎక్కడైనా యప్‌టీవీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే న్యూస్ చానెళ్ల వరకూ ఉచితంగానే వస్తున్నాయి. చాలా చానెళ్లు వాటి లైవ్ టీవీలను ఫ్రీగానే ఇస్తున్నాయి. వీటికి ఇంటర్నెట్ చార్జీలు తప్ప... టీవీకంటూ ఎలాంటి చార్జీలూ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇంకా నెక్స్ జి టివి, ఇండియా లైవ్‌టీవీ వంటి యాప్స్ కూడా చాలానే ఉన్నాయి.