భారతీయ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తన డిజిటల్ చెల్లింపు సర్వీసులను విస్తరించేందుకు బిల్‌డెస్క్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని పేర్కొంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్‌లు, ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ పోస్ట్‌పెయిడ్ బిల్లు చెల్లింపులను అందిస్తున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ పేమెంట్స్ అండ్ సూపర్‌కాయిన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ అరోరా మాట్లాడుతూ..‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసిన భారత్ బిల్ పేమెంట్స్ సిస్టమ్ (బీబీపీఎస్)తో కొత్త సేవలను ఏకీకృతం చేయడానికి బిల్‌డెస్క్‌తో కుదిదిన ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది. కంపెనీ అందిస్తున్న ఈ సేవలకు అదనంగా విద్యుత్ బిల్లు చెల్లింపులు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ద్వారా లావాదేవీలు చేసి 10 శాతం వరకు సూపర్‌కాయిన్లను రెడీమ్ చేసుకోవచ్చు. కస్టమర్ల కోసం డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయడానికి, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది’ అని చెప్పారు.
ఇదీ చదవండి: వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!
2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారా దేశమంతటా సుమారు 1.3 బిలియన్(130 కోట్లు) లావాదేవీలు జరుగుతాయని సమాచారం. 2026 నాటికి ఈ సంఖ్య 3 బిలియన్ల(300 కోట్లు)కు పైగా ఉంటుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment